కవిసంగమం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
== ప్రారంభం ==
'''కవిసంగమం''' [https://www.facebook.com/groups/kavisangamam/ ఫేస్ బుక్ కవిసంగమం సమూహం] చిన్ని ప్రయత్నంతో 2012 లో ప్రారంభం అయింది. ప్రముఖ [[కవి యాకూబ్]] దీనికి నాంది పలికారు. అంతర్జాలంలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకొని ఫేస్ బుక్ చేస్తున్న వివిధమైన సామాజిక చలనాలను (సోషల్ డైనమిక్స్) గమనించి తెలుగు కవులకు ఒక మంచి వేదికగా దీన్ని మలచుకోవచ్చు అనే ఆలోచన ఈయన దీనిని రూపొందించారు. అతనికి వ్యక్తిగతంగా పాతిక ఏండ్లుగా పరిచయమైన కవి ప్రపంచాన్ని ముఖ్యంగా ఇప్పుడిప్పుడే గొంతువిప్పుతున్న వారు ఆధునిక నెట్ ప్రపంచాన్ని తెలుసుకున్న యువతీ యువకులైన కవులను ఒకచోటికి తేగలిగారు. ఈ రెండు సంవత్సరాలలో ఇది బాగా వ్యాప్తి చెందినది. ఇప్పటివరకున్న వివరాల ప్రకారం 200 మందికి పైగా కవులు, 4,300 మందికి పైగా కవితాభిమానులు ఈ వేదికలో పాలుపంచుకుంటున్నారు.<ref name="చిక్కని కవిత్వంతో చక్కని సంకలనం
తెలుగులో ఒక కవి సుమారు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు కవిత్వం రాసి లేదా ఒక ఏడాదిలో రాసిన కవితలను అన్నింటిన ఒక కవితా సంకలనంగా తెచ్చి, మరికాస్త కష్టపడి దానికి డబ్బుఖర్చూ పెట్టి పుస్తకావిష్కరణ చేయిస్తాడు. ఎవరో ఒక మంచి అనుభవజ్ఞుడో పేరున్నవాడో వచ్చి దాన్ని ఆవిష్కరిస్తాడు. రెండో రోజు పేపర్లో వార్త వస్తుంది. కాని ఆ పుస్తకాన్ని ఎవరు చదువుతారు. సదరు కవే ఒక వంద కాని రెండు వందల కాపీలు కాని తనకు తెలిసనవారికి పోస్టులో, ఆ ఖర్చులూ ఆయనే పెట్టుకొని పంపిస్తాడు. ఆ వందమందిలో కనీసం ఒక పాతిక మంది దాన్ని చదువుతారో లేదో. అందులో ఒక నలుగురు ఆయిదుగురు కాస్త వ్యక్తిగత క్రమశిక్షణ, మంచి బుద్ధీ ఉన్నవారు. మీ కవితలు బాగున్నాయని ఒక నెలకో ఏడాదికో ఉత్తరం రాస్తారు. దానికి ఈ అల్పసంతోషి అయిన కవి ఎంతో సంతోషిస్తాడు.
తెలుగు కవులకు నిన్న మొన్నటిదాకా ఉన్న పరిస్థితి ఇది. కాని
ఒక కవి తన కవితను రాసిన తర్వాత ఏ మాత్రం ఎడం లేకుండా అంటే రాత్రి కవితను రాస్తే తెల్లవారి పాటికి తన బృందంలోని సుమారు 200 మంది కవిత్వంపైన ప్రేమ ఉన్న పాఠకులకు అందేలా చేస్తున్నాడు. ఇది ఫేస్ బుక్ వేదిక మీద సాధ్యం అవుతూ ఉంది. అంతే కాదు దీని విజయం ఏమంటే ఆకవికి చాలా విలువైన అభిప్రాయ మాల మరుసటి రోజు సాయంత్రానికి తెలిసి పోతూఉంది. ఒక కవితకు సుమారు వందకు పైగా అభిప్రాయ ప్రకటనలు ఒక్కరోజులో రావడం ఒక్కరోజులో కొన్ని వందలమంది సాధారణ పాఠకులు కాక కవిత్వం కోసం ఉన్న ప్రత్యేకమైన పాఠకులు ఆ కవితను చదవడం మామూలు విషయం కాదు. ఆ కవికి వచ్చే ప్రోత్సాహం కాని సంతోషం కాని ఇంతకు ముందు సంప్రదాయ పద్ధతుల్లో అచ్చుపుస్తకం ద్వారా రావడం అన్నది కలలో కూడా ఊహించడానికి సాధ్యం కానిది. కవికి వచ్చే స్థితిని కాస్సేపు పక్కకు పెట్టి కవిత్వానికి వచ్చే స్థితిని గురించి ఆలోచిస్తే మరింత సంతోషకరంగా కనిపిస్తూ ఉంది. కవిత్వ వ్యాప్తి ఇబ్బడి ముబ్బడిగా మునుపెన్నడూ లేని వేగంతో వ్యాప్తి చెందుతూ ఉంది. ఇది తెలుగు సాహిత్య కారులు అందరూ సంతోషంగా గర్వించదగిన విషయం.
పంక్తి 404:
* [https://www.facebook.com/pages/kavisangamam-poetry-page/786567121360238/ ఫేస్బుక్ లో కవిసంగమం పేజీ]
* [http://kavisangamamu.blogspot.com/ Blogspot వెబ్సైట్ లో కవిసంగమం బ్లాగు]
* [http://kavisangamamu.wordpress.com/ Wordpress వెబ్సైట్ లో
* [https://www.youtube.com/user/kavisangamamu/ యూట్యూబ్ లో కవిసంగమం వీడియోలు]
*[http://www.saarangabooks.com/telugu/2015/02/07/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B0%82-%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B1%8B-%E0%B0%AE%E0%B1%88%E0%B0%B2%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF/ సారంగలో కవిసంగమం మూడో మైలురాయి]
* [http://archive.andhrabhoomi.net/content/kavi-sangamam నేడు ‘కవిసంగమం’ కవితోత్సవం]
[[వర్గం:
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
|