అప్పుచేసి పప్పుకూడు (1959 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు హాస్యచిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 88:
|}
==కథాంశం==
దివాన్ బహుద్దూర్ ముకుందరావు ([[ఎస్వీ రంగారావు]]) [[లక్షాధికారి]], అతని మనుమరాలు మంజరి (సావిత్రి) ఆయన ఆస్తికి ఒక్కగానొక్క [[వారసురాలు]]. ముకుందరావుకి తన మనుమరాలిని ఎవరైనా రాజుకిచ్చి పెళ్ళి చేయాలనే కోరిక ఉంటుంది. మంజరి రాజారావు ([[ఎన్టీఆర్]]) అనే దేశభక్తుడిని ప్రేమిస్తుంది. రాజారావు చెల్లెలు లీల (జమున). రావుబహుద్దూర్ రామదాసు (చిలకలపూడి సీతారామంజనేయులు) కొడుకైన రఘు ([[జగ్గయ్య]])తో వివాహమయి ఉంటుంది. విచిత్రంగా, రఘుకి లీల ఎలా ఉంటుందో తెలియదు. రఘు పైచదువులు చదువుటకు విదేశాలకు వెళ్తాడు. రామదాసు లీలను ఇంటినుండి తరిమేసి, లీల చనిపోయిందన్న అబద్దపు వార్త రఘుకు తెలుపుతాడు. ఇదంతా రాజారావు ఒక ఉద్యమంలో పాల్గొని చెరసాలకు వెళ్ళినప్పుడు జరుగుతుంది. చెరసాల నుండి విడుదలై రాజారావు తన చెల్లెల్ని తీసుకుని రామదాసు ఇంటికి అతనిని నిలదీయటానికి వెళ్తాడు. కానీ, ఇరువైపువారి పరువు కోసం లీలను మూగ పనిమనిషిలాగా రామాదాసు ఇంట్లో కొన్ని సమస్యలు తొలగిపోయేదాకా ఉండటానికి ఒప్పుకుంటాడు. రామదాసు కొందరి దగ్గర అప్పు చేసి వేరేవారికి అప్పులిస్తుంటాడు. రామదాసు దగ్గర గుమాస్తాగా భజగోవిందం (రేలంగి) పనిచేస్తుంటాడు. భజగోవిందం తన అత్త రాజారత్నం (సూర్యకాంతం) కూతురైన ఉష (గిరిజ)ను ప్రేమిస్తాడు. ఇది రాజారత్నం భర్త రామలింగం (రమణారెడ్డి)కి నచ్చదు, అతను కూతురికి పెళ్ళిచూపులు జరిపిస్తూవుంటే వాటిని భజగోవిందం తన సన్నిహితులతో కలిసి చెడగొట్టుతూ ఉంటాడు. చివరికి రాజారావు-మంజరి, భజగోవిందం-ఉష ఎలా పెళ్ళిచేసుకుంటారో, రఘు-లీల ఎలా కలుసుకుంటారో మరియు రామదాసు మంచి మనిషిగా ఎలా మారుతాడో అన్నది కథ.
 
==పాటలు==
[[బొమ్మ:appuchesi pappukoodu.jpg|200px|right]]