సముద్ర ట్రెంచ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
==ట్రెంచ్ లు-రకాలు==
 
సబ్ డక్షన్ మండలాలను బట్టి ట్రెంచ్ లను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. [[ద్వీప వక్రతలవక్రత]]ల ఏర్పాటుతో సంబంధం కలిగిన ట్రెంచ్ లను ద్వీప వక్రత రకానికి చెందినవి గాను, ఖండ భాగాల లోని అగ్నిపర్వతాల ఏర్పాటుతో సంబంధం కలిగిన ట్రెంచ్ లను మార్జినల్ ట్రెంచ్ లు గాను లేదా Continental Margin Trench గాను వ్యవహరిస్తారు.
 
ఒక సముద్ర పలకను వేరొక సముద్ర పలక డీ కొన్నప్పుడు, పైభాగంలో వున్న పలక (overriding plate) సముద్ర పలక అయినపుడు, దాని భూతలంపై అగ్నిపర్వతాలతో కూడిన ద్వీప వక్రత ఏర్పడుతుంది. ఈ సందర్భంలో '''ద్వీప వక్రతకు సమాంతరంగా''' సబ్ డక్షన్ మండలం వెంబడి వక్ర (curve) ఆకారంలో ఏర్పడిన ట్రెంచ్ లను '''ద్వీప వక్రత రకానికి చెందిన ట్రెంచ్''' లుగా పిలుస్తారు.
 
ఒక సముద్ర పలకను వేరొక ఖండ పలక డీ కొన్నప్పుడు, పైభాగంలో వున్న పలక (overriding plate) ఖండ పలక అయినపుడు, ఆ ఖండ భూభాగంపై [[అగ్నిపర్వతం|అగ్ని పర్వతాలు]] ఏర్పడతాయి. ఈ సందర్భంలో వాటికి సమాంతరంగా సబ్ డక్షన్ మండలం వెంబడి '''ఖండ భాగం యొక్క అంచుల (మార్జిన్) వద్ద''' సముద్రంలో ఏర్పడిన ట్రెంచ్ లను '''మార్జినల్ ట్రెంచ్''' (Marginal Trenches లేదా Continental Margin Trench) రకానికి చెందినవిగా పేర్కొంటారు. ఇవి మధ్య అమెరికా లోని గల్ఫ్ అఫ్ కాలిఫోర్నియా నుండి [[దక్షిణ అమెరికా]] లోని దక్షిణ [[చిలీ]] అంచు వరకూ వ్యాపించి వున్నాయి.ఉదా: మధ్య అమెరికా ట్రెంచ్, పెరూ-చిలీ ట్రెంచ్.
 
ఒక ట్రెంచ్ రెండు రకాలకూ కూడా చెంది వుండవచ్చు. ఉదాహరణకు అలూషియన్ ట్రెంచ్, ఇది తూర్పు భాగంలో మార్జినల్ ట్రెంచ్ రకానికి చెందినది అయితే పశ్చిమ [[అలస్కా]] నుండి కంచట్కా ద్వీపకల్పం వరకూ గల ప్రాంతంలో [[ద్వీప వక్రత]] రకానికి చెందిన ట్రెంచ్ గా ఏర్పడింది
 
కొన్ని సందర్భాలలో ఖండాల అంచులలో వున్న మార్జినల్ ట్రెంచ్ లు సమీప ఖండాల నుంచి నదీ ప్రవాహాలు తీసుకొని వచ్చే అవక్షేపాలతో పూడుకుపోతాయి. దానివల్ల ట్రెంచ్ ల స్వాభావిక ధర్మమైన [[లోతు]] అనేది ఈ ట్రెంచ్ లలో కనిపించదు. ఈ అవక్షేపాలు నిరంతరం నిక్షేపించబడటం వల్ల ఒకొక్కప్పుడు ట్రెంచ్ ల వద్ద సముద్ర భూతలం మృదువుగాను దాదాపుగా సమతలంగాను మారిపోవచ్చు. అయినప్పటికీ వీటిని ట్రెంచ్ లు గానే వ్యవహరిస్తారు. అలూషియన్ ట్రెంచ్ గల్ఫ్ అఫ్ అలస్కా వద్ద గల కోడియాక్ (Kodiak) దీవి సమీపంలో అవక్షేపాలతో పూడుకుపోడం వల్ల ఆ దీవి సమీపంలో ట్రెంచ్ భాగం సమతలంగా వుంది.
 
అదే విధంగా పశ్చిమ [[యు.ఎస్.ఏ]] తీరంలోని కొన్ని మార్జినల్ ట్రెంచ్ లు అవక్షేపాలతో పూడుకుపోయి కనిపిస్తాయి. ఉత్తర కాలిఫోర్నియా లోని కేప్ మెండోసినో (Cape Mendocino) నుండి కెనడా సరిహద్దు వరకూ గల సముద్ర తీరంలో ఏర్పడిన ట్రెంచ్ లు, సమీప కాస్కేడ్ పర్వత శ్రేణులకు చెందిన నదులు తెచ్చే అవక్షేపాలతో దాదాపుగా పూడుకుపోయాయి. ఈ విధంగా [[లోతు ]]ను కోల్పోయిన ఈ ట్రెంచ్ లను పూడుకుపోయిన ట్రెంచ్ లు (Filled Trenches) గా పేర్కొంటారు. అదేవిధంగా ఏంటిల్లస్ చిన్న దీవులు (lesser Antilles) వద్ద ప్యూర్టోరికో ట్రెంచ్ దక్షిణ అమెరికా నదుల నుండి వచ్చే అవక్షేపాల వలన క్రమేణా పూడుకుపోతుంది.
 
అయితే రెండు రకాలైన ట్రెంచ్ లు (ద్వీప వక్రత రకానికి చెందిన ట్రెంచ్ లు, మార్జినల్ ట్రెంచ్ లు) కూడా భారీ [[భూకంపాలు|భూకంప]] ప్రక్రియలతోను, విస్ఫోటక అగ్ని పర్వత ప్రక్రియలతోనూ సంబంధం కలిగి వున్నాయి.
 
==ట్రెంచ్-నిర్మాణం (structure)==
"https://te.wikipedia.org/wiki/సముద్ర_ట్రెంచ్" నుండి వెలికితీశారు