విజయలక్ష్మి పండిట్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
'''విజయలక్ష్మి పండిట్''' (ఆగస్ట్ 18, 1900 - డిసెంబర్ 1, 1990) సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, మరియు దౌత్య వేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి [[మోతీలాల్ నెహ్రూ]]. [[జవహర్‌లాల్ నెహ్రూ]] సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి గాంచింది. 1962 నుండి 1964 వరకు [[మహారాష్ట్ర]] గవర్నరుగా పనిచేసింది. 1921 లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్ సీతారామ్ పండిట్ ను వివాహమాడింది. అప్పటి సంప్రదాయాల ప్రకారం ఆమె పేరును విజయలక్ష్మి పండిట్ గా మార్చడం జరిగింది.
 
భారత స్వాతంత్ర్య సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలకూ, కారాగార శిక్షలనూ, సైతం లెక్క చేయకుండా, తమ ధన మాన ప్రాణాలను దేశమాత స్వాతంత్ర్యం కోసం వ్యాగం చేసిన మహాపురుషులు, వీరవనితలందరిలో విజయలక్ష్మీ పండిట్ కూడా ఒకరు. భారత దేశంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి పొందిన మహిళ ఈమె. నెహ్రూ వంశీయులది పూర్వం [[కాశ్మీరు]], కాశ్మీరు పేరు విననివారు మనలో చాలా అరుదు. ప్రకృతి అందచందాలూ, అంతకు మించిన వాతావరణం పచ్చని పచ్చిక బయళ్ళు చూడాలంటే, కాశ్మీరులోనే చూడాలి కాశ్మీరు భూలోక స్వర్గం. [[నెహ్రూ]] వంశీయులు కాశ్మీరు నుంచి వచ్చి ఢిల్లీలో[[ఢిల్లీ]]లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
 
==బాల్యం==
పంక్తి 63:
స్వరూపకుమారి అయిదు సంవత్సరాల వయస్సులో 1905 సంవత్సరం మే నెలలో జవహర్ లాల్ విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్ళాడు. కుమారునితో పాటు కుటుంబమంతా వెళ్ళారు. జవహర్ లాల్ లండన్ హోరో విశ్వవిద్యాలయంలో చేరాడు. కుమారుడ్ని అక్కడ చదివేందుకు అన్ని ఏర్పాట్లు చేసి మోతీలాల్ భార్య పిల్లలతో ప్రపంచ యాత్ర చేశాడు.
 
మోతీలాల్ తన కుటుంబంతో ఇండియా చేరేసరికి ఇండియాలో రాజకీయ కల్లోలం తయారైంది. అంతకు పూర్వం పరాయి వారొచ్చి తమ మీద అధికారం చెలాయిస్తున్నారన్న విషయం బాధ కలిగించినా, ఐకమత్యాలు, అవగాహనలు లేకపోవటం వలన వారినే పాలకులుగా అనుమతించారు మనవారు. రోజు రోజుకు బ్రిటిష్ పాలకుల దురాగతాలూ, అత్యాచారాలూ ఎక్కువైపోతున్నాయి. భారతీయుల స్వేచ్ఛకు ఎక్కుబ భంగం కలుగుతోంది. చేయని నేరాలకు శిక్షలు, పండని పంటలకు పన్నులు, ప్రకృతి ప్రసాదించే వస్తువులపై కూడా విపరీయమైన పన్నులు వేయడం, కట్టలేని వారి ఆస్తులు పశువులు జప్తు చేసి స్వాధీనం చేసుకోవడం వంటివి ఎక్కువైపోయాయి. భారతీయులను ఇంకొంచెం వేధించేందుకు కర్జను ప్రభువు వంగదేశాన్ని రెండు భాగాలుగా విభజించి, ఒక భాగంలో మహమ్మదీయులకు ఎక్కువ ప్రాముఖ్యం కలిపించి, హిందూ, ముస్లిం లకు మత కల్లోలాలు సృష్టించాడు. దీనితో దేశంలో అంతః కలహాలు ప్రారంభమైనాయి. 1906 లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడైన దాదాబాయి నౌరోజి, స్వరాజ్యం అనే నినాదం లేవనెత్తాడు. తర్వాత విదేశీ వస్తువుల బహిష్కరణ, [[స్వరాజ్యం]] సాధించటం జాతీయ విద్య అమలుపరచడం వంటి విషయాలలో చాలా ఉద్యమాలు ప్రారంభమైనాయి. ఈ భావాలను 1908 లో బిపిన్ చంద్రపాల్ ప్రచారం చేసారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో అతివాదులు, మితవాదులు అనే రెండు భాలుగా విడిపోయారు.తిలక్ మహాశయుడు కూడా యీ అతివాద ధోరణి వల్లనే ప్రభుత్వం చేత ఆరు సంవత్సరాలు కఠిన కారాగాల శిక్ష విధించబడి 1908 లో మండలే జైలుకు వెళ్ళాడు.
 
యీ మతవాదుల ఉద్యమాల వలన మోతీలాల్ అంతగా ఆకర్షించపడక పోయినా, 1915 వ సంవత్సరంలో జరిగిన హోంరూలు ఉద్యమము నుంచీ, మోతీలాల్ రాజకీయాలపైన ఆసక్తి యెర్పడింది. 1915 నాటికి [[అనిబిసెంట్]] దివ్యజ్ఞాన సమాజంలో ఉంది. అప్పతికి తిలక్ జైలు నుంచి విడుదలవటం జవహర్ లాల్ ఇంగ్లాండులో బారిష్టరు డిగ్రీతో ఇండియాకు వచ్చి న్యాయవాద వృత్తి ప్రారంభించటం, దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ రావటం లాంటివి జరిగాయి.
 
మోతీలాల్ రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచీ, [[కాంగ్రెస్]] నాయకులు చాలామంది "ఆనంద భవనానికి" రాకపోకలు ఎక్కువ చేశారు. అందువలన స్వరూపరాణికి తండ్రి గారి మూలముగా చిన్నతనం నుంచే అఖిలభారత కాంగ్రెస్ నాయకులందరితో పరిచయాలు ప్రారంభమైనాయి. 1915 వ సంవత్సరం కాంగ్రెస్ మహాసభలు బొంబాయిలో జరిగాయి. ముస్లింలీగ్ సమావేశాలు కూడా అక్కదె జరిగాయి. మోతీలాల్ తో పాటు స్వరూప కుమారి యీ రెండు సమావేశాలకు హాజరైనా, ఆమెకు రాజకీయాలపైన పెద్ద పరిశీలనా దృష్టి లెకపోవడంతో సమస్యలు క్షుణ్ణంగా అర్థమయ్యేవి కావు. అయినా ఆమెకు దేశ పరిస్థితులు, ఉద్యమ విధానాలు తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రం ఉండేది.
 
1916 వ సంవత్సరంలో స్వరూపకుమారి అన్న గారైన జవహర్ లాల్ నెహ్రూ కు కమలా నెహ్రూతో ఢిల్లీలో వివాహమైంది. మోతీలాల్ బాగా ధనవంతుడవడం వలన వివాహం చాల ఆడంబరంగా జరిగింది. వారు కాశ్మీరు విహార యాత్రకు వెళుతూ వారి వెంట స్వరూప కుమారి కూడా వెళ్ళింది. వీరు కాశ్మీరు అందచందాలను చూసి మొదటి ప్రపంచ యుద్ధం అయ్యాక తిరిగి వచ్చారు. తండ్రీ కుమారులు యుద్ధ వార్తలు చాలా కుతూహలంగా వింటూ చర్చించుకొనేవారు. తండ్రి అన్నతో స్వరూప కుమారి కూడా ఆ వార్తలూ, వీరి నిర్ణయాలూ వింటూ పరిస్థితులను కొంత అవగాహన చేసుకుండేది.
పంక్తి 73:
స్వరూప కుమారి ఆమె సోదరి కృష్ణ లకు కవిత్వమంటే మంచి ఆసక్తి. వారిద్దరూ ఎక్కువ కాలం వారి తోటలో కూర్చుని సాయంకాల సమయాలలో కవిత్వ ప్రసంగాలతో కాలము వెళ్ళబుచ్చేవారు. స్వరూప కుమారి పదిహేడవ ఏట ఆమె సంరక్షకురాలైన ఆంగ్ల వనిత వెళ్ళిపోయింది. సోదరి కృష్ణకు ఆమె అన్ని విధాల చేదోడుగా ఉంటూ, పది సంవత్సరాల కృష్ణకు ఆమె ఎంతో విజ్ఞానాన్ని బోధిస్తూ ఆమెను విపరీతంగా ప్రేమించింది.
 
స్వరూప కుమారికి కసలు పాఠశాల విద్యంటే తెలియదు. [[జలియన్ వాలా బాగ్]] ఉదంతంతో ఉద్యమం గాంధీజీ నాయకత్వంలో ఉదృతమైనది. ఈ సంఘటనలన్నీ మోతీలార్ పూర్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఉపకరించాయి. గాంధీజీ, మోతీలాల్ చర్చల ఫలితంగా ఆ సంవత్సరం అమృత్ సర్ లో జరిగిన కాంగ్రెస్ మహాసభకు మోతీలాల్ అధ్యక్షుడు. జలియన్ వాలా బాగ్ ఉదంతంతో మోతీలాల్ కుటుంబమంతా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో మోతీలాల్ కుటుంబమంతా పాల్గొన్నారు.
 
==వివాహం==
"https://te.wikipedia.org/wiki/విజయలక్ష్మి_పండిట్" నుండి వెలికితీశారు