ఒమన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (4), ) → ) using AWB
+బారెల్ లింకు
పంక్తి 322:
1956లో జరిగిన పెట్రోలియం అన్వేషణ విఫలమైంది. 1960నాటికల్లా దాదాపు అందరు భాగస్వాములూ అన్వేషణ కార్యక్రమంనుండి విరమించుకొన్నారు. ''రాయల్ డచ్ షెల్'' కంపెనీ తమ కార్యకలాపాలను కొనసాగించింది. 1962లో వారు 'ఫాహుద్' వద్ద మొదటిసారి పెట్రోలియమ్ నిక్షేపాలు కనుగొన్నారు. (ఆ స్థలానికి కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలోనే అంతకు ముందు వేసిన బోరు విఫలమైంది!). తరువాత మరి రెండు కంపెనీలు కలిసి ''పెట్రోలియమ్ డెవలప్‌మెంట్ ఒమన్'' స్థాపించారు. అది [[1967]] [[జూలై 2]] నుండి పెట్రోలియమ్ ఎగుమతులు ప్రారంభించింది. తరువాత ఒమన్‌లో పెట్రోలియమ్, గ్యాస్ అన్వేషణ, తవ్వకం, ఎగుమతులు విజయవంతంగా కొనసాగాయి. 1980 మే 5న రాజ శాసనం ప్రకారం ''పెట్రోలియమ్ డెవలప్‌మెంట్ ఒమన్'' ఒక ''లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ'' అయ్యింది.
 
ప్రస్తుతం ఒమన్ రోజుకు 7,00,000 [[బారెల్ (ప్రమాణము)|బ్యారెళ్ళ]] (1,10,000 ఘనపుటడుగులు) క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నది. ఇటీవల సహజవాయువు ఉత్పత్తి, ఎగుమతి కూడా వృద్ధి చెందాయి. మొత్తం దేశం ఎగుమతులలో పెట్రోలియమ్ వాటా 90%. ఒమన్ [[పెట్రోలియమ్ ఎగుమతి చేసే దేశాల సంఘం]], ఒపెక్ (OPEC) లో భాగస్వామి కాదు గాని స్వచ్ఛందంగా వారి ధరకే విక్రయిస్తుంది. ఇలా లభించిన ధనం ఒమన్ అభివృద్ధికీ, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకీ పెద్దయెత్తున వినియోగమవుతుంది. 2000 తరువాత పెట్రోలియమ్ ధరలు విపరీతంగా పెరగడంతో మిగిలిన పెట్రోలియమ్ ఉత్పత్తి దేశాల లాగానే ఒమన్ ఆర్థిక వ్యవస్థ బాగా బలపడింది.
 
== ఫలాజ్, ఆఫ్లాజ్, వాడి ==
"https://te.wikipedia.org/wiki/ఒమన్" నుండి వెలికితీశారు