పర్లాకిమిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
పర్లాకిమిడి మహారాజు కృష్ణ చంద్ర గజపతి నారాయణ దేవ్, ఒడిషాను ఏడు శతాబ్దాల పాటు పాలించిన చారిత్రక తూర్పు గాంగ వంశానికి చెందిన గజపతి రాజుల ప్రత్యక్ష వారసుడు. ఈ వంశపు పాలనలో, ఒడిషా సరిహద్దులు ఉత్తరాన గంగా నది నుండి దక్షిణాన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి వరకు విస్తరించాయి. 15వ శతాబ్దం రెండవ అర్ధభాగంలోని గజపతి చక్రవర్తి కపిలేంద్ర దేవ గజపతి కుమారులలో ఒకడైన కోలహోమి పర్లాకిమిడి వచ్చి పర్లాకిమిడి యొక్క రాజ కుటుంబాన్ని స్థాపించాడు.
 
పర్లాకిమిడి, గంజాం జిల్లా యొక్క దక్షిణ భాగంలోని పశ్చిమ మూలన ఉన్న పురాతన జమిందారీ. పశ్చిమాన విశాఖపట్నం జిల్లా, ఉత్తరాన జయపూరు రాష్ట్రం మరియు మలియాలు లేదా గిరిజన సంస్థలుగా పిలవబడే తూర్పు కనుమలు సరిహద్దులుగా కలిగి ఉంది. పర్లాకిమిడి పట్టణం అటవీమయమైన కొండ పాదాల చుట్టూ L ఆకారంలో అల్లుకున్నట్టుగా ఉండటం విలక్షణమైనది. 'L' యొక్క సమాంతర భాగం దక్షిణ దిశగా ఉంది. 'L' యొక్క మూలలో ప్యాలెస్ ఉంది. ఇది అత్యంత సుందరమైన భవన సమూహం. ఈ భవనాలను చిషోమ్ రూపకల్పన చేసి కట్టించాడు. 1936లో ఒడిషా రాష్ట్రం ఏర్పడే సమయంలో పర్లాకిమిడి జమిందారీలోని 70% ప్రాంతం [[మద్రాసు]] ప్రెసిడెన్సీలో ఉండిపోయింది.{{fact}} ఇప్పుడు ఈ ఒరియా మాట్లాడే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్నాయి.
 
[[గజపతి జిల్లా]] 1992 అక్టోబర్ 2న ఏర్పడినది. దీనికి ముందు అది గంజాం జిల్లాలో ఒక డివిజనుగా ఉండేది. ప్రత్యేక ఒడిషా రాష్ట్ర ఏర్పాటుకు, పర్లాకిమిడి సంస్థానము ఒడిషాలో[[ఒడిషా]]లో చేరటానికి చేసిన కృషికి గుర్తింపుగా కొత్తగా ఏర్పరచిన జిల్లాకు మహారాజా శ్రీ కృష్ణ చంద్ర గజపతి నారాయణ్ దేవ్, పర్లాకిమిడి సంస్థానపు రాజా (ఒడిషా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి), పేరు మీదుగా గజపతి జిల్లా అని పేరు పెట్టబడింది.
 
==భౌగోళిక స్వరూపం మరియు వాతావరణం==
"https://te.wikipedia.org/wiki/పర్లాకిమిడి" నుండి వెలికితీశారు