వీరాభిమన్యు (1965 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
సుభద్ర(ఎస్.వరలక్ష్మి)కు అర్జునుడు (కాంతారావు) పద్మవ్యూహ ప్రవేశ నిర్గమన వివరాల్లో ప్రవేశ వివరాలు పూర్తిచేశాకా, బయటపడడం చెప్తూండగా కృష్ణుడు (ఎన్.టి.ఆర్.) ప్రవేశించి వారిస్తాడు. కృష్ణుడు అర్జునునికి సుభద్ర నిద్రిస్తోందని, గర్భస్థ శిశువు అంతవరకూ వ్యూహాన్ని విన్నాడని, పుట్టినవాడు లోకైక వీరుడు అవుతాడని చెప్తాడు.
 
కొన్నేళ్ళకు ద్వారకలో కృష్ణుడు సుభద్రకు పాండవుల అజ్ఞాత వాసం గురించి చెప్తాడు. అస్త్రవిద్యా ప్రదర్శనలో పెరిగి పెద్దవాడైన అభిమన్యుడు (శోభన్ బాబు) చూపిన నైపుణ్యానికి బలరాముడు రుద్ర ధనుస్సు బహూకరిస్తాడు. దానికి అసూయతో లక్ష్మణకుమారుడు (నాగరాజారావు) అభిమన్యుణ్ణి నిందిస్తాడు. కోపంతో అతన్ని వెంటాడుతూ పోయిన అభిమన్యుడు విరాట రాజ్యానికి చేరుకుని, ఉద్యానవనంలో విరాట రాజకుమారి ఉత్తర (కాంచన)ని చూడగా, పరస్పరం తొలిచూపులనే ప్రేమించుకుంటారు.
 
==పాటలు==