జగదేకవీరుని కథ: కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
పంక్తి 14:
 
== కథాగమనం ==
ఒక రాజ్యాన్ని పాలించే రాజుకు గల ఇరువురు కుమారులలో పెద్దవాడైన [[ఎన్.టి.రామారావు]] ఒక రాజును బాధింఛు రాచకురుపు నివారణార్ధం కావలసిన ఔషదము తీసుకొని వచ్చు ప్రయత్నమున ఒక నాగకన్యకను, మరొక యక్షకన్యకను, వేరొక రాజకన్యకను పరిణయమాడి వారి సహాయముతో దివ్యఔషదమును తెచ్చి తనరాజ్యము అన్యాక్రాంతమయినదని తెలుసుకొని తిరిగి దానిని సాధించి రాజుగా పరిపాలనము కొనసాగిస్తాడు.
ఉదయగిరి మహారాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రతాప్. చిన్నవాడు జగజ్జిత్తు. ప్రతాప్‌కున్న ఒకే కల. చలువరాతి మేడలో తూగుటుయ్యాలపై దేవకన్యలు ఇంద్రకుమారి, నాగకుమారి, వరుణకుమారి, అగ్నితనయ తన చుట్టు చేరి సేవలు చేస్తుండగా జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని కోరిక. అది తెలుసుకున్న తండ్రి కోపంతో దేశబహిష్కారం చేస్తాడు. అలా బయటకు వెళ్లిన ప్రతాప్ దేవకన్యలకోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెడుతుండగా కలిసిన దయ్యాల సాయంతో దేవకన్యలు జలకాలాడే చోటుకి వెళ్లి పొరపాటున శిలగా మారతాడు. కాని అతని తల్లి ప్రార్ధనలతో సంతోషించిన పార్వతీదేవి అతనికి మానవ రూపం రప్పిస్తుంది. ఇంద్రపుత్రిక జయంతి ఒకరోజు ఏమరుపాటుగా చేసిన తప్పుకు కోపించిన ముని శాపం ఇస్తాడు. దాని ప్రకారం ఆమె వస్త్రాలను దోచుకు పోయినవాడితో ఆమె పెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది కాలానికి , తన వలువలు దోచిన ప్రతాప్‌ని జయంతి వరిస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కామకూట రాజ్యానికి వెడతారు. కామాంధుడైన ఆ దేశపు రాజు జయంతి అందాన్ని చూసి వివశుడై వారిద్దరిని విడదీయాలని ప్రయత్నించి తనే పతనమవుతాడు. ఆ రాజు చేసిన కుతంత్రంలో భాగంగా ముల్లోకాలకు వెళ్లిన ప్రతాప్ ఇంద్రకుమారి జయంతి స్నేహితురాళ్లని కూడా పెళ్ళి చేసిని భూలోకానికి తిరిగొస్తాడు. అందరితో కలిసి సంతోషంగా ఉండగా. ఒకరోజు ప్రతాప్ లేని సమయంలో జయంతి అత్తగారిని మభ్యపెట్టి ప్రతాప్ దాచిన తన చీరెను తీసుకుంటుంది. అది లభించడంతో ఆమె శాపవిమోచనమవుతుంది. తన స్నేహితురాళ్లతో కలిసి స్వర్గానికి వెళ్లిపోతుంది. కాని ఆ దేవకన్యలందరూ[[దేవకన్య]]లందరూ తమ భర్తపై ప్రేమని చంపుకోలేకపోతారు. చివరగా దేవతలు పెట్టిన పరీక్షలో నెగ్గి ప్రతాప్ తన భార్యలను తీసుకుని భూలోకానికి వచ్చేసి సుఖంగా రాజ్యపాలన చేస్తాడు.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/జగదేకవీరుని_కథ" నుండి వెలికితీశారు