సముద్ర ట్రెంచ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
* ప్రపంచంలో భూకంపాలలో అధిక భాగం సబ్ డక్షన్ మండలాలలోనే సంభవిస్తుంది. ట్రెంచ్ లు సబ్ డక్షన్ మండలాల వెంబడి ఏర్పడతాయి. ఒకవిధంగా ట్రెంచ్ లు సముద్ర భూతలంపై సబ్ డక్షన్ మండలం ప్రారంభమయ్యే ప్రాంతాన్ని సూచిస్తాయి అని చెప్పవచ్చు. కనుక ట్రెంచ్ ల సమీపంలో తీవ్రమైన భూకంప ప్రక్రియలు సంభవిస్తాయి. ఇతర ప్రాంతాలలో ఏర్పడే సాధారణ భూకంపాలతో పోలిస్తే, సబ్ డక్షన్ మండలాల వెంబడి ముఖ్యంగా ట్రెంచ్ ల ప్రాంతాలలో సంభవించే భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా వుంది తీవ్ర వినాశనానికి దారితీస్తుంటాయి. కనుక ట్రెంచ్ ల అధ్యయనం ప్రపంచంలో తీవ్ర భూకంపాలు, సునామీలు సంభవించగల ప్రాంతాల ఉనికిని ముందుగానే అంచనా వేయదానికి తోడ్పడుతుంది. పసిఫిక్ అగ్ని వలయం (Pacific ring of fire) అనేది పసిఫిక్ అంచులలో భూకంపాలు, అగ్నిపర్వత ప్రక్రియలు ఏర్పడే ప్రాంతాన్ని తెలుపుతుంది. పసిఫిక్ మహాసముద్రంలో లోతైన ట్రెంచ్ లు దాదాపుగా పసిఫిక్ అగ్ని వలయం లో భాగంగా వున్నాయి.
 
* ప్రపంచ వ్యాప్తంగా కార్బానిక్ పదార్ధాన్ని సంగ్రహించడం ద్వారా ట్రెంచ్ లు భూగోళపు కార్బన్ సింక్ (Carbon sink) లుగా పనిచేస్తూ భూమి యొక్క కార్బన్ డయాక్సైడ్ cycle లో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఫలితంగా శీతోష్టస్థితిని నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. వాతావరణంలో చేరిన కార్బన్ డయాక్సైడ్ వాయువు చివరికు అవక్షేప శిలలలో నిక్షిప్తమవుతుంది. క్రమేణా నదులవల్ల అవక్షేప శిలలు, ఇతర ఆర్గానిక్ పదార్ధాలు సముద్ర భూతలాన్ని చేరుకొని అక్కడనుంచి నెమ్మదిగా లోతైన ట్రెంచ్ లలోనికి చేరవేయబడతాయి. ఈ విధంగా భూగోళవ్యాప్తంగా కార్బన్ పదార్దాన్ని (అవక్షేప శిలల రూపంలోనూ, సేంద్రియ పదార్ధ రూపంలోను) సంగ్రహించిన ట్రెంచ్ లు CO<sub>2</sub> cycle పూర్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. పలకల సబ్ డక్షన్ మండలంలో ఈ అవక్షేప శిలలు భూపటలం తో పాటు కరిగి భూప్రావారం (mantle) ను చేరుకొంటుంది. కరిగిపోయిన అవక్షేప శిలలలోని కార్బన్ డయాక్సైడ్ వాయువు లో కొంతభాగం తిరిగి మాగ్మా తో కలసి అగ్నిపర్వత ఉద్గారంలో భాగంగా భారీ మొత్తంలో తిరిగి వాతావరణం లోనికి వెదజల్లబడుతుంది. ఒకవేళ ట్రెంచ్ లు కార్బన్ పదార్దాన్ని అవక్షేప శిలల రూపంలో సంగ్రహించకపోయివుంటే, సబ్ డక్షన్ మండలంలోనికి వాటిని చేరవేయలేదు కాబట్టి CO2 cycle పూర్తికాదు. ఫలితంగా వాతావణం నుండి CO2 క్రమేణా వైదొలుగుతుంది. వాతావరణం లో CO2 శాతం ప్రస్తుతమున్న శాతం కన్నా కొద్దిగా పడిపోయినప్పటికీ భూగోళం క్రమేణా గడ్డకట్టుకు పోయి స్నోబాల్ (Snow ball) మాదిరిగా మారిపోతుంది. . కనుక ట్రెంచ్ లు భూగోళపు కార్బన్ సింక్ (Carbon sink) లుగా వుంటూ భూమి యొక్క శీతోష్టస్థితిని నియంత్రించడంలో కీలకపాత్ర వహిస్తున్నాయి
* ప్రపంచ వ్యాప్తంగా కార్బానిక్ పదార్ధాన్ని సంగ్రహించడం ద్వారా ట్రెంచ్ లు భూగోళపు కార్బన్ సింక్ (Carbon sink) లుగా పనిచేస్తూ భూమి యొక్క కార్బన్ డయాక్సైడ్ cycle లో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఫలితంగా శీతోష్టస్థితిని నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి.
 
* ట్రెంచ్ ల వద్ద సముద్ర పటలం (Oceanic crust) రీసైకిల్ (Recycle) చేయబడుతుంది. రిడ్జ్ ల వద్ద ఏర్పడిన సముద్ర పటలం, ట్రెంచ్ ల వద్ద తిరిగి భూప్రావారం (Mantle) లోనికి లాగివేయబడుతుంది. ఫలితంగా భూప్రావరం నుండి సముద్ర పటలం లోనికి, తిరిగి సముద్ర పటలం నుండి భూ ప్రావారానికి, సముద్ర పటలం ఒక చక్రం (Cycle) పూర్తిచేస్తుంది. కనుక ట్రెంచ్ లు ఒక విధంగా సముద్ర పటలాన్ని రీసైక్లింగ్ చేస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇలా ట్రెంచ్ లు రీసైక్లింగ్ చేయలేని నాడు, రిడ్జ్ ల ద్వారా భూప్రావారం నుండి మాగ్మా నిరంతరంగా పైకి రావడం, దాని వల్ల రిడ్జ్ ల వద్ద కొత్తగా సముద్ర పటలం సృష్టించబడటం మాత్రమే జరుగుతూ వుంటుంది. ఫలితంగా భూమి సైజు (size) సాపేక్షికంగా పెరిగిపోవడం జరుగుతుంది. కనుక ఆ విధంగా జరగకుండా ట్రెంచ్ లు, నిరంతరం సృష్టించబడుతున్న సముద్ర పటలాన్ని తిరిగి భూప్రావారం లోనికి నిరంతరం పంపడం ద్వారా రీసైక్లింగ్ చేస్తూ వున్నాయి. ఫలితంగా ట్రెంచ్ లు 460 కోట్ల సంవత్సరాలనుంచీ భూగోళం సైజు ను సాపెక్షంగా పెరిగిపోకుండా వుంచగలిగాయి.
"https://te.wikipedia.org/wiki/సముద్ర_ట్రెంచ్" నుండి వెలికితీశారు