నర్తనశాల: కూర్పుల మధ్య తేడాలు

+నర్తనశాల (నాటకం) లింకు
పంక్తి 32:
[[మహాభారతం]]లోని '[[విరాట పర్వం]]'లో జరిగిన [[పంచపాండవులు|పాండవుల]] అజ్ఞాతవాస గాథ ఈ చిత్రానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం మధ్యలో భంగపడితే వనవాసం పునరావృతమౌతుంది.
 
[[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] సలహా ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టుపైనుంచి, గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. [[ధర్మరాజు]] ''కంకుభట్టు''గాను, [[భీముడు]] వంటలవాడు ''వలలుని''గాను చేరుతారు. 'పేడివి కమ్మ'ని ఊర్వశి ఇచ్చిన శాపం అజ్ఞాతవాసములో వరంగా వినియోగించుకొని [[అర్జునుడు]] ''బృహన్నల''గా విరాటరాజు కుమార్తె ఉత్తరకు[[ఉత్తర]]కు 'నర్తనశాల'లో నాట్యాచార్యుడౌతాడు.[[నకులుడు]] ధామగ్రంథి అనే పేరుతో అశ్వపాలకుడిగా [[సహదేవుడు]] తంత్రిపాలుడు అనే పేరుతో [[ఆవు|గో]]సంరక్షకుడిగా చేరుతారు. [[ద్రౌపది]] ''సైరంధ్రి''గా విరాటరాజు భార్య సుధేష్ణాదేవి పరిచారిక అవుతుంది.
 
పాండవుల అజ్ఞాతవాసాన్ని ఎలాగైనా భంగం చేయాలని [[కౌరవులు]] చారులను పంపి ప్రయత్నాలు సాగిస్తారు.[[పాండవులు]] ఈ విధంగా అజ్ఞాత వాసం వెలుబుచ్చుండగా ఒకరోజు విరాటరాజు బావ, ఆ రాజ్యానికి రక్షకుడు, మహా బలవంతుడు అయిన [[కీచకుడు|కీచకుని]] కన్ను ద్రౌపదిపై పడుతుంది. ఉపాయంగా కీచకుని రాత్రివేళ నర్తనశాలకు పిలిపించి [[భీముడు]], అతడిని హతం చేస్తాడు.
 
కీచకుని మరణంతో అక్కడ పాండవులుండవచ్చునని అనుమానించిన [[కౌరవులు]], వారి ఉనికిని బయట పెట్టేందుకు సుశర్మ సాయంతో దక్షిణ గోగణాలను బలవంతంగా తీసుకుపోతారు. వారిని ఎదుర్కోవడానికి విరాటుడు సకల సైన్యాలతో యుద్ధానికి వెళతాడు. ఇక కలుగులో ఎలుకలను లాగడానికి [[కౌరవులు]], భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులతో ఉత్తరగోగణాలను తోలుకుపోవడానికి వస్తారు.
 
అంతఃపుర పరివారం తప్ప అంతా యుద్ధానికి వెళ్ళారే! అయినా ఫరవాలేదు. నేను కౌరవ సేనను వీరోచితంగా జయిస్తానని పలికి విరాటుని కొడుకు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరుతాడు. అతనికి సారథిగా బృహన్నల వెళతాడు. కాని కౌరవసేనను చూచి ఉత్తరునికి వణుకు మొదలై పారిపోజూస్తాడు. బృహన్నల అతనికి నచ్చచెప్పి, తన నిజ రూపం తెలిపి అర్జునుడుగా యుద్ధానికి వెళ్ళి, కౌరవసేనను సమ్మోహనాస్త్రంతో జయించి, గోవులను మళ్ళించుకు వస్తాడు. శుభప్రదంగా పాండవుల అజ్ఞాతవాసం ముగుస్తుంది. ఇదీ కథ.
"https://te.wikipedia.org/wiki/నర్తనశాల" నుండి వెలికితీశారు