సాలూరు రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
 
===మల్లీశ్వరి సినిమా===
ఇంక సాలూరి కిరీటంలో కలికితురాయి [[మల్లీశ్వరి]] (1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, నాలుగు పుష్కరాల తర్వాతకూడా నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. [[వి.ఎ.కె.రంగారావు]]గారి మాటల్లో చెప్పాలంటే “[[బి.ఎన్‌.రెడ్డి]] కార్యదక్షతతో, [[దేవులపల్లి]] మల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, [[పసుమర్తి కృష్ణమూర్తి]] నృత్య సారధ్యంతో, [[ఘంటసాల]] [[భానుమతీ రామకృష్ణ|భానుమతి]]ల గళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి అన్న తీరుగా రూపొందింది.” “ఇదొక్కటి చాలు సాలూరి గొప్పతనం తెలియజెప్పడానికి” అనేవారు కొందరైతే, “దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని” దృఢంగా విశ్వసించే వారూ చాలామంది ఉన్నారు. సాలూరే “మల్లీశ్వరి” పై వ్యాఖ్యానిస్తూ '' "[[చంద్రలేఖ]]" కథకు ఒక కాలం అంటూ లేదు కనుక అన్నిరకాల సంగీతం వినిపించడానికి అవకాశం కలిగింది. కాని, “మల్లీశ్వరి” చరిత్రకు సంబంధించిన చిత్రం. అటు కథాకాలానికి, ఇటు కాస్త ఆధునికంగానూ వుండేలా సంగీతం కూర్చవలసి వచ్చింది. శాస్త్రీయ రాగాలను తీసుకొని, సెమిక్లాసికల్‌ గా స్వరపరిచాను. అలాగే అందులోని ఏ పాటా కూడా ట్యూన్‌కి రాసింది కాదు! బి.ఎన్‌.గారికి సంగీతాభిరుచి ఎక్కువ కావడంతో ఒక్కో పాటకు ఐదారు వరసలు కల్పించవలసి వచ్చింది. ఆ చిత్రానికి మొత్తం ఆరునెలలపాటు మ్యూజిక్‌ కంపోజింగ్‌ జరిగిందని చెప్తే ఈ రోజుల్లో ఎవరికైనా ఆశ్చర్యగా ఉంటుందేమో'' అని అన్నాడు. ఈ చిత్రంలో చేపట్టని సంగీతప్రక్రియ లేదేమో! ప్రతి సంగీత విద్యార్థిమొదటిగా నేర్చుకొనే ''శ్రీగణనాధ సింధూరవర్ణ'' (మలహరి) అన్న పురందరదాస కృతితో చిత్రం ప్రారంభమవుతుంది. తరువాత తేలికగా పాడుకోగలిగే బాణీలలో పిల్లల పాటలు (''ఉయ్యాల జంపాల, రావి చెట్టు తిన్నె చుట్టూ''), హాస్య గీతం (''కోతీబావకు పెళ్ళంట''), ప్రకృతి పాట (''పరుగులు తీయాలి''), జావళి ( ''పిలచిన బిగువటరా''), జానపదం (''నోమీన మల్లాల''), వీడ్కోలు పాట (''పోయిరావే తల్లి''), [[యక్షగానం]] (ఉషాపరిణయం), యుగళ గీతం, ఇలా అన్నిరకాల పాటలనందించి విభిన్న శ్రోతలను ఆనందపరచిన చిత్రమిది. మరింత ప్రత్యేకంగా పేర్కొనవలసినది, తెలుగువారందరూ ఎంతో గర్వపడ వలసినది, కాళిదాసుని మేఘసందేశానికేమాత్రం తీసిపోని సాలూరి, దేవులపల్లి, ఘంటసాల భానుమతుల సమష్టి కృషిఫలితం ''ఆకాశవీధిలో'' అన్న పాట. ఈ రాగమాలిక(భీంపలాస్‌, కళంగద, [[కీరవాణి]], హంసానంది) అనురాగరసంతో విరహగీతాన్ని విరచించే తూలిక!
 
===విప్రనారాయణ సినిమా===