వట్టికోట ఆళ్వారుస్వామి: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 9:
'''వట్టికోట ఆళ్వారుస్వామి''' [[తెలంగాణ]] ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు. ఆయన రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, [[కమ్యూనిస్టు]] నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, మరియు ప్రచారకుడు. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడు. తెలుగులో రాజకీయ నవలలకు ఆద్యుడు.<ref>[http://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA146&dq=vattikota&sig=6kRAM-jm90w5ENnQ2Sq50GGSwPo Encyclopaedia of Indian literature vol. 1 By various పేజీ.146]</ref>
==విశేషాలు==
*ఆళ్వారు స్వామి చదువు మధ్యలో ఆపేసి గ్రంథాలయోద్యమంలో[[గ్రంథాలయోద్యమం]]లో కొనసాగాడు. దాశరథి పద్యాలు జైలు గోడల మీద రాసి దెబ్బలు తిన్నాడు.
*ప్రజల మనిషి నవలలో కంఠీరవం డైలాగులు:
“[[ఇస్లాం]] అంటే శాంతి . శాంతిని కోరి సత్యానికి పోటీపడే ఏమతమైనా నాకు సమ్మతమే ! కాని మీరు , మీ మతాన్ని శాంతికి ద్రోహం చేసేదిగా మార్చినారు “.”కులాల పేర, మతాల పేర ప్రారంభమైన అడ్దుగోడలు క్రమంగా బలమైన అడ్డంకులుగా తయారైనాయి . దాంతో మనలో ఐక్యత నశించింది”
* హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన స్వయంగా చదువు నేర్చుకుని, రచయితై, ప్రచురణ కర్త అయ్యాడు.
 
==బాల్యం ==
[[1915]] [[నవంబర్ 1]] తేదీన [[నల్లగొండ]] జిల్లా [[నకిరేకల్]] సమీపంలోని [[చెరువు మాదారం]]లో సింహాద్రమ్మ, రామచంద్రాచార్యులకు జన్మించాడు. తండ్రి చిన్ననాట చనిపోవడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండిపెడుతూ విద్యాభ్యాసం, సారస్వతాభ్యాసం చేశాడు.