ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
లక్ష్మణస్వామి మొదలియారు వైద్యవృత్తినీ, వైద్యవిద్యనీ చేపట్టి రెండింటిలోనూ ప్రతిభ చూపారు. అనంతర కాలంలో అనేకమైన పదవుల్లో ప్రపంచవైద్యసంస్థకు, దేశంలోని వైద్యసంస్థలకు సేవలు చేసినా ప్రధానంగా ఆయన చికిత్సలోనూ, బోధనలోనూ ఉద్యోగ జీవితాన్ని గడిపారు.
=== చికిత్సరంగంలో ===
వైద్యవిద్య పూర్తిచేసుకున్న వెంటనే లక్ష్మణస్వామికి 1909లో ప్రభుత్వ వైద్యశాఖలో [[ఉద్యోగం]] లభించింది. మొదటి సంవత్సరం [[మదురై]], పశని పట్టణాల్లో పనిచేసి ఆపైన [[మద్రాసు]]కు బదిలీ అయ్యారు. మద్రాసులో మొదట ఆయనను డొనోవన్ అనే ప్రఖ్యాత వైద్యునికి సమాయకునిగా నియమించారు. ఆపైన 1912లో ఎగ్మూరులోని ప్రభుత్వ స్త్రీ, శిశు ఆసుపత్రికి బదిలీ చేశారు. ఆనాటి నుంచీ ఆయన స్త్రీ, ప్రసూతి, శిశు వైద్యరంగంలో విశేష నైపుణ్యాన్ని కనబరిచి అదే స్పెషలైజేషన్ లో ఏళ్ళతరబడి పనిచేయడమే కాక సుప్రఖ్యాతులయ్యారు. 1914లో ఆయన బి.యే. పూర్తచేసుకుని పట్టభద్రుడు కావడంతో ఆయనను రాయపురంలోని ప్రసూతి ఆసుపత్రికి ఉద్యోగోన్నతిపై బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన మంచి వైద్యునిగా పేరుగడించి తన బాధ్యతలు నిర్వర్తించారు. 1920లో ఆయనను మద్రాసు ప్రభుత్వ మహిళల శిశువుల ఆసుపత్రికి బదిలీచేశారు. ఆపైన అక్కడే 25 సంవత్సరాలకు పైగా పనిచేసి తనకూ, ఆసుపత్రికీ కూడా దేశాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆయన వద్ద నైపుణ్యం నేర్చేందుకు, వైద్యవిద్యలో లోతుపాతులు తెలుసుకునేందుకు ఆసుపత్రికే బర్మా, మలేషియా, చైనా మొదలైన ఆసియా దేశాల నుంచి స్నాతకోత్తర వైద్యవిద్యార్థులు వచ్చి వెళ్ళేవారు.<ref name="ఆర్కాట్ సోదరులు-చల్లా">{{cite book|last1=రాధాకృష్ణమూర్తి|first1=చల్లా|title=ఆర్కాట్ సోదరులు|date=అక్టోబర్, 1988|publisher=తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|edition=మొదటి ముద్రణ|accessdate=23 November 2014}}</ref>
 
=== వైద్యబోధనలో ===