ఇ.వి.వి.సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
==తొలినాళ్ళు==
సత్యనారాయణ [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[దొమ్మేరు]]లో [[వ్యవసాయ]] కుటుంబంలో పుట్టాడు. నాన్న వెంకటరావు, అమ్మ వెంకటరత్నం. ఈయన కుటుంబానికి దొమ్మేరులో 70 ఎకరాల పొలం ఉండింది. [[బాల్యం]] నుండి సినిమాలంటే ఆసక్తితో కనీసం వారానికి రెండు సినిమాలైన చూసేవాడు. ఇంటర్మీడియట్ వరకు బుద్ధిగానే చదివినా, ఇంటర్‌కు [[నిడుదవోలు]] వెళ్ళిన సత్యనారాయణ కాలేజికి వెళ్ళకుండా రోజూ ఉదయం ఆట, మధ్యాహ్నం ఆట సినిమాలను చూడటంతో హాజరు తక్కువై ఇంటర్మీయడ్ తప్పాడు. అప్పుడు సత్యనారాయణ తండ్రి ఆయన్ను కాలేజీకి పంపించి లాభం లేదని నిశ్చయించి తండ్రితో పాటు పొలం పనులు చూసుకోవటానికి నియమించాడు. 19 యేళ్ళకే 1976లో సరస్వతి కుమారితో పెళ్ళైంది. ఆ వెంటనే సంవత్సరానికి ఒకరు చొప్పున ఇద్దరు కొడుకులు పుట్టారు. వీళ్ళకు రాజేష్, నరేష్ అని పేరు పెట్టారు. కొన్నాళ్ళకు వ్యవసాయంలో[[వ్యవసాయం]]లో పెద్ద నష్టాలు రావడంతో పొలాలు అమ్మేయవలసిన పరిస్థితి కలిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉండటానికి సత్యనారాయణ తెగ ఇబ్బంది పడి ఎక్కడికైనా మరో ఊరికి కొన్నాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇ.వి.వి స్నేహితుడు నిర్మాత [[నవతా కృష్ణంరాజు]] మేనల్లుడైన సుబ్బరాజును సంప్రదించి ఒక సిఫారుసు ఉత్తరం పట్టుకుని మొదటిసారి [[మద్రాసు]] వెళ్ళాడు. నవతా కృష్ణంరాజును కలిసి ఉత్తరం ఇవ్వగా ఆయన సినీరంగంలో జీవితం అనుకున్నంత సులభం కాదని, తిరిగి సొంత ఊరికి వెళ్ళిపొమ్మని హితవు చెప్పాడు. దాంతో పూర్తిగా నిరాశచెందిన సత్యనారాయణ, తిరిగి వెళ్ళినా చేసేదేమీ లేదనుకుని [[మద్రాసు]]లోనే ఉండి వివిధ ప్రదేశాలు తిరుగుతుండేవాడు. పాండీబజారుకు వెళ్ళి అక్కడ సహాయదర్శకులు చెప్పుకునే మాటలు వినేవాడు. ప్రతి ఉదయం నవత కృష్ణంరాజు కార్యాలయం గేటు వద్ద నుంచుని ఉండేవాడు. ఒక నెలరోజుల తర్వాత కుర్రవాని పట్టుదలను చూసి ఏం చెయ్యగలవు అని అడిగాడు. సహాయ దర్శకున్ని అవుతానని చెప్పిన ఇ.వి.విని [[కనకాల దేవదాసు]] క్రింద [[ఓ ఇంటి భాగోతం]] సినిమాకు సహాయదర్శకునిగా అవకాశం ఇప్పించాడు.<ref>http://www.totaltollywood.com/interviews/E.V.V.Satyanarayana_2110.html</ref>
.
 
"https://te.wikipedia.org/wiki/ఇ.వి.వి.సత్యనారాయణ" నుండి వెలికితీశారు