గుణసుందరి కథ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చిత్ర కథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రూ. → రు., ప్రార్ధన → ప్రార్థన, ప్రార్ధిస్తూ using AWB
పంక్తి 32:
[[బొమ్మ:Gunasundari-katha-1.jpg|250px|thumb | left | గుణ సుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము]]
[[బొమ్మ:Gunasundari-katha-2.jpg|250px|thumb | right|గుణ సుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము]]
తదనంతరం ఒకానొక సందర్భంలో ఆ ముదుసలి వినికిడి వాక్కు బాగా ఉన్నవాడని తెలియడం, అతడు తన మేనళ్ళుళ్ళతో వాదనలకు దిగటం చూసిన రాజు వాళ్ళ ఉనికి సహించలేనివాడై ఇంటినుండి పొమ్మంటాడు. అ సందర్భంలో ముసలివానిని కొట్టబోయి పట్టు తప్పి మెట్ల పైనుండి పడి కాలుకు బలమైన గాయాలు తగులుతాయి. గుణసుందరి భర్తకు జరిగిన అవమానంతో అతడితో కలసి అతడి పల్లెకు వచ్చేస్తుంది. భర్తతో కలసి సామాన్యజీవితం గడుపుతూ ఉంటుంది. ఒకరోజు నీటికై చెరువుకు వెళ్ళిన ఆమెను ఒక యువకుడు వెంబడించి ఆమెను వివాహం చేసుకొంటానని చెపుతూ చేయి పట్టుకొంటాడు. ఆమె అతడిని చెంబుతో నుదుటిపై కొడుతుంది. ఇంటికి వచ్చి భర్తతో జరిగింది చెపుతుంది. తరువాత భర్త నుదుటన కూడా గాయం ఉండటం చూస్తుంది. ఒకనాడు భర్త ఆమె ఎప్పుడూ చదువుతుండే పతివ్రతల పుస్తకంలో ఆమె కథను రాసి ఆమెను వెంటాడిన యువకుని బొమ్మ వేస్తాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయి మీరు సామాన్యులు కాదు, మారురూపాన ఉన్న ఎవరో గొప్పవారు, నన్ను పరీక్షీంచక నిజం చెప్పమని కోరుతుంది. అతడు చెరువు దగ్గర వెంటాడిన తన నిజరూపంలో ఆమెకు కనిపిస్తాడు. తన పేరు వీరశేనుడని తను ఒక రాకుమారుడనని చెప్పి తను తన గురువు కారణంగా శాపానైకి గురియైన వైనమ్ చెప్పి, దానిని భార్యకు తప్ప పరులు ఎవరికీ తెలియనివ్వరాదని తెలిసిన క్షణం తాను ఎలుగుబంటిగా మారిపోతానని ఎవరికీ తెలియనివ్వనని మాట తీసుకొంటాడు. గుణ సుందరి ఇంటినుండి వెళ్ళిన కొద్ది కాలానికి ఆమె తండ్రి కాలు గాయాలు పెద్దవై అధిక బాధ పడుతుంటాడు. కూతుళ్ళు అతడికి సేవచేయక సూటి పోటి మాటలని తమ భర్తల సహాయంతో తండ్రి కాలు తీసేయించే ప్రయత్నం చేస్తారు. కూతుళ్ళ గురించి నిజం తెలిసి భయపడిన రాజు మంత్రికి చెప్పి తన కాలు బాగుచేయించే మార్గం చూడమంటాడు. [[అంజనం]] ద్వారా మహేంద్రమణి తెచ్చి తాకిస్తే తగ్గుతుందని చెపుతారు పండితులు. అది తెచ్చిన వారికి తనరాజ్యాన్ని ఇస్తానని ప్రకటించమంటాడు రాజు.
[[బొమ్మ:Gunasundari-katha-3.jpg|250px|thumb | left | గుణసుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము]]
తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన గుణ సుందరి తన భర్తను ఆ మణిని తీసుకొచ్చి తన తండ్రి అనారోగ్యాన్ని తొలగించమని వేడుకొంటుంది. వీరశేనుడు ముసలి రూపునే మణి కోసం బయలుదేరుతాడు. ఇటు రాజు పెద్ద అళ్ళుళ్ళు కూడా బయలుదేరుతారు. వీరశేనుడు మణి సాధనలో తన తెలివితేటలతో దారిలో ఎదురైన ఆపదలను గట్టెక్కి, అక్కడ ఉన్న యక్షిణులను గెలిచి తన తోడళ్ళుళ్ళతో పాటు అక్కడకు చేరుకొని అక్కడ యక్షిణి ద్వారా మంత్రం నేర్చి మహేంద్రమణిని సాధిస్తాడు. అందరూ తిరిగి వస్తుండగా ఒక రాత్రి నిద్రిస్తున్న వీరశేనుడి తలపై మోది అతడిని బావిలో తోసి మణి తీసుకొని పారొపోతారు అతడి తోడళ్ళుళ్ళు ఇద్దరు. ఇక్కడ పల్లెనుండి గుణసుందరి రాజును వెళ్ళి చూసేందుకు వెళ్ళగా ఆమె అక్కలు ఆమెను అవమానించి ఆమె భర్త గురించి అవమానంగా మాట్లాడటంతో ఆవేశంలో నిజం చెప్పేస్తుంది. అక్కడ బావిలో వీరశేనుడు బల్లూకంగా మారిపోతాడు. [[మణీ|మణి]]ని తీసుకొని వచ్చిన రాజు అళ్ళుళ్ళు దాని మంత్రం గాయాలను మాన్పలేకపోతారు. బల్లూకంగా మారిన వీరశేనుడు జనాలు తరుముతుంటే పల్లెకు వస్తాడు. గుణ జనాలనుండి కాపాడి తన ఇంటికి తీసుకుపోయి క్షమించమని ఆవేశంలో చెప్పేసానని ఏడుస్తూ దేవిని ప్రార్థిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఆమె ప్రార్థనకు మెచ్చి కోయరూపాలలో ఆమెను, బల్లూకాన్ని వెంటబెట్టుకొని రాజు దగ్గరకు వచ్చి వీరశేనునికి పూర్వరూపం ఇచ్చి అతడి గురించి అందరికీ వివరిమ్చి గుణసుందరి పాతివ్రత్యకారణంగానే తాము మెచ్చి భువికి వచ్చామని చెప్పి నిజరూపాలతో అందరికీ ధర్శనమిచ్చి అదృశ్యమవుతారు.
 
==వివరాలు==
*'''చిత్రం పేరు''' - గుణసుందరి కథ
"https://te.wikipedia.org/wiki/గుణసుందరి_కథ" నుండి వెలికితీశారు