పర్లాకిమిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
గజపతి జిల్లాలో సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (సి.యు.టి.ఎమ్) రాష్ట్రానికందిస్తున్న సాధారణ విద్యా సేవలు అనేకం. జగన్నాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ 1997 లో స్థాపించబడింది. ఈ సంస్థను గ్రామీణ ప్రాంతాలకు సాంకేతిక విద్య తీసుకుని వచ్చి, వివిధ రంగాల పరిశ్రమలకు ఉపయోగపడే అత్యున్నత స్థాయి నైపుణ్యం కల సాంకేతిక సిబ్బందిని తయారుచేసే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.
 
ఎస్.కె.సి.జి కళాశాల రాష్ట్రంలో రెండవ అత్యంత పురాతన విద్యాలయంగా ప్రసిద్ధి చెందినది. దీనిలో ఆర్ట్స్, సైన్స్ మరియు కామర్స్ తదితర అన్ని ప్రధాన విభాగాలు ఉన్నాయి. 1996-97 విద్యా సంవత్సరం నుండి పి.జి. గణితం కోర్సులను, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, ఒరియా, వాణిజ్య మరియు జీవశాస్త్రాలలో ఇప్పటికే ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చేర్చబడింది. ఫిజిక్స్, గణితం, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, [[ఇంగ్లీష్]], [[ఒరియా]], [[సంస్కృతం]], జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ లో ఆనర్స్ కోర్సులు కూడా బోధిస్తున్నారు. ఇవేకాక కళాశాల [[తెలుగు]], [[హిందీ]], లాజిక్, [[వేదాంతం]] మరియు హోమ్ సైన్స్ వంటి విభాగాలలోను కోర్సులు అందిస్తుంది. [[ఇందిరా గాంధీ]] జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు కళాశాలలో ఒక కేంద్రాన్ని తెరిచారు. కళాశాలలో 2016 మంది విద్యార్థులు మరియు 83 అధ్యాపక పదవులు ఉన్నాయి. కళాశాల 2001లో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నది.
 
పర్లాకిమిడి మహిళా కళాశాల 1983లో స్థాపించబడింది. తొలుత ఐ.ఏ. కోర్సుకై బెర్హంపూర్ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉంది. తరువాత +2 ఆర్ట్స్ కోర్సు కోసం ఒడిషా కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ విద్యకు అనుబంధంగా ఉంది. 1988 నుండి కళాశాల జి.ఐ.ఏ కింద వచ్చింది. కళాశాల 2003-2004లో ప్రభుత్వం యొక్క శాశ్వత గుర్తింపు పొందింది. పట్టణంలో ఉన్న పాఠశాలలో మహారాజా బాలుర ఉన్నత పాఠశాల కుడా ఒకటి.
"https://te.wikipedia.org/wiki/పర్లాకిమిడి" నుండి వెలికితీశారు