గౌతు లచ్చన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
[[1950]]లో ఆచార్య రంగా కృషి కార్ లోక్ పార్టీని స్థాపించినప్పుడు అందులో లచ్చన్న ప్రధాన పాత్ర పోషించాడు. [[1953]] అక్టోబరు 1 న [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పడింది. [[చెన్నై|మద్రాసు]] ప్రభుత్వం నుంచి ఆంధ్రులకు రావలసిన ఆస్తుల విభజనను పరిశీలించడానికై ఏర్పడిన ఆంధ్రసంఘంలో కాంగ్రెస్ నుంచి [[నీలం సంజీవరెడ్డి]], ప్రజా పార్టీ నుంచి [[తెన్నేటి విశ్వనాధం]], కృషి కార్ లోక్ పార్టీనుంచి లచ్చన్న సభ్యులు. [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం]] పంతులు మంత్రివర్గంలోనూ, [[బెజవాడ గోపాలరెడ్డి]] మంత్రివర్గంలోనూ, లచ్చన్న మంత్రిగా పనిచేశాడు.
 
[[1961]]లో [[రాజాజీ]] స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖకు సర్దార్ గౌతు లచ్చన్న అధ్యక్షుడు. [[1978]]లో లచ్చన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార [[ప్రతిపక్ష నాయకుడుగానాయకుడు]]గా ఉన్నాడు. పభ్లిక్ అక్కౌంట్స్ ఛైర్మన్ గా ఆ రోజుల్లో పనిచేశాడు. కొంతకాలం బహుజన పార్టీలో పనిచేసిన లచ్చన్న ఆ తరువాత అన్ని రాజకీయ పార్టీలతో తెగతెంపులు చేసుకుని, పార్టీలకు అతీతంగా బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ వచ్చాడు.
 
మన దేశంలో సర్దార్లంటే ఇద్దరే. ఒకరు [[సర్దార్ వల్లభభాయి పటేల్]]. మరొకరు సర్దార్ గౌతు లచ్చన్న. ఒకరిది దేశస్ధాయి, మరొకరిది రాష్ట్ర స్థాయి. సర్దార్ అంటే సేనాని. స్వాతంత్ర్యోద్యమ పోరాట వీరునిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన కురువృద్ధుడు సర్దార్ గౌతు లచ్చన్న. జమీందారీ వర్గాల వ్యతిరేక పోరాట వీరునిగా ప్రజాహృదయాలలో ఆయన స్థానం చెక్కు చెదరనిది.
 
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న [[2006]] ఏప్రిల్ 19 న కన్ను మూశాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/గౌతు_లచ్చన్న" నుండి వెలికితీశారు