ధన్వంతరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
ధన్వంతరి [[ఆలయాలు]] ప్రత్యేకంగా కనిపించడం అరుదు. [[వారాణసి]]లోని [[సంస్కృత విశ్వవిద్యాలయం]] మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. [[ఢిల్లీ]]లోని "ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం" (Central council for Research in Aurveda and Siddha) లో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి.
 
[[తమిళనాడు]] లోని [[శ్రీరంగం]] రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య [[పూజలు]] జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద [[వైద్యుడు]] గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో[[మందిరం]]లో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు.
 
[[కేరళ]]లో, [[గురువాయూర్]], [[త్రిస్సూర్]]‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది [[గురువాయూర్]] దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. తమ చికిత్సావృత్తి ప్రాంభానికి ముందు చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు.
 
కేరళలోనే [[కాలికట్]] పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/ధన్వంతరి" నుండి వెలికితీశారు