సముద్ర ట్రెంచ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 111:
 
==ట్రెంచ్ ల ప్రాముఖ్యత==
 
సముద్ర భూతలం పైన ఏర్పడిన అత్యంత లోతైన ప్రాంతాలు ట్రెంచ్ లు. భూగోళం మీద ఇప్పటి వరకూ మనకు తెలిసిన మరియు సహజసిద్ధంగా ఏర్పడిన అత్యంత లోతైన ప్రాంతాలు ఇవే.
 
* భూగోళపు లితోస్ఫియరిక్ పలకల యొక్క సహజ సరిహద్దుల వద్ద ట్రెంచ్ లు ఏర్పడ్డాయి. ఈ ట్రెంచ్ ల అధ్యయనం వలన పలకల అభిసరణ సరిహద్దుల యొక్క విలక్షణమైన, అధ్బుతమైన లక్షణాలు తెలుస్తాయి.
 
* ప్రపంచంలో భూకంపాలలో అధిక భాగం సబ్ డక్షన్ మండలాలలోనే సంభవిస్తుంది. ట్రెంచ్ లు సబ్ డక్షన్ మండలాల వెంబడి ఏర్పడతాయి. ఒకవిధంగా ట్రెంచ్ లు సముద్ర భూతలంపై సబ్ డక్షన్ మండలం ప్రారంభమయ్యే ప్రాంతాన్ని సూచిస్తాయి అని చెప్పవచ్చు. కనుక ట్రెంచ్ ల సమీపంలో తీవ్రమైన భూకంప ప్రక్రియలు సంభవిస్తాయి. ఇతర ప్రాంతాలలో ఏర్పడే సాధారణ భూకంపాలతో పోలిస్తే, సబ్ డక్షన్ మండలాల వెంబడి ముఖ్యంగా ట్రెంచ్ ల ప్రాంతాలలో సంభవించే భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా వుంది తీవ్ర వినాశనానికి దారితీస్తుంటాయి. కనుక ట్రెంచ్ ల అధ్యయనం ప్రపంచంలో తీవ్ర భూకంపాలు, సునామీలు సంభవించగల ప్రాంతాల ఉనికిని ముందుగానే అంచనా వేయదానికి తోడ్పడుతుంది.
 
పసిఫిక్ అగ్ని వలయం (Pacific ring of fire) అనేది పసిఫిక్ అంచులలో భూకంపాలు, అగ్నిపర్వత ప్రక్రియలు ఏర్పడే ప్రాంతాన్ని తెలుపుతుంది. పసిఫిక్ మహాసముద్రంలో లోతైన ట్రెంచ్ లు దాదాపుగా పసిఫిక్ అగ్ని వలయం లో భాగంగా వున్నాయి.
 
* ప్రపంచ వ్యాప్తంగా కార్బానిక్ పదార్ధాన్ని సంగ్రహించడం ద్వారా ట్రెంచ్ లు భూగోళపు కార్బన్ సింక్ (Carbon sink) లుగా పనిచేస్తూ భూమి యొక్క కార్బన్ డయాక్సైడ్ cycle లో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఫలితంగా శీతోష్టస్థితిని నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి.
 
* ట్రెంచ్ ల వద్ద సముద్ర పటలం (Oceanic crust) రీసైకిల్ (Recycle) చేయబడుతుంది. రిడ్జ్ ల వద్ద ఏర్పడిన సముద్ర పటలం, ట్రెంచ్ ల వద్ద తిరిగి భూప్రావారం (Mantle) లోనికి లాగివేయబడుతుంది. ఫలితంగా భూప్రావరం నుండి సముద్ర పటలం లోనికి, తిరిగి సముద్ర పటలం నుండి భూ ప్రావారానికి, సముద్ర పటలం ఒక చక్రం (Cycle) పూర్తిచేస్తుంది. కనుక ట్రెంచ్ లు ఒక విధంగా సముద్ర పటలాన్ని రీసైక్లింగ్ చేస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇలా ట్రెంచ్ లు రీసైక్లింగ్ చేయలేని నాడు, రిడ్జ్ ల ద్వారా భూప్రావారం నుండి మాగ్మా నిరంతరంగా పైకి రావడం, దాని వల్ల రిడ్జ్ ల వద్ద కొత్తగా సముద్ర పటలం సృష్టించబడటం మాత్రమే జరుగుతూ వుంటుంది. ఫలితంగా భూమి సైజు (size) సాపేక్షికంగా పెరిగిపోవడం జరుగుతుంది. కనుక ఆ విధంగా జరగకుండా ట్రెంచ్ లు, నిరంతరం సృష్టించబడుతున్న సముద్ర పటలాన్ని తిరిగి భూప్రావారం లోనికి నిరంతరం పంపడం ద్వారా రీసైక్లింగ్ చేస్తూ వున్నాయి. ఫలితంగా ట్రెంచ్ లు 460 కోట్ల సంవత్సరాలనుంచీ భూగోళం సైజు ను సాపెక్షంగా పెరిగిపోకుండా వుంచగలిగాయి.
 
* ప్రమాదకరమైన రేడియేషన్ ను వెలువరించగల స్థాయిలో వున్న అణు వ్యర్ధ పదార్ధాలను సీల్డ్ కంటైనర్ల లో నిక్షిప్తం చేసి ఉంచుతారు. ఈ సీల్డ్ కంటైనర్ల ను భద్రంగా పదిలపరచదానికి భూమి మీద అనువైన ప్రాంతాలుగా ట్రెంచ్ ప్రాంతాలు భావించబడుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సముద్ర_ట్రెంచ్" నుండి వెలికితీశారు