వైరస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కి → కి (2), గా → గా , ఉద్దేశ్యము → ఉద్దేశము, ఖచ using AWB
+మాక్స్‌ డెల్‌బ్రక్ లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 24:
 
=== వైరస్‌ల అధ్యయనం ===
వైరస్‌లు బాక్టీరియాపై దాడి చేయగలవని 20వ శతాబ్ద ప్రారంభంలో ఫ్రెడెరిక్ త్వార్ట్ కనుగొన్నాడు. ఫెలిక్స్ డి'హెరెల్, వైరస్‌ను కలిగిన ప్రిపరేషన్ను పలుచటి కణాలు వర్ధిల్లుతున్న మేట (కల్చర్) కలిగిన అగార్ ప్లేట్ పైన వేయగా, వైరస్‌లు ఉన్న ప్రదేశంలోని కణాలు చనిపోయాయని గుర్తించాడు. చనిపోయిన ప్రదేశాలను లెక్కించి సస్పెన్షన్లో ఉన్న వైరస్‌ల సంఖ్యను లెక్కకట్టాడు. [[ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్]] ఆవిష్కరించబడిన తర్వాత మొట్టమొదటి సారిగా వైరస్‌లను చూడగలిగారు. [[1935]]లో వెండెల్ స్టాన్లీ, టొబాకో మొజాయిక్ వైరస్‌ను స్ఫటికీకరించి (క్రిస్టలైజ్), అందులో అత్యధిక శాతం ప్రోటీన్లే (మాంసకృతులే) నని నిర్ధారించాడు. [[1939]]లో [[మాక్స్‌ డెల్‌బ్రక్|మాక్స్ డెల్‌బ్రూక్]] మరియు ఇ.ఎల్.ఎల్లిస్ ఒకే దశలో ఫేజ్‌లు ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయని కనుగొన్నారు.
 
వైరస్‌లను మామూలుగా ఇతర కణాలను కల్చర్ చేసినట్టు చేయడం వీలయ్యేది కాదు అందువల్ల జంతువులపై ఈ వైరస్‌లచే దాడి చేయించేవారు. ఇలాంటి ప్రయోగాలు అప్పటి వైరాలజిస్ట్‌లకు ఎదురైన ఇబ్బందుల్లో ముఖ్యమైనవి. [[1931]]లో ఎర్నెస్ట్ విలియం గుడ్ పాశ్చర్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను పరిపక్వమైన కోడి గుడ్డులో పెంచాడు. కాని అన్ని రకాల వైరస్లు కోడి గుడ్లలో పెరగలేదు, అందువల్ల ఇంకా ఎక్కువ వాడకం కల పద్ధతి అవసరం ఏర్పడింది. [[1949]]లో జాన్ ఫ్రాన్క్లిన్ ఎండర్స్, థామస్ హెచ్.వెల్లర్ మరియు ఫ్రెడరిక్ చాప్మన్ రాబిన్స్ కలిసి పోలియో వైరస్‌ను సజీవమయిన జంతు కణాల కల్చర్‌లో పెంచారు. అప్పటి నుంచి వారి పద్ధతిలో చిన్నాచితకా మార్పులు చేస్తూ మిగతా వైరస్‌లను కూడా సెల్ కల్చర్‌లలో పెంచడం మొదలయింది.
"https://te.wikipedia.org/wiki/వైరస్" నుండి వెలికితీశారు