ప్రధాన మెనూను తెరువు

మార్పులు

+న్యూకాజిల్ యునైటెడ్ F.C. లింకు
}}
 
'''అలన్ షియరర్''' <small>OBE</small>, <small>DL</small> (పుట్టిన తేది 13 ఆగస్ట్ 1970) ఒక రిటైర్డ్ ఇంగ్లీష్ [[ఫుట్ బాల్|ఫుట్‌బాల్ ఆటగాడు]]. అతను ఇంగ్లీష్ లీగ్ ఫుట్‌బాల్‌లో ఉన్నతమైన స్థాయిలో సౌతాంప్టన్, బ్లాక్‌బర్న్ రోవర్స్, న్యూ కాజిల్ యునైటెడ్‌కు ఇంకా ఇంగ్లాండ్ జాతీయ జట్టుకి స్ట్రైకర్‌గా ఆడాడు. అతనికి అత్యంత గొప్ప స్ట్రైకర్స్‌లో ఒకడన్న గుర్తింపు మెండుగా ఉంది; అతను న్యూకాజిల్స్ మరియు ప్రీమియర్ లీగ్‌లకు రికార్డ్ గోల్‌స్కోరర్. ఆటగాడిగా రిటైర్ అయ్యాక షియరర్ ఇప్పుడు BBCకి టెలివిజన్ పండిట్‌గా పనిచేస్తున్నాడు. అతని క్రీడాజీవితం ముగిసే సమయానికి అతను UEFA ప్రో లైసెన్స్ కోసం కొంత పనిచేసాడు, ఇంకా, ఒక మానేజర్ కావాలన్న కోరిక వ్యక్తం చేసాడు. 2009లో అతను కొంతకాలం BBC వదిలి, 2008-09 సీజన్ చివరి ఎనిమిది గేమ్స్ కోసం, న్యూకాజిల్ టీంను స్థాయి పడిపోకుండా కాపాడటానికి, [[న్యూకాజిల్ యునైటెడ్ F.C.|న్యూకాజిల్ యునైటెడ్]] మానేజర్‌గా వెళ్ళాడు. అతను సఫలీకృతుడు కాలేదు.
 
న్యూకాజిల్ అపాన్ టైన్ జన్మస్థలమైన షియరర్, తన వృత్తిపరమైన ఆరంభం, 1988లో, [[ఇంగ్లీష్]] టాప్-ఫ్లైట్ క్లబ్ సౌతాంప్టన్‌తో మొదలుపెట్టి, హాట్రిక్ చేసాడు. సౌత్ కోస్ట్‌లో ఎన్నో సంవత్సరాలు గడిపినపుడు, అతను తన క్లాసిక్ స్టైల్ ఆట తీరు, బలం మరియు గోల్ చేయు శక్తి సామర్ధ్యం వల్ల మంచి పేరు తెచ్చుకున్నాడు; అతనికి అతి త్వరలో, అంటే 1992లో, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనే అవకాశం వచ్చింది, దానితో పాటు బ్లాక్‌బర్న్ రోవర్స్‌కు బదిలీకి కూడా ఆహ్వానం అందింది. నార్తెర్న్ ఇంగ్లాండ్‌లో ఒక ఆటగాడిగా షియరర్ స్థిరపడ్డాడు, అతను ఇంగ్లాండ్ జట్టులో ఒకడయ్యాడు, ఇంకా అతని 34 గోల్స్ మొత్తం, బ్లాక్‌బర్న్ 1994-95లో, ప్రీమియర్ లీగ్ టైటిల్ వశం చేసుకోవడానికి ఉపయోగపడింది. 1994లో, ఫుట్‌బాల్ రైటర్స్ అసోసియేషన్ అతన్ని ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా పేర్కొంది. అతను 1995లో PFA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం గెలిచాడు. 1995-96 సీజన్‌లో షియరర్ మొదటిసారి ఛాంపియన్స్ లీగ్‌లో కనపడ్డాడు ఆ తర్వాత, 31 గోల్స్‌తో ప్రీమియర్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యూరో 1996లో ఇంగ్లాండ్ తరఫున అయిదు గోల్స్, ఆ తర్వాతి 1996-97 ప్రీమియర్ లీగ్‌లో 25 గోల్స్ చేసి టాప్-స్కోరర్‌గా నిలిచాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2041919" నుండి వెలికితీశారు