సముద్ర ట్రెంచ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
 
== ట్రెంచ్ ల ఆవిర్భావం==
[[File:Oceanic-oceanic convergence Fig21oceanocean.gif|thumb|300px|right|రెండు సముద్ర పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఏర్పడిన [[ద్వీప వక్రతలు]], ట్రెంచ్ లు (చొచ్చుకొనిపోతున్న పలక: సముద్ర పలక; పైభాగంలో వున్న పలక: సముద్ర పలక)]]
 
విరూపకారిక ప్రక్రియ (Tectonic activity) వలన సముద్ర భూతలంపై ట్రెంచ్ లు ఏర్పడతాయి. ట్రెంచ్ ల ఆవిర్భావానికి దారి తీసిన విరూపక ప్రక్రియ రెండు విధాలైన పలకల చలనం వలన సంభవిస్తుంది. [[పలక విరూపణ సిద్ధాంతం]] ప్రకారం రెండు సముద్రపు పలకలు ఢీ కొన్నప్పుడు కాని లేదా సముద్రపు పలక-ఖండ పలక రెండూ ఢీ కొన్నప్పుడు కాని ఆ పలకల సరిహద్దులలో సబ్ డక్షన్ మండలం ఏర్పడి దాని వెంబడి లోతైన సముద్ర కందకాలు (Trenches) మరియు సముద్త భూతలంపై [[ద్వీప వక్రతలు]] (Island Arcs) లేదా ఖండ భూతలంపై అగ్నిపర్వత వక్రతలు (volcanic arc) ఏర్పడతాయి. ఉదాహరణకు సముద్ర-సముద్ర పలకలు ఎదురెదురుగా ఢీ కొన్నప్పుడు పలకల సరిహద్దు అయిన సబ్ డక్షన్ మండలం వెంబడి సముద్ర భూతలంపై [[ద్వీప వక్రతలు]], లోతైన [[ట్రెంచ్]] లు ఏర్పడతాయి. సముద్ర-ఖండ పలకలు ఎదురెదురుగా ఢీ కొన్నప్పుడు పలకల సరిహద్దు అయిన సబ్ డక్షన్ మండలం వెంబడి సముద్ర భూతలంపై లోతైన ట్రెంచ్ లు, ఖండ భూతలంపై అగ్నిపర్వత వక్రతలు (volcanic arc) ఏర్పడే అవకాశం వుంది.
పంక్తి 73:
[[File:Oceanic-continental convergence Fig21oceancont.gif|thumb|300px|right|సముద్ర-ఖండ పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఏర్పడిన అగ్నిపర్వత వక్రతలు (volcanic arc), ట్రెంచ్ (చొచ్చుకొనిపోతున్న పలక: సముద్ర పలక; పైభాగంలో వున్న పలక: ఖండ పలక]]
 
'''పైభాగంలో వున్న పలక (overriding plate) సముద్ర పలక అయినట్లయితే''', ఆ సముద్ర పలక యొక్క ఆశ్మావరణం (Lithosphere) గుండా పైకి వచ్చిన మాగ్మా ఘనీభవించడం వలన సముద్ర భూతలంపై ఒక వరుసగా [[అగ్నిపర్వతాలు]] (Oceanic volcones) శృంఖలాల (Chains) మాదిరిగా ఏర్పడతాయి. భూగోళ ఉపరితలం వక్రత(curve) గా వుండటం వల్ల ఏర్పడిన దీవుల వరుస కూడా curve ఆకారం లోనే వుంటుంది. ఈ విధంగా అభిసరణ పలక సరిహద్దుకు సమాంతరంగా వక్రం లేదా చాపం (Arc) ఆకారంలో వరుసగా ఏర్పడిన అగ్నిపర్వత దీవులను '''[[ద్వీప వక్రతలు]] (Island Arcs)''' గా పిలుస్తారు. ఇవి ప్రధానంగా బసాల్ట్ శిలలచే ఏర్పడతాయి. అలూషియన్, కురిల్ దీవులు, [[జపాన్]] దీవులు, ఎంటిల్లస్ చిన్న దీవులు (lesser Antillus) మొదలైనవి ఈ రకానికి చెందినవి. [[ద్వీప వక్రత]] ఏర్పడిన ప్రాంతానికి అవతలివైపున అనగా చొచ్చుకుపోతున్న పలక దిశలో సముద్రంలో లోతైన కందకాలు (Trenches) ఏర్పడతాయి. వీటిని '''ద్వీప వక్రత రకానికి చెందిన ట్రెంచ్''' లుగా వ్యవహరిస్తారు.
 
'''పైభాగంలో వున్న పలక (overriding plate) ఖండ పలక అయినట్లయితే''', ఆ ఖండ పలక యొక్క ఆశ్మావరణం (Lithosphere) గుండా పైకి వచ్చిన మాగ్మా ఘనీభవించడం వలన ఖండ భూభాగాలపై అగ్నిపర్వతాలను (Continental Volcanoes) ఒక వరుసలో శృంఖలాల (Chains) మాదిరిగా ఏర్పడతాయి. వీటిని '''అగ్నిపర్వతీయ వక్రత (volcanic arc)''' గా పిలుస్తారు. ఇవి andesitic శిలలచే నిర్మితమవుతాయి. [[ఆండీస్ పర్వతాలు|ఆండీస్]], కాస్కేడ్, మధ్య అమెరికా, పర్వత శ్రేణులలో అత్యధిక భాగం ఈ రకమైన అగ్ని పర్వత రకానికి చెందినవి. అంటే సముద్ర- ఖండ పలకలు డీ కొన్నప్పుడు పలకల సరిహద్దు అయిన సబ్ డక్షన్ మండలం వెంబడి volcanic arc కు సమాంతరంగా సముద్రంలో లోతైన కందకాలు (Trenches) ఏర్పడతాయి. వీటిని '''మార్జినల్ ట్రెంచ్''' లు (marginal trenches లేదా ఉపాంత ట్రెంచ్ లు) గా వ్యవహరిస్తారు.
 
మరో విధంగా చెప్పాలంటే ట్రెంచ్ లు సముద్ర భూతలంపై సబ్ డక్షన్ మండలం ప్రారంభమయ్యే ప్రాంతాన్ని లేదా పలకల అశ్మావరణం (Lithospheric plates) నాశనమయ్యే ప్రాంతాన్ని సూచిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/సముద్ర_ట్రెంచ్" నుండి వెలికితీశారు