గౌతు లచ్చన్న: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (10), గా → గా , పలితం → ఫలితం, ఆర్ధిక → ఆర్థిక, బుద్ using AWB
పంక్తి 39:
తెలుగు వారి రాజకీయ జీవనములో స్వాతంత్ర్యానికి ముందు, తరువాత ప్రభావితము చేసిన నాయకుడు లచ్చన్న. కేవలము స్కూల్ విద్యకే పరిమితమైనా, [[ఎన్.జి.రంగా|ఆచార్య రంగా]] ప్రథమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా, రాజాజి ఉపన్యాసాల అనువాదకుడిగా, చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగువర్గ పోరాట జీవి లచ్చన్న.
==బాల్యము మరియు విద్యాభ్యాసము==
సర్దార్ గౌతు లచ్చన్న: ఉత్తర [[కోస్తా]] కళింగసీమలో ఉద్ధానం ప్రాంతాన (నాటి [[గంజాం జిల్లా]]) [[సోంపేట]] తాలూకాలో [[బారువా]] అనే గ్రామంలో [[1909]] [[ఆగష్టు 16]] వ తేదీన ఒక సాధారణ బీద గౌడ కుటుంబములో గౌతు చిట్టయ్య, రాజమ్మ దంపతులకు 8 వ సంతానంగా పుట్టాడు. లచ్చన్న తాత, తండ్రులు [[గౌడ]] కులవృత్తే వారికి కూడుబెట్టేది.<ref>[http://www.hindu.com/2006/04/20/stories/2006042023640100.htm The Hindu]</ref> [[ఈత|ఈతచెట్లను]] కోత వేసి కల్లు నుత్పత్తి చేయడం, అమ్మడం చుట్టు ప్రక్క గ్రామాల్లో గల [[కల్లు]] దుకాణాలకు [[కల్లు]] సరఫరా చేయడం వారి వృత్తి. కుల వృత్తిలోకి తమ పిల్లలన్ని దించకుండా చదువులను చెప్పించాలని బారువాలో గల ప్రాథమిక పాఠశాలలో [[1916]]లో వాళ్ళ నాన్న చిట్టయ్య చేరిపించాడు. లచ్చన్న బారువా ప్రాథమికోన్నత పాఠశాలలో 8 వ తరగతి వరకు చదివి ప్రక్కనే ఉన్న [[మందస|మందసా]] రాజావారి హైస్కూల్లో 9 వ తరగతిలో చేరాడు. అక్కడ లచ్చన్న చదువు కొనసాగలేదు. దురలవాట్లు, చెడుసహవాసాలు కొనసాగాయి. ఫలితంగా 9వ తరగతి తప్పాడు. [[శ్రీకాకుళం]]<nowiki/>లో లచ్చన్నను ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అక్కడ జగన్నాధం పంతులుగారి ఇంటిలో ఉండి చదువుసాగించాడు. ఆ స్కూల్లో డ్రిల్ మాష్టారు నేమాని నరసింహమూర్తి శిక్షణలో జాతీయ భావాల్ని అలవర్చుకున్నాడు. విద్యార్థి జీవితంలో మార్పు జీవన విధానంలో మార్పు. ఆలోచన ధోరణిలో మార్పు, జాతి, జాతీయత అనే ప్రాథమిక రాజకీయ పాఠాల్ని నరసింహమూర్తి వద్దనే నేర్చుకోవడం జరిగింది. లచ్చన్నకు ఆనాటికి 21 సవంత్సరాలు. 1929-30 విద్యా సంవత్సరం స్కూల్ పైనల్ పరీక్షకు ఎంపికై హాజరయ్యాడు.
 
==స్వాతంత్ర్యోద్యమం==
మెట్రిక్యులేషన్ చదువుతుండగానే 21వ ఏట [[మహాత్మా గాంధీ|గాంధీజీ]] పిలుపువిని విద్యకు స్వస్తి చెప్పి స్వాతంత్ర్యోద్యమంలో దూకాడు. [[1930|1930 లో]] [[మహాత్మాగాంధీ]] [[ఉప్పు సత్యాగ్రహం|ఉప్పు సత్యాగ్రహాని]]<nowiki/>కి పిలుపినిచ్చాడు. దీనికి ప్రభావితుడైన లచ్చన్న [[బారువా]] సమీపంలో ఉన్న సముద్రపు నీరుతో [[ఉప్పు]] తయారుచేసి ఆ డబ్బుతో ఆ ఉద్యమాన్ని నడిపాడు<ref>[http://www.hindu.com/2010/05/23/stories/2010052360750200.htm The word "Cotaur" is the Anglicised version of the Telugu word "Cotauru" meaning "godown".]</ref>. విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొని అందరూ చూస్తుండగానే తన విలువైన దుస్తులను అగ్నికి అహుతి చేశాడు. [[ఉప్పు సత్యాగ్రహం|ఉప్పు సత్యాగ్రహంలో]] పాల్గొంటున్నప్పుడు లచ్చన్నను అరెస్టు చేసి [[టెక్కలి]], [[నరసన్నపేట]] సబ్ జైళ్లల్లో నలభై రోజులు ఉంచారు. కోర్టు తీర్పు మేరకు మరో నెల రోజుల శిక్షను అతను [[బరంపురం]] జైల్లో అనుభవించవలసి వచ్చింది<ref>[http://www.glowfoundations.com/biodata.html At the age of 21, Sri. Latchanna was arrested in connection with the salt-cotaurs raid]</ref>.
"https://te.wikipedia.org/wiki/గౌతు_లచ్చన్న" నుండి వెలికితీశారు