"సంస్కృతం" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (117.218.49.123 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చివరి కూర్పు వరకు తిప...)
====మాతృత్వము====
 
సుమారు 150 సంవత్సరములక్రిందట భాషాసాదృశ్య శాస్తము (Comparitive Philology) విజ్ఞాన ప్రపంచములో నుద్భవించెను. [[గ్రీకు]], లాటిను, ఇంగ్లీషు, జర్మను, ఫ్రెంచి మున్నగు యూరోపియన్ భాషలనడుమ, అత్యంత సన్నిహితసంబంధము కలదనియు, ఈభాషలన్నియు ఆదిలో నేకమాతృసంజనితలనియు నపుడు పాశ్చాత్య పండితులు గ్రహించిరి. కొన్నిశతాబ్దములనుండి, ఐరోపాఖండములో వివిధయూరోపియన్ భాషలను నేర్చినవారెందరో యుండినను, వారి కంతకాలమును గోచరింపని యీ పరస్పర సంబంధము సంస్కృత భాషను నేర్చుకొన్నతర్వాతనే గోచరించుట విశేషము. ఇది గోచరించుటతోబాటు, వారికి సంస్కృతము ఆయన్నిభాషలకును తల్లియను విషయముకూడ స్పష్టమాయెను. వివిధ యూరపీయ భాషలు నిలిచియున్న విజ్ఞానరంగములోనికి, సర్వాంగసుందరియైన సంస్కృతభాష ప్రనేశించినప్పుడు, విమర్శకులీమె తల్లియనియు, మిగిలినభాష లక్కచెల్లెండ్రనియు గ్రహించిరి.
 
ఆదిలో ఇండో యూరోపియన్ భాషా సాదృశ్యశాస్తములో కృషిచేసిన వారిమతమున, సంస్కృతము నిస్సంశయముగ మాతృభాషగనే[[మాతృభాష]]గనే యుండెను. పిమ్మట నేకారణముచేతనోకాని పాశ్చాత్యపండితులు సంస్కృతమునకు మాతృస్ధానమును తొలగించి, అది యూరోపియన్ భాషలతో పోదరీ సంబంధమునే కలిగియున్నదను సిద్ధాంతమును లేవదీసిరి. ఇట్లు చెప్పిన పాశ్చాత్యపండితులుగూడ నొక్కయంశమునంగీకరింపక తప్పినదికాదు. ఈయక్కచెల్లెండ్రకు తల్లియైన భాషను మిక్కిలి హెచ్చుగ బోలియున్నది సంస్కృతమే కాని మరొకటికాదని వారనుచున్నారు. నిజమైనతల్లి యిపుడు మృగ్యమనియు, చాల విషయములలో నది సంస్కృతమును పోలియుండునని మనమూహించుకొనవచ్చుననియు, విమర్శకులు నుడువుటచే వివిధ యూరపీయభాషలకు సంస్కృతము కీలకమను అంశము వ్యక్తమగుచున్నది.
 
రాజకీయముగా [[భారతదేశము]] పాశ్చాత్యుల అధీనమయిన కాలములో, పాశ్చాత్యులు భారతీయభాషయే తమ భాషకు తల్లియని అంగీకరించుచో, అది విపరీతముగ నుండెడి మాట వాస్తవమే. అట్లొప్పుకొనుట పాలకజాతివారి గర్వమునకు భంగకరమును, పాలితజాతివారి ఆత్మగౌరవమునకు ఉద్దీపకమును అగును. అయినను ఉదారులగు పాశ్చ్యాత్యులు కొందరు సత్యమును బాహాటముగా చాటిరి. విమర్శకులలో ఉన్నతశ్రేణికి చెందిన కర్జన్ పండితుడు వ్రాసిన మాటల నిట ఉల్లేఖించుచున్నాను.
 
“గ్రీకు, లాటిను, గొతిక్ మొదలైన భాషలన్నియు భిన్న, భిన్న కాలములయందు సంస్కృతభాషనుండియే, ముఖ్యముగా వైదిక సంస్కృతమునుండియే, ఉద్భవించినవి.” (Journal of Royal Asiatic Society of Britain and Ireland అను ప్రసిద్ధ పత్రికలో ః 16 వ సంపుటము ప్రథమ భాగములో 177 వ పుట).
====ఎల్లభాషలకు కీలకము====
 
ఇండోయూరపీయ కుటుంబమునకు చెందిన యేభాషలోనైనను కూలంకషమైన పాండిత్యము గల్గుటకు సంస్కృతభాషాజ్ఞానము అత్యంతావశ్యకము. ఇం.యూ. కుటుంబమునకు చెందక, ప్రత్యేకము ద్రావిడభాషా కుటుంబమునకు చెందినవని కొందరిచే భావింపబడుచున్న ఆంధ్రము, కర్ణాటకము మున్నగు భాషలను నేర్చుకొనుటకుకూడ సంస్కృత జ్ఞాన మవసరమే. ఈనడుమ గొందరు పండితులు ఆంధ్రము, సంస్కృత ప్రాకృతజన్యమని రుజువుచేసియుండుటచే, సంస్కృతభాషాప్రాముఖ్యత మరింత హెచ్చింది. ప్రపంచములోని[[ప్రపంచము]]లోని ఏభాషనునేర్చుకొనుటకైనను సంస్కృతము కీలకమని మాక్సుముల్లరు అభిప్రాయపడినాడు. ఆధునికశాస్త్రముల కన్నింటికిని గణితశాస్త్ర మెట్టిదో, ప్రపంచభాషలకన్నింటికిని సంస్కృతమట్టిదని యాయన నుడివినాడు. “What Mathematics is to the Sciences, the same is Sanskrit to the languages of the world”.
 
సంస్కృతమునేర్చిన పాశ్చాత్య పండితులేకాక, ఇతర పాశ్చాత్య విద్వాంసులుకూడ నీ యభిప్రాయమునంగీకరించారు. జాన్ రస్కిన్ కూడా [[ఇంగ్లీషు]]భాషలో [[పాండిత్యము]] గలుగవలెనన్నచో మాక్సుముల్లరు రచించిన Biography of words అను గ్రంథమును చదువవలెనని చెప్పినాడు. ఆ గ్రంథములో[[గ్రంథము]]లో ప్రధానముగా యూరపీయ భాషాపదముల సంస్కృతభాషా వ్యుత్పత్తి ప్రదర్శింపబడింది. దానిని చదువుటవలన ఇంగ్లీషుపదముల[[ఇంగ్లీషు]]పదముల శక్తి, వినియోగ విధానము బాగుగా బోధపడునని రస్కిన్ అభీప్రాయము. (చూ: Sesame and Lilies.)
 
====విజ్ఞానభాండారము====
భాషను నిబంధించు వ్యాకరణశాస్త్రము ఒక శాస్త్రముగా పరిగణింపబడు ఉన్నతస్ధితికి వచ్చుట భారతదేశములో మాత్రమే జరిగింది. సంస్కృతవ్యాకరణమునుగూర్చి యీరీతి వర్ణనను "Most Scientific Grammar” అని అనేక పాశ్చాత్యపండితులు గావించియున్నారు. బుద్ధికి శిక్షణము నొసగు విషయములలో గణితశాస్త్రమొకటి. గణితశాస్త్రమునుగాని, సంస్కృతవ్యాకరణమునుగాని చదువుచో మానవబుద్ధి సరియైన మార్గములో ఆలోచించుటయను అలవాటులో పడునని నిష్పక్షపాతబుద్ధి గల పాశ్చాత్యులే నుడివియున్నారు.
 
బహుభాషానిబద్ధ సాహిత్యకృషి చేసినవారు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణముతో సమానమైన గ్రంథము లేదనిరి. ఆంగ్లములో గ్రంథకర్తగా ప్రసిద్ధిచెందిన భూతపూర్వ [[బీహార్]] రాజ్యపాల శ్రీ ఆర్. ఆర్. దివాకర్ ఇట్లు వాక్రుచ్చారు. “కొందరు నాతో ఏకీభవించినను, ఏకీభవింపకపోయినను నామట్టునకు నాకు ప్రపంచసాహిత్యములో [[వాల్మీకి]] [[రామాయణము]] ఉత్తమోత్తమ గ్రంథమనిపించుచున్నది.” (ఆంధ్రపత్రిక 21-7-57 ) . ఇట్టి బహువిషయములలో అగ్రస్థానము మరి యేభాషకును లభించుట లేదు.
 
====జాతిని తీర్చిదిద్దినది====
 
ప్రపంచములో ఏభాషయు సాధింపజాలని యొక విశేషమును సంస్కృతము సాధించినదని శ్రీ [[వివేకానంద స్వామి]] నుడివియున్నారు. ఏభాషలోనైనను కావ్యము రసవంతమై రమ్యముగానున్నచో అందు ధర్మబోధ తక్కువగా నుండును. ధర్మబోధ యెక్కువగానున్నచో రమ్యత తక్కువగానుండును. రమ్యతయు, ధర్మ్యతయు కలియుట మేలనియు, కాని అట్టి కలయిక కన్పట్టుటలేదనియు అరిస్టాటిల్ మున్నగు ప్రాచీనవిమర్శకులు పరితపించారు. పాశ్చాత్య నాటకకర్తలలో మేటియైన షేక్స్పియరులోకూడ ధర్మబోధ ప్రయత్నము తక్కువయనియు, షేక్స్పియరు లోకమునకు సందేశమునిచ్చు దృష్టితో నాటకములను వ్రాయనేలేదనియు విమర్శకులు చెప్పుచున్నారు. రమ్యతను, ధర్మ్యతను అత్యున్నత పథములో సమముగా సాధించిన గ్రంథము [[వాల్మీకి]] [[రామాయణము]] మాత్రమే. ఈ యంశమును స్వామి [[వివేకానందుడు]] అమెరికనులకు తెలుపుచు ఇట్లు పలికెను.
 
“Nowhere else are the aesthetic and the didactic so harmoniously blended as in the Ramayana”.
అట్టి గ్రంథములే యింతకాలము భారతీయులను సత్వగుణ ప్రధానులనుగ చేసి, వారికి ప్రపంచములో నొక విశిష్టతను చేకూర్చినవి. ఆధునిక కాలములో (సైన్సు) విజ్ఞానము పర్వతరాశివలె పెరిగిపోయింది. దానిప్రక్కను భారతీయ సంస్కృతియను మరొకపర్వతమున్నది. ఈ సంస్కృతిచే పరిమళింప చేయబడని ఆధునికవిజ్ఞానమును మనముపయోగించుకొందుమేని అది యిప్పటిరీతిగానే ప్రపంచమునకు శాంతి ప్రదానశక్తిలేక, కల్లోలస్ధితికే కారణమగుచుండును. ఈరెండు పర్వతములను కలుపగల వంతెనయే సంస్కృతభాష. భారతరామాయణగాధలు, బోధలును, కాళిదాసాదికవుల గ్రంథములలోని మధురసందేశమును, [[భర్తృహరి]] సుభాషితాది హృదయంగమోపదేశములును నేటి విజ్ఞానపర్వతమునకును, భారతీయజీవిత పథమను సంస్కృతికిని సేతుబంధముగా పనిచేయగల్గి ఆధునికనాగరికతలో నూతనయుగము నావిర్భవింపచేయ గలవు. ఇట్టి సేతువును నిర్మింపవలసిన యావశ్యకతను రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాదుగారు 1952 వ సంవత్సరములో కాశీలోజరిగిల\న సంస్కృత విశ్వపరిషదధివేశమునకు అధ్యక్షతను వహించుచు, స్పష్టపరిచి యున్నారు.
 
నైతికముగాను, ధార్మికముగాను సంస్కృతము మానవులకు గల్గింపగల యభ్యున్నతి నిరుపమానమైనది. ప్రపంచములో నెక్కడెక్కడ సంస్కృతము ప్రాకినదో, అక్కడక్కడ మానవహృదయమునకు మృదుత్వమేర్పడినదని రవీంద్రనాధటాగోరువంటి విశ్వమానవ సమదృష్టిగల విశ్వకవికూడ నుడివియుండుట గమనింపదగిన విషయము. భారతదేశములో ఫిన్లెండు రాజదూతగానుండిన హ్యూగోవల్వనే చెప్పిన యీ క్రిందిమాటలు సంస్కృతముయొక్క యీప్రభావమును ఘంటాపథముగ చాటుచున్నవి. “సంస్కృతభాషా నిబద్ధములైన భారతీయభావములు యూరపు హృదయమునకు మృదుత్వము నొసగినవి. అచట నాగరికతను నెలకొల్పినవి. ప్రత్యక్షముగా సంస్కృతభాషాద్వారముననే కాక భాషాంతరీకరణముల ద్వారమునకూడ నీపనిజరిగినది. తరువాత కొన్ని శతాబ్దములపాటు సంస్కృతము యూరపియనులకు అందలేదు.” (11-2-53 తేదీని కాశీలో[[కాశీ]]లో ప్రభుత్వ సంస్కృత కళాశాలా స్నాతక సభోపన్యాసము).
 
ఇటీవల యూరపియనులు వాణిజ్యాదులకొరకు భారతదేశమునకు వచ్చుటయు, సంస్కృతమును నేర్చుకొనుటయు, సంస్కృతసాహిత్యగ్రంథములనేకాక శాస్త్రములనుకూడ తమతమ భాషలలోనికి పరివర్తింపచేసికొనుటయు సంభవించెను. 18 వ శతాబ్దిలో ప్రారంభమైన యీ సంస్కృత సంస్కృతి ప్రసారము పాశ్చాత్యభాషలపైననూ, విజ్ఞానముపైనను అపారప్రభావమును చూపెను. సంస్కృతభాషను నేర్వనివారిపైకూడ ఈ ప్రభావము పడెను. కాంట్, స్పైనోజా మున్నగు దేవాంతులపైనను, ఎమర్ సన్, ఎడ్విన్ ఆర్నాల్డ్, సోమర్ సటే మాగమ్ మొదలైన రచయితలపైనను ఈ ప్రభావము ప్రస్ఫుటముగా గోచరించును. ఐరోపాలో 15 వ శతాబ్దిలో జరిగిన రినైజాన్స్ అని చెప్పబడు విజ్ఞానపునర్విజృంభణమునకు తరువాత జరిగిన వైజ్ఞానిక సంచలనములన్నిటిలోను గొప్పది సంస్కృత సంపర్కమువలన జరిగిన వైజ్ఞానికసంచలనమే యని ఎ. ఎ. మాక్డోనెల్ తన Sanskrit Literature అను గ్రంథములో వ్రాసియున్నాడు. (1 వ పుట)
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2039609" నుండి వెలికితీశారు