సముద్ర ట్రెంచ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 106:
 
==ట్రెంచ్ లు - భూకంప ప్రక్రియ==
 
ట్రెంచ్ లు సబ్ డక్షన్ మండలాల వెంబడి ఏర్పడతాయి. ఈ సబ్ డక్షన్ మండలంలో విరూపకారక పలకలు ఒకదాని క్రింద మరొకటి కదులుతున్నప్పుడు, పలకల మధ్య రాపిడి (friction) ఏర్పడి, చొచ్చుకొనిపోయే పలక మరింత చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. ఇలా విడిపోయిన కొన్ని చిన్న పలక ముక్కలు, పలకల మధ్యభాగాలలో చాలా కాలం పాటు ఇరుక్కుపోయి తీవ్ర వత్తిడికి లోనవుతాయి. పలకల చలనం కొనసాగుతూ వస్తున్న క్రమంలో ఇవి వత్తిడి నుండి ఒక్కసారిగా విడుదలైనప్పుడు వీటి నుండి ఒక్క అదాటున అపారమైన శక్తి వెలువడుతుంది. ఇది భూ ప్రకంపనాలకు దారితీస్తుంది. కొద్ది సెకండ్ల కాలంలోనే భారీ స్థాయిలో సంభవించే ప్రకంపనాల వల్ల భూకంపాలు (Earthquakes) సంభవిస్తాయి. ఇతర ప్రాంతాలలో ఏర్పడే సాధారణ భూకంపాలతో పోలిస్తే, సబ్ డక్షన్ మండలాల వెంబడి ముఖ్యంగా ట్రెంచ్ ల ప్రాంతాలలో సంభవించే భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా వుంది తీవ్ర వినాశనానికి దారితీస్తుంటాయి.
సముద్రాంతర్గత రిడ్జ్ (Oceanic Ridges) ల మాదిరిగానే ట్రెంచ్ లు కూడా భూకంప ప్రక్రియ తో సంబంధం కలిగి వుంటాయి. అయితే రిడ్జ్ ల మాదిరిగా ఇవి అధిక స్థాయి ఉష్ణ ప్రవాహాలను కలిగి వుండవు. ట్రెంచ్ ల వద్ద ఉష్ణ ప్రవాహ స్థాయిలు తక్కువగా (Low Heat Flow) వుంటాయి.
"https://te.wikipedia.org/wiki/సముద్ర_ట్రెంచ్" నుండి వెలికితీశారు