సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రప్రధమ → ప్రప్రథమ, మళయాళం → మలయాళం, ( → ( using AWB
పంక్తి 8:
== సినిమా అంటే ==
 
''సినిమా'', ''ఫిలిమ్'', ''మూవీ'', ''టాకీ'' అనేవన్నీ ఆంగ్లపదాలు. వీటి మధ్య కాస్త తేడాలున్నాయి గాని వీటన్నింటినీ ఇంచుమించు సమానార్ధకంగా వాడడం జరుగుతుంది. ఇక "Motion Picture" అనే ఆంగ్లపదానకి సరైన అనువాదపదంగా తెలుగులో '''చలనచిత్రం''' (కదిలేబొమ్మ) అంటారు. కాని '''సినిమా''' అనేదే బాగా జనబాహుళ్యంలో వాడే పదం. ఇంకా '''[[వెండితెర]]''' అనే పదాన్ని కూడా సినిమాను సూచిస్తూ వాడుతారు.
 
''ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్'' పై '''[[కెమేరా]]'''తో వరుసలో చిత్రాలు ముద్రంచడం అన్నది సినిమాకు ప్రధానమైన ప్రక్రియ. ఫిల్మ్‌ను ప్రొజెక్టర్‌లో వేగంగా కదపడం వలన వరుస చిత్రాలన్నీ ఒకదానితో ఒకటి కలసిపోయి ఆ చిత్రాలు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. దీనిని "Persistence of vision" అంటారు. మొదట మూగగా ప్రారంభమైన సినిమాలకు తరువాత ధ్వని తోడయ్యింది. ఆపై రంగులు అద్దారు. అలా సినిమా చాలా కాలం నుండీ వర్ధిల్లుతూ వస్తోంది.
 
అయితే అన్ని రంగాలలోలాగానే సినిమారంగంలో కూడా ఇటీవల చాలా సాంకేతికమైన మార్పులు సంభవించాయి. ముఖ్యంగా కంప్యూటర్లు, డిజిటల్ టెక్నిక్కులు, యానిమేషన్ వంటి సాంకేతిక ఆవిష్కరణలు సినిమా నిర్మాణాన్ని, ప్రదర్శనలను అనూహ్యంగా ప్రభావితం చేశాయి.
"https://te.wikipedia.org/wiki/సినిమా" నుండి వెలికితీశారు