ఇంద్ర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( (2), తో → తో (2) using AWB
పంక్తి 28:
==కథ==
బాలుడిగా ఉన్న ఇంద్రసేనా రెడ్డి ([[చిరంజీవి]]) సీమలోని ఫ్యాక్షన్ తగాదాలలో తన తండ్రిని కోల్పోతాడు. సీమని కాపాడటానికి తన తండ్రి అన్నదమ్ములలో ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో బాల్యదశలోనే ఇంద్ర తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తాడు.
కొన్నేళ్ళ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ శంకర్ నారాయణ ([[చిరంజీవి]]) కాశీలో గంగానదిలో స్నానం చేస్తుంటే ఒక ముత్యాల హారం దొరుకుతుంది. కాశీలో తన కూతురు పల్లవి ([[సోనాలి బేంద్రే]])కి సంగీతం నేర్పించాలని గవర్నరు చెన్న కేశవ రెడ్డి ([[ప్రకాశ్ రాజ్]])తన కుటుంబంతో సహా గంగలో మునకలు వేస్తుండగా పల్లవి మెడలోంచి జారిన హారమే అది. శంకర్ [[మేనకోడలు]] నందిని క్లాస్ మేట్ గా పల్లవి చేరుతుంది. తన మామ మెడలో హారాన్ని చూసిన పల్లవి వారి ఇంటిలోనే ఉంటూ శంకర్ ని ప్రేమిస్తూ ఉంటుంది. కాలేజీ హాస్టల్ లో కాక ఒక ట్యాక్సీ డ్రైవర్ ఇంటిలో తన కూతురు ఉంటుందని తెలుసుకొన్న చెన్న కేశవ రెడ్డి భద్రతా సిబ్బందితో సహా శంకర్ ఇంటిని చుట్టుముడతారు. శంకర్ ని చూసిన చెన్న కేశవ రెడ్డి చేతులెత్తి అతనికి నమస్కరిస్తాడు.
లాంచీ డ్రైవర్ అయిన గిరి ([[శివాజీ]]) నందినిల ప్రేమని అంగీకరించిన శంకర్ వారి [[వివాహం]] జరిపిస్తూ ఉంటాడు. గిరి స్నేహలతా రెడ్డి ([[ఆర్తి అగర్వాల్]]) మేనల్లుడు వీర మనోహర రెడ్డి అని తనే స్వయంగా పెళ్ళి పందిరి లోకి నేరుగా వచ్చి శంకర్ ని ఇంద్ర పేరుతో సంబోధించి చెప్పటంతో స్తబ్దుడవుతాడు శంకర్.
మూగవాడుగా నటిస్తున్న శంకర్ నమ్మిన బంటు వాల్మీకి ([[తనికెళ్ళ భరణి]])నోరు తెరచి శంకర్ ఇంద్ర సేనా రెడ్డి అని, సీమ క్షేమం కోసం కాశీలో అజ్ఞాతవాసం చేస్తున్నాడని తెలుపుతాడు. అజ్ఞాతవాసం ముగించుకొన్న ఇంద్ర సీమకి తిరిగి వెళ్ళి, దుష్టులైన తన వ్యతిరేకులని సంహరించి శాంతిస్థాపన చేసి అక్కడి ప్రజలకి శాంతి సందేశం అందించటంతో కథ ముగుస్తుంది.
 
==సంభాషణలు==
ఈ చిత్రంలోని కొన్ని ప్రస్తావించదగిన సంభాషణలు
"https://te.wikipedia.org/wiki/ఇంద్ర_(సినిమా)" నుండి వెలికితీశారు