శోభారాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
==అన్నమయ్య సంకీర్తనలు==
ఆమె చిన్నప్పటి నుంచి అన్నమాచార్య వేదికలమీద అన్నమయ్య సంకీర్తనలు గానం చేసేది. పాఠశాల స్థాయిలోనే అనేక పురస్కారాలు అందుకుంది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు పెండ్యాల, సాలూరి రాజేశ్వర రావు, రమేష్ నాయుడు, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం తదితరుల చేతుల మీదుగా అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది. ఎస్. రాజేశ్వరరావు ఆమెను చెన్నైకు ఆహ్వానించి రెండు పాటలను కూడా రికార్డు చేశాడు. [[కామిశెట్టి శ్రీనివాసులు]] ఆమెకు అన్నమాచార్య కీర్తనలకు మార్గం సూచించారు. ఆమెకు శిక్షణ ఇచ్చారు. 1976లో అన్నమయ్య పాటలను అధ్యయనం చేయడం ప్రారంభించింది. అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా పనిచేసి, హైదరాబాదు నగరంలో [[అన్నమయ్యపురం]] ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.1982అన్నమాచార్య లోప్రాజెక్టు రామదాసుతర్వాత ప్రాజెక్టులో1982 ఉద్యోగం.లో అన్నయ్యదేవాదాయ వాళ్లింట్లోధర్మాదాయ ఉండిశాఖ [[దిల్‌సుఖ్‌నగర్‌]]ఆధ్వర్యంలో నుంచిరామదాసు ఆఫీసుకుప్రాజెక్టులో వెళ్ళేవారుపనిచేసింది. ట్యాంక్‌బండ్‌ మీద [[అన్నమయ్య]] విగ్రహం కోసం కృషిచేశారు.
 
1983లో అన్నమాచార్య భావనా వాహిని అనే పేరుతో స్వంతంగా ప్రాజెక్టు ప్రారంభించింది. అన్నమయ్య వర్ధంతితో పాటు జయంతి, నగర సంకీర్తనం, సంగీత ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా వేలాది మందికి సంగీతంలో శిక్షణ ఇచ్చింది. సంగీతంలో జబ్బులు నయం అవుతాయని నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి ప్రయోగాత్మకంగా నిరూపించింది. మనుషుల్లో మానసిక పరివర్తన కోసం కూడా సంగీతం ఉపయోగపడుతుందని జైళ్ళకు వెళ్ళి సంకీర్తనలు గానం చేశారు. తంజావూరులోని సరస్వతి గ్రంథాలయంలో పరిశోధన చేసి మరుగున పడిఉన్న 39 అన్నమయ్య సంకీర్తనలు వెలుగులోకి తీసుకువచ్చింది. భారత ప్రభుత్వం అన్నమయ్యపై తపాలా బిళ్ళ విడుదల చేసేందుకు కృషి చేసింది. ట్యాంక్‌బండ్‌ మీద [[అన్నమయ్య]] విగ్రహం కోసం కృషి చేసింది. కేవలం భారతదేశంలోనే కాక అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాల్లో కూడా అన్నమయ్య పాటలకు ప్రాచుర్యం తీసుకువచ్చింది. అన్నమయ్య టెలీ సీరియల్ కు రచన, మాటలు, సంగీతంతో పాటు దర్శకత్వం వహించింది.
 
== సంగీత శిక్షణ ==
"https://te.wikipedia.org/wiki/శోభారాజు" నుండి వెలికితీశారు