కృష్ణ భగవాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
ఇతడి ప్రాథమికవిద్యాభ్యాసము స్వగ్రామమైన కైకవోలులో పూర్తిచేసి పాఠశాల విద్యకోసం [[కాకినాడ]]లో పూర్తిచేశాడు. ఇంటర్ విద్యను '''ఆండాలమ్మ కళాశాల''' లో పూర్తిచేసాడు. తర్వాత [[హైదరాబాదు]]లో [[బాగ్ లింగంపల్లి]] లోని అంబేద్కర్ కళాశాల నుండి బీకాం పూర్తిచేశాడు. అటుపై చదవాలనే ఆశ ఉన్నా బి.కాంలోని అత్తెసరు మార్కుల కారణంగా ఏ కళాశాల అతడిని అనుమతివ్వని కారణంగా చదువు పట్ల ఆసక్తిని తగ్గించి నటనపై పెంచుకొన్నాడు.
==నట జీవితము==
పాఠశాలలో తన పెద్దన్న మంగరాజు బలవంతంపై '''పెండింగ్ ఫైల్''' అనే నాటకంలో తొలిసారిగా '''పరంధామయ్య''' పాత్రను పోషించాడు. అటుపై దాదాపు అందరు తెలుగు సినీ నటుల్లాగానే ఇతడు కూడా నటనావకాశాల కోసం [[మద్రాసు]] చేరుకొన్నాడు.అక్కడ మిత్రబృందంతో కలిసి అప్పటి ప్రముఖ నటి [[అనూరాధ]] ఇంట్లోని మేడమీది గదిలో అద్దెకు ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించేవాడు. ఇంటిదగ్గరినుండి నెల నెలా డబ్బులు పంపిస్తుండటంతో బ్రతుకుతెరువు కోసం వేరే వృత్తిని చేసే పని తప్పింది.
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_భగవాన్" నుండి వెలికితీశారు