దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
 
==సాహిత్య కృషి==
వృత్తి రీత్యా శివరావు గారు న్యాయ వాదైనా వారు సాహిత్యాభిలాషి. వారి జీవితం సాహిత్య కృషి కే అంకితం. శివరావు గారి సాహిత్యాభి రుచి చిన్నానాటి నుండే. పద్నాల్గెండ్ల ప్రాయంలో రెండవ ఫారంలో చదువుతుండగా 1912 లో వీరేశలింగం గారి సతీమణి గారి స్మారకోత్సవం శివరావు గారి ప్రార్థన భక్తచింతామణి పద్యాలు తోటి ప్రారంభం అయింది. అప్పట్ణుండీ రాజమహేంద్రవరంలో సారస్వత సభలలో బాలుడైన శివరావు గారు చదవే భక్తచింతామణి పద్యాల ప్రార్థనతో ప్రారంభించటం పరిపాటి. వారు 3 వ ఫారంచదువతున్నప్పుడు చిలకమర్తివారి రామచంద్ర విజయమును పూర్తిగా వ్రాసినందుకు వారి క్లాస్ మాస్టారు భక్తచింతామణి (3వ సంకలనం) పుస్తకమును బహుకరించారు.. ఆరేళ్ల తరువాత, 1919 లో భక్తచింతామణి రచించిన [[వడ్ఢాది సుబ్బారాయుడు]]గారే స్వయంగా వారి చేతి దస్కత్తుతో భక్త చితామణి 8 వ సంకలన మును శివరావు గారికి బహుకరించారు. 1913 లోఆంధ్రభాషాభి వర్ధిని (చిలకమర్తి వారు స్దాపించి న సారస్వత సభ) లో సభ్యలుగా చేరారు. 1914 లో శివరావు గారి వ్యాసం “స్త్రీ విద్య” ఆలమూరు వెంకటరాజుగారి వ్యాసంతో పాటు గృహనిర్వాహకము అను చిన్నపుస్తకములో ముద్రింప బడింది. 1914 లో ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజము వార్షికోత్సనము అధ్యక్షుడుగా [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] గారు, కార్యదర్శిగా [[అద్దంకి సత్యనారాయణ శ]]ర్మగారు, సభ్యులుగా [[మైనంపాటి నరసింహ రావు]], [[అడవి బాపిరాజు]], బంధా వీరనారాయణదేవు, గుడిపాటి సూర్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, ఈరంకి నరసింహము, సూరంపూడి కనకరాజు, దిగవల్లి వెంకట శివరావు, పోణంగిపల్లి సత్యనారాయణ, చింతపెంటవెంకట రమణయ్య, వాసిరెడ్డి వీరభద్ర రావు, [[కవికొండల వెంకటరావు]] తదితరులు. ఆ వార్షికోత్సవాల సమావేశాలకు అనేక ప్రసిధ్ధ పురుషులు అధ్యక్షత వహించారు. వారిలో కొందరి పేర్లు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, [[శ్రీపాద కృష్ణమూర్తి]] గారు, [[చిలుకూరి వీరభద్రరావు]] గారు, [[వంగూరి సుబ్బారావు]] గారు, [[చెలికాని సుబ్బారావు]] గారు, [[నాళం కృష్ణారావు]]గారు, వడ్డాది సుబ్బారావుగారు,[[కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి]] గారు అలా 1914 లో జరిగిన సమావేశం లోశివరావు గారు స్త్రీ విద్య మీద ప్రసంగించారు. ఇంకో సారి “హిందూమహా జనులమతసభ, అనబడిన సమావేశం లో కందుకూరి వీరేశలింగం గారు కూడ హాజరైవున్నప్పుడు శివరావు గారు రామానుజాచారి పాత్ర వహించి తను రచించిన పద్యం చదవగా వీరేశలింగం గారు చాల ప్రసన్నులైయ్యారు. 1915-1916 సంవత్సరం లో SSLC క్లాసులో ఇంగ్లీషు పరీక్షలో ఉన్నత మార్కలుతో4 సెక్షన్ల మీద మొదటి స్దానం లో నిలిచినందుకు వారి క్లాస్ మాస్టారు గజవల్లి రామచంద్రరావు M.A గారు Life of Gladstone by John Morley 3 volumes బహుకరించారు. రాజమండ్రీ జ్ఞాపకాల్లో వారి డైరీ లో చిలకమర్తివారి కీ శ్రీపాద కృష్ణమూర్తిగారికి వకరిమీద వకరు ఎద్దేవపుర్వక వాదోపవాదాలు జరుగుతూవుండేవని వారి డైరీ లోరాజమండ్రీ జ్ఞాపకాలలో వ్రాసుకున్నారు. 1916 లో మద్రాసు ప్రసిడెంసీ కాలేజీ లో ఇంటర్మీడియట్ చదువుతుండగా “హత్యా ఛాయ” అను నవల తెలుగులో వ్రాశారు. ఆ నవల ఆధారంగానే 1929 లో నీలాప నింద అను పుస్తకము ప్రచురించారు. 1918 లోఇంటర్ ఫైనల్ వుడగా [[మద్రాసు]] రాజధాని కాలేజీ తెలుగు విద్యార్థుల ఆంధ్ర భాషావర్ధని సమాజం తరఫున శివరావు గారు ఆంధ్ర వాణి అనేటివంటి చేతివ్రాత పత్రికకి సంపాదకులుగా వుండేవారు ఆపత్రికలో “ విడువము” అనే పేరుతో వ్రాశిన సంపాదకీయ ప్రచురణను చాలమంది అభనందించారు శ్రీ నూతక్కి రామశేషయ్య గారు (తదుపరి జయపూరు దివాన్ గాచేశారు ) చాల అభినందించారు. భహ్మశ్రీ వావిలకొలను సుబ్బారావు గారు ఆ చేతివ్రాత పత్రిక అభిమానులు. అదే కాలంలో 1918 లో శివరావు గారికి మద్రాసు సాధు సంఘం వారు శివరావు గారు వ్రాసిన “ రాజ భక్తి” అను వ్యాసమునకు రజత పతాకం బహుకరించారు. ఆ పతకం మద్రాసు జిల్లా కలెక్టురు గారు ప్రోగ్రెసివ్ యూనియన్ హాలు జరిగిన బహిరంగ సభలో బహుకరించారు. 1919 లో శివారవు గారు బి.ఏ చదువుతుండగా శ్రీ కృష్ణదేవరాయలు మీద వ్రాసిన వ్యాసం ఎమ్.పి శర్మ గారు మద్రాసులో సంపాదకులు గావున్న విద్యావిశాఖ పత్రికలో ప్రచురించ బడింది. 1919–1920 సంవత్సరంలో శివరావుగారు వ్రాసిన ఆత్మ విశ్వాసము అను వ్యాసమునకు మద్రాసు రాజధాని కాలేజీ వారు చిరకాలంగా ప్రతీఏటా 1875 నుంచీ ఇస్తూవచ్చిన రూ 20 బౌరదల్లన్ బహుమతి 1919 సంవత్సలో శివరావుగారికి వచ్చింది. అంతకు పూర్వం ఆ బౌరదల్లన్ బహుమతిని పొందినవారిలో 1875 లో [[తల్లాప్రగడ సుబ్బారావు]] ( 1850-1890) ( సుబ్బారావు గారు మద్రాసు థియోసఫికల్ సొసైటీకి శక్రటరీ చేశారు, అనిబిశంటు కన్నా ముందు ). తరువాత 1891 లో వేపారామేశం గారికి ( వేపారామేశం గారు మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు ) పానుగంటి రామారాయణింగారికి in 1892, పెద్దిభొట్ల వీరయ్యగారికి 1894 and [[దాసు విష్ణురావు]] గారికి 1895 లోను వచ్చినట్లుగా శివరావు గారి డైరీ లోవ్రాసుకున్నారు. చిన్ననాటినుండీ వారు గాంధీగారి సత్యాగ్రహ ఉద్యమం, స్వాతంత్ర్యపోరాటానికి వారి ఉపాధ్యాయుల ప్రేరేపణ వారి మనస్సుకు బాగా నాటుకున్నాయ. 1913- 1914 సంవత్సరం స్కూలు విద్యార్థిగానుండగనే రాజమండ్రీలో వారు గాంధీగారు దక్షిణాఫ్రికాలో[[దక్షిణాఫ్రికా]]లో చేసే సత్యాగ్రహ ఉద్యమసహాయానికి నిధులు పోగుచేశి పంపిచారు. 1920 లో లాకాలేజీలో జేరేట్టప్పటికే గాంధీగారి సహాయనిరాకరణోద్యమము కొనసాగుతుండటం వారి మనస్సు ఆందోళనకు గురై స్వాతంత్ర్యపోరాటంలో తను కూడా పాలు పంచుకోవాలనే ఒక గట్టి సంకలనం రావటం జరిగింది. వారు ఎలాగో లాకాలేజీ చదువు పూర్తిచేసుకుని బయట పడుతూనే కాంగ్రెస్ రాజకీయాల్లో తన శక్తికొలది బాధ్యతలు నిర్వహించారు. లాకాలేజీలో జేరబోయే ముందు 1919 సంవత్సరం ఎండా కాలపు శలవలకి శివరావుగారు బొంబాయికి వెళ్లారు . అవి రౌలట్ బిల్లు తిరస్కారానికి తీవ్ర ఆందోళన చెస్తున్న రోజులు. ఆక్కడ బోంబే క్రానికల్ పత్రిక (బి.జి హర్నిమన్ సంకలనంచేసే పత్రిక ) సత్యాగ్రహ ఉద్యమాన్ని చాల అనుకూలంగా ప్రచురించేటటువంటి పత్రిక (ఆకారణంగా హర్నిమన్ నుకు దేశాంతర శిక్ష విధించారు deported ) శివరావు గారు ఆ పత్రికలో ప్రచురించిన వ్యాసాలు, విశేషాలు కత్తిరించి ఒక ఫైలలో అతికించుకుని తిరుగు ప్రయాణంలో బెజవాడకు వస్తుండగా ఒక సి ఐ ఢి పోలీసు రైలు బండి లోకి వచ్చి ఆ ఫైలు తనతో అట్లా తీసుకును వెళి తే తంటాల్లో పడతావని హెచ్చరించాడుట. మద్రాసులో లా చదువుతూవుండగనే 1920 నవంబరులో లియో టాల్సాయి, రంబీంద్రనాధ్ రచించిన 23 కథలు “కోడి గృడ్డంత వడ్లగింజ , మేము మీకు పట్టముగట్టితిమి, పధ్నాలుగేండ్ల ప్రాయము” అను 23 కథలు వారు తెలుగులో వ్రాసిన వ్యాసాలు ఆంధ్ర పత్రికలో ప్రచురితమైనవి. 1891 లో దాసు కేశవరావు గారు బెజవాడలో నడుపుచున్న జ్ఞానోదయము అను వార పత్రికలో1922 ఆ ప్రాంతములో శివరావు గారు రచించిన వ్యాసుములు హైందవ నాటకరంగము, హైందవ వనోద కథలు అను రెండు వ్యాసములు చురితమైనవి
[[దస్త్రం:చళ్ళ పిళ్ళ వెంకటశాస్త్రి గారు.pdf|thumbnail|కుడి|దిగవల్లి వేంకటశివరావు చెళ్ళపిళ్ళ వేంకటశివరావుకు వ్రాసిన ఉత్తరం]]
1922 నుండీ న్యాయవాది వృత్తితోపాటు సాహిత్యం, స్వాతంత్ర్యపోరాటం
 
1922 లో న్యాయవాది వృత్తిలో ప్రవేశిస్తూనే వారు ఒకప్రక్క గాంధీగారి ఆధర్వాన జరిగే జాతీయ ఉద్యమాల ఆందోళనల దిశానిర్ధేశాల ప్రకారం కృష్ణా జిల్లాలో జరిగే ఆందోళనకు మదత్తుగా కృషి చేయటం ఇంకొక ప్రక్క ఏమాత్రం సమయం వృధా చేయకుండా సాహిత్య కృషి చేయటం న్యాయవాది వృత్తితోపాటు గణ నీయం. వారు చేసిన సాహిత్య కృషి ప్రశంసనీయము బెజవాడలో నున్న రామమోహన లైబ్రరీలో నున్న చరిత్ర సాహిత్యమీద వున్న అనేక పుస్తకాలు చదవటమే కాక మద్రాసులోని కొన్నెమరా లైబ్రరీ నుండి తనకు కావలసి న పుస్తకాలు ఇంటికి తెప్పించుకునే ఏర్వాటు రామమోహన లైబ్రరీ వారి ద్వారా చాలా సంవత్సారలుగా శివరావుగారికి వుండేది. ఆ విధంగా వారు అనే క పుస్తకాలు మద్రాసునుండి తెప్పించుకును బహు విధ కృషి చేసి అనేక చారిత్రాత్మక విషయాలు తెలుగు వారికోసం అనేక పుస్తకాలు వ్యాసాలు వ్రాయగలిగారు. 1922 బి యల్ ఆఖరి సంవత్సరంలో వుండగనే ఆంధ్రుల సం స్క్రుతిక చరిత్ర అనే వారి వ్యాసం బొంబాయి లోని తెలుగు సమాచార్ అనే పత్రికలో ప్రచిరుతమైనది. పట్టాపుచ్చుకుని జూన్ 1922 లో బెజవాడలో న్యాయవాది వృత్తిలో ప్రవేశించి న తరువాత శ్రీ [[కురుగంటి సీతారామయ్య]] గారు M.A (was Head Master) నడుపుచున్న విద్యార్థి అను పత్రికలో శివరావు గారి వ్యాసములు (1) భారతీయుల లలిత కళలు (2) జాతీయవిద్య ప్రచురితమైనవి. 1923-24 లో “చిన్న కథలు”, “మన దారిద్య్రము”, “ తెల్మా ([[నార్వే]] దేశపు నవలాధార కధ) అను వ్యాసములు శ్రీ [[దుగ్గిరాల రాఘవచంద్రయ్య]] గారు బెజవాడనుండి పచురించే స్వరాజ్య పత్రికలో ప్రచురించ బడినవి. 1922 లో ప్రెసిడెంసీ కాలేజీ లో వ్రాసిన పోటీ వ్యాసము పోతన-వేమనుల వారి కాలము, కృతులు నకు శివరావుగారికి 1924 పొవెల్ మోరహెడ్ ప్రాదేశిక భాషల బహుమతి రూ 150 ఇచ్చారు. ఈ వ్యాసము నే ఆధారంగా చేసు కు ని 1924 లో పోతన వేమనలయుగము అనే పుస్తకము ను ప్రచురించారు. ఆ పుస్తకము[[వావిలకొలను సూరయ్య]] గారు, [[కొడాలి ఆంజనేయులు]] గారు నడిపేటటువంటి శారదాభాండారు ప్రెస్సు లో ముద్రితమైనది. 1923 లో కాకినాడ కాంగ్రెస్సు సదస్సుకు శివరావరు గారు కూడ వాలంటరీ భాద్యత లో వెళ్లారు. 19/08/1922 టంగుటూరు ప్రకాశం గారు ఉత్తరంవ్రాసి వారి స్వరాజ్య పత్రికకు స్పెషల్ కరెస్పాండెంటు గా వుండమని వ్రశారు అందు కు అంగీకరించిన శివరావు గారు 1922 కాకినాడ కాంగ్రెస్సు కు వచ్చిన [[దుగ్గిరాల గోపాల కృష్ణయ్య]] గారిని ఇంటర్వ్యూ చేసి స్వరాజ్యకి పంపిన రిపోర్టు ప్రచురితమైనది. 1925 లో [[వేలూరి సత్యనారాయణ]] గారి పుస్తకం బౌధ్ధమహా యుగం లో శివరావుగారి గారి సాహిత్యకృషి ని గూర్చి చెప్పారు. ఆదే సంవత్సరం లో [[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారు [[సింగరాజు వెంకట సుబ్బారావు]] గారింట్లో వుండగా డా [[ఘంటసాల సీతారామ శర్మ]]గారు శివరావుగారికి మొదటిసారిగా [[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారిని పరిచయం చేయగా వారు శివరావుగారిని తమ భారతి మాస పత్రిక కు వ్యాసాలు వ్రాస్తు వుండమని అప్పట్ణుంచీ భారతి ని శివరావుగారికి కాంప్లిమెంటరీ గా పంపిచే ఏర్పాటు కూడా చేశారు. రాజమండ్రీలోని హితకారణి స్కూలుకు పూర్వవిధ్యార్ధుల సంఘం కోరిక పై 1925 వార్షికో త్సవం కు శివరావు గారు అధ్యక్షత వహించారు. [[అయ్యదేవర కాళేశ్వరరావు]] గారి ప్రేరేపణపై శివరావుగారు 1927 లో “దక్షిణాఫ్రికా” అనే పుస్తకం ప్రచురించారు. ఆ పుస్తకమును మహామత్మా గాంధీ గారికి అంకితమివ్వడానికి గాంధీ గారి అనుమతి కోరుతూ వ్రాయగా గాంధీ గారు శివరావు గారికి స్వయంగా చేతో జవాబు వ్రాశిన పోస్టు కార్డులో వ్రాసిన వాక్యాలు ఈ క్రింద ఇవ్వబడినవి .
 
<poem>
పంక్తి 87:
</poem>
 
శివరావు గారి సాహిత్య, రాజకీయ రంగాలలో అభిరుచి కలగడానికి విద్యార్థి దశనుండే వారి అధ్యాపకుల బోధనలు, గొప్ప పుస్తకాలు వారి జాతీయ భావాలను చిగుర్చి స్వతంత్ర పోరాటానికి దోహ దం చేశాయి. 1920 లో వారు లా కాలేజీలో జేరిన సంవత్సరం గాంధీగారి సహాయనిరాకరణోద్యమం అప్పటికే జోరుగా సాగుతున్న రోజులు వారి మనసు కలవర పరచ సాగింది. న్యాయ వాది చదువు దైవాధీనంగా పూర్తిచేసుకుని బయటపడుతూనే స్వతంత్ర పోరాటసమరాటం అనేక విధాలుగా తనపాలు పంచారు. 1966 లో వారి సన్మాన సభలో మాట్లాడుతూ ఇట్లా చెప్పారు “ I read Savarkar’s war of Independence in 1929 and had no sleep for three nights” ఆ విధంగా అనేక సందర్భాలలో వారి మనస్సు మీద స్వతంత్ర పోరాటానికి ప్రేరణ కలిగింది. 1927 డిశంబరు 2 న భహ్మశ్రీ [[వేదం వెంకట రామశాస్త్రి]] గారు అప్పటికి బెజవాడలో నున్న ఆంధ్రవిశ్వవిద్యాలయ కాన్వోకేషనుకు వచ్చియుండగా బెజవాడ మ్యునిసిపల్ కౌన్సిల్ వారు శాస్త్రి గారిని సన్మానించటానిక సభ ఏర్వాటు చేసి శివరావుగారిచే వ్రాయించిన సన్మాన పత్రం శాస్త్రి గారికి ఇచ్చారు, 1929 లో కోఆపరెటివ్ సొసైటీ న్యూస్ అను పత్రికలో శివరావుగారు ‘ భారతదెశ దారిద్యము’ అను వ్యాసము వ్రాశారు. ఆవ్యాసమును ఆధారము చేసే “ నిరభాగ్య భారతము” అను వ్యాసము కృష్ణా పత్రికలో ప్రచురించారు. 1930 లో పశ్చమ కృష్ణా జిల్లా న్యూస్ వారు శివరావుగారు రచించిన అనేక చిన్న పుస్తకములను ప్రచురించారు. పశ్చమ కృష్ణా జిల్లా మాహా సంఘం వారు రాజకీయ పరి జ్ఞానము అను పేరుతో చాల చిన్నపుస్తకములను ప్రచురించారు వాటిలో శివరావు గారు వ్రసినవ్రాసిన వి ఆరు పుస్తకములు ప్రచురించారు ఆంధ్ర గ్రంథాలయం వారు ముద్రించారు. అందులో మొదటిది “సత్యాగ్రహ చరిత్ర” 12/03/1930 తేదీనా డు వెలువడింది. రెండవది “నిర్భాగ్య భారతము” 6/04/1930 నాడు వెలువడింది. అలాగ మిగత నాలుగూ దరిద్ర నారాయణీయము, సత్యాగ్రహ భూమి, సత్యాగ్రహ విజయము, పంచాజ్ఞాయుగము ఒకదానితరువాత ఒకటిగా వెలువడ్డాయి. ఈ “రాజకీయపరిజ్ఞానము” అను ప్రచురణలను బ్రిటిష్ ప్రభుత్వము వారు1933 నవంబరులో నిషేధిచారు. 1933 లో సహకార వస్తు నిలయము, [[అధినివేశ స్వరాజ్యము]] (Dominion Status ), and భారతదేశ స్థితిగతులు ” అను చిన్న చిన్న పుస్తకములను ప్రచురించారు. వారి అధినివేశ స్వరాజ్యము చాల ప్రఖ్యతి గాంచింది. 1934 లో ఆచార్య ఎన్ జి రంగా గారు [[నిడుబ్రోలు]] లో రైతు బడినొక దానిని స్తాపించారు. ఆ రైతు బడిలో శివరావు గారి పుస్తకాలు ను పాఠ్య పుస్తకాలు గా పెట్టారు. రంగా గారు శివరావు గారిని నిడుబ్రోలు వచ్చి అందులో విజ్ఞాన సాధనకై వచ్చే రైతాంగానితో సంభోదించమని ఆహ్వానించారు. కానీ శివరావు గారు వెళ్లటానికి వారి సమయం చాలలేదు. శివరావు గారు 1939 నుండీ బ్రిటిష్ యుగ చరిత్ర మీద పరిశోధన ప్రారంభించి తీవ్ర కృషి సల్పి అనేక వ్యాసములు వ్రాయటం ప్రారంభిచారు అలా వారు వ్రాసిన వ్యాసాలు అమృత సందేశము [immortal Message] లో ప్రచురించారు. ఆ పత్రిక బెజవాడలో సి వి రెడ్డి మరియు డి.యస్ శర్మ గార్లు సంకలనం చేశావారు అదే పత్రికలో శివరావు గారివి ఇంకో రెండు వ్యాసాలు—“ Christianization of India” మరియు “Hindu Muslim Civilization” అనే రెండు ఆంగ్ల భాషలో వ్రాసిన వ్యాసములను 1939- 1940 లో అమృత సందేశంలో ప్రచురించారు.. ఆంధ్ర మహా సభ వారు ఆంధ్రదేశ చరిత్ర వ్రాయించటానికి రచయితల సంఘం ఏర్పరిచారు. అందులో శివరావుగారని సభ్యులుగా నియమించారు . అట్లా నియమించినట్లుగా ఆంధ్రపత్రికలో వెల్లడైనది కూడా. 04/11/1943 తారీఖునాడు చిలకమర్తి వారు శివరావుగారికి జాబు వ్రాస్తూ వీరి సాహిత్య కృషి ప్రశంసించారు. 13/04/1945 తేదీన శ్రీ ప్రణవానంద స్వామి వారు శివరావు గారికి స్వయముగా గాయత్రీ మంత్రార్ధ వివిరము తెలియ పరిచారు. ఆరోజులలో 1930 నుండీ -1947 దాకా వారికి చాల ప్రముఖు ల వుత్తరాలు వ్రాసియున్నారు. అప్పట్లోవారి కన్నా చాల పెద్దవారు వ్రాసిన ఉత్తారలలో గజవల్లి రామచంద్ర రావు,[[వడ్డాది సుబ్బారాయడు]],[[చిలకమర్తి లక్ష్మీ నరసింహం]], [[వావిలకొలను సుబ్బారావు]], [[చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి]], [[వేటూరి ప్రభాకర శాస్త్రి]], [[వేలూరి శివరామశాస్త్రి]], [[మాడపాటి హనుమంతరావు]],[[అయ్యదేవర కాళేశ్వర రావు]] మొదలగు ప్రముఖులు. వారి సమకాలీకులైన సాహిత్యవేత్తలు ఇంకా చాలా మంది వారితో తరుచు ఉత్తర ప్రత్తుత్తరాలు జరిపినట్లుగా తెలుస్తున్నది. ఇక్కడ వారి పేర్లివ్వటం సాధ్యమైన విషయం కాదు. 1930 -40 మధ్యకాలంలో వారు సహకార సంస్ధలకు సంబందిచిన పని కూడా చేశారు. కృష్ణా జిల్లా సహకార బ్యాంకు, సహకార సంస్ధ నిబంధనలు, ఉప ప్రబంధనలు ఏప్రిల్ 1935 లోను, మరియు గోదావరి జిల్లా సహకార బ్యాంకు ఉపప్రబంధనలు 1935 మే నెలలోను, తెలుగులో వ్రాశారు వాటినే ఆయా సంస్దలవారు రిజస్టరు చేయంచి 1935 మేనెలలో ముద్రించారు. 1935 లో బెజవాడలో కృష్ణా సహకార స్టోర్సు పేరుతో వున్న సంస్ధకు కార్యదర్శిగా కూడా చేశారు. చెరుకుపల్లి వెంకటప్పయ్యగారు అధ్యక్షుడు గానుండేవారు తరువాత ఆంధ్ర కోఆపరేటివి ఇనసేటిట్యూట్ కు డైరెక్టరుగా పనిచేశారు.. 17/06/1937 శివరావు గారు Resignation and dismissal of ministers” అని హిందూ దిన పత్రికలో ఉత్తరం వప్రచురించారు. 01/02/1938 న హిందూ పత్రికలో శివరావు గారు సేకరించిన భారత దేశ రాజ్యాంగ విధానము (constitution) లో నున్న విషయాలు కొన్నిటిని ప్రచురించారు. [[సి యఫ్ యాండ్రూస్]] గారు కాంగ్రెస్ అగ్రగణ్యడుగా వ్రాశిన ‘rise and growth of Congress’ అను పుస్తకము నకు మద్రాసు & ఆంధ్ర ప్రావిన్సుల పరిస్థితులను శివరావుగారు సేకరించి వ్యాసరూపంలో వారికి పంచారు.యాండ్రూస్ గారు 23/05/1939 శివారవూగారికి కృత్రజ్ఞతాపూర్వకమైన లేఖ వ్రాశారు 09/08/1942 తేదీన క్విట్ ఇండియా ఆందోళన ప్రారంభించినట్లుగా కాంగ్రెస్సు అగ్రనాయకులు ఉద్ఘోషించగానే గాంధీ గారిని అరెస్టుచేసిన కోన్ని నిముషములో ఆంధ్రలో ప్రొవెన్సియల్ కాంగ్రెస్సు వారు క్విట్ ఇండియా వుద్యమం ప్రారంభిచటానికి ఆంధ్ర కాంగ్రెస్సు నాయకుడైన [[కళా వెంకట్రావు]]గారి 29/07/1942 తేదీన ప్రకటన కర పత్రం సరళమైన తెలుగులో రేడియోలో ప్రసార నిమిత్తము వ్రాసిపెట్టమని [[నూకల వీరరాఘవయ్య]]గారు (వారి మరో పేరు శ్రీమతే) శివరావుగారిదగ్గరకు రాగా శివరావుగారు తెలుగులో వ్రాసిన పత్రం ముద్రించి యావధ్ధాంధ్ర దేశం పంచపె ట్టటం క్విట్ ఇండియా ఆందోళనలో జరిగిన విషయాలు. శివరావుగారు ఆంధ్రీకరించిన ఆ ప్రకటన పత్రం ఆనాటి కాంగ్రెస్సు కార్యకర్తలో చాల ప్రఖ్యాతి గాంచింది. 1946 లో మద్రాసునుండి ప్రచురితమైయ్యే [[న్యూ టైమ్స]] అనే పత్రికలో సంపాదకుడు యమ్ తిరుమలరావు సంపాదకుని మాటల్లో టంగుటూరి ప్రకాశంగారి జీవత చరిత్రని విషమంగా వ్యాఖ్యానించి వ్రాశారు. దానికి స్పందనముగా శివరావు గారు 12/08/1946 తేదిన ఆ పత్రిక సంపాదకునికి బహిరంగ లేఖ ఘాటుగా “Stop this disgraceful vilification of Prakasam” అని వ్రాసి పంపిచారు. ఆలేఖ ముద్రించి దానిమీద బెజవాడ పౌరులు న్యాయవాదులు సంతకాలు చేసి గాంధీగారికి పంపిచారు. ఆకాశవాణి ఢిల్లీలో [[వారణాశి సుబ్రమణ్యం]] గారు ప్రోగ్రమ్ డారెక్టరుగానున్నారు. వారు ఒక ఉత్తరంలో అప్పట్లో ఆంధ్ర ప్రొవిన్సియల్ కాంగ్రెస్సుకు అధ్యక్షుడుగానున్న [[ఆచార్య రంగా]]గారు టెక్నికల్ టెరమ్సు ట్రాన్సలేషన్ నిమిత్తము కమిటీనేర్పాటు చేస్తున్నారన్నీ ను, దానికి శివరావుగారిని అధ్యక్షనిగా వేస్తున్నారని దానికి శివరావుగారిని వద్దనకుండా స్వీకరించమని వారణాశి సుబ్రమణ్యంగారు వ్రాశారు. 1947 లో [[కొండా వెంకటప్పయ్య]] గారు తాను రచించిన వేంకటేశ్వర శతకం శివరావుగారికి బహుకరించారు. అదే సంవత్సరంలో బెజవాడ మునిసిపాలిటీ ఎన్నికలు జరిగినవి అధ్యక్ష పదవికి డా ఘంటసాల సీతారామశర్మ గారు పోటీ చేయ నిశ్చయించగా, వారికి ఎన్నికలు మానిఫస్టో శివరావుగారు తయారు చేశారు. [[కొమర్రాజు లక్ష్మణరావుగారులక్ష్మణరావు]]గారు రచించిన పుస్తకం శివాజీ 3 వ సంకలనం 11/09/1947 తేదీన ప్రకటితమై న పుస్తకమునకు పరిచయ వాక్యాలు శివరావుగారు వ్రాశారు. అలే గే 4 వ సంకలనానికి కూడా డా [[కొమర్రాజు అచ్చమాంబ]]గారి తమ్ముడు [[కొమర్రాజు వినాయకరావు]] గారు కోరినమీదట మరల పరిచయవాక్యాలు శివరావుగారే వ్రాశారు. 1955 లో [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ]] సమితి వారు పెట్టబోయే సమితికి శివరావుగారి సలహాలు కోరారు. [[కంభంపాటి సత్యనారాయణగారు]] 1957 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ సంపాదకలుగానున్నప్పడు శివరావుగారు పెట్టిన షరత్తుల ప్రకారం ఏమాత్రం మార్పులు చేయకుండా 1857 పూర్వరంగములు అను పుస్తకమును విశాలాంధ్ర వారు ప్రచురించారు. 1957 లోనే నవోదయా పబ్లిషింగ్ హౌసు శివరావు గారు రచించిన సన్యాసుల స్వాతంత్ర్య సమరములు, ఆదిమనవాసుల యుధ్ధములు, మధుర నాయకులు అను మూడు పుస్తకములను ముద్రించుటకు నిశ్చయించి మొదటి రెండిటినీ వెంటనే ముద్రించారు.[[కాటూరి వెంకటేశ్వరరావు]]గారు అప్పట్లో (1957) కృష్ణా పత్రికకు సంపాదకుడుగానున్న [[కాటూరి వెంకటేశ్వరరావు]] గారు శివరావు గారిని తమ పత్రికకు వ్యాసములువ్రాయమని కోరారు.
శివరావుగారి సాహిత్య పరిశోధన, రచనలు క్రమ క్రమంగా 1922 నుండీ శర వేగంతో వృధ్ది అవుతూవచ్చి 1940 నుండీ 1950 మధ్యలో అత్యదికంగావున్నవని చెప్పవచ్చును. వారు వ్రాసిన వ్యాసములు పది ఇరవై కాదు, ఒకటి రెండు పత్రికల్లో అనికాదు. అనేక వ్యాసాలు, వరుసగా శీర్షికలుగా వివిధ పత్రికల్లో, బెజవాడలోని పత్రికలే కాక ఆంధ్ర దేశంలో మారుమూలల నుండి ప్రచురితమైన పత్రికలవారు శివారువూగారి వ్యాసాలు కావలని కోరటం కొన్ని కొన్ని వ్యాసాలు అటువంటి కొన్ని చిన్న చిన్న పత్రికలకూడా పంపించి ప్రచురింటం కనబడుతున్నది. ఉదాహరణకు [[జ్ఞానోదయము]] [[ప్రజామిత్ర]], [[కొరడా]], [[అమృతసందేశము]], [[సమదర్శిని]], [[గ్రంథాలయసర్వస్వము]], [[వసుమతి]], [[ప్రభాతము]], [[మాత్రు భూమి]],[[గ్రామోద్యోగి]],[[సహకారమిత్ర]] [[సమదర్శిని]], [[విజయవాణి]], [[జామీను రైతు]],[[ఆంధ్ర లాజర్నల్]], [[సమాలోచన]] ఇత్యాదులు. ఇంక మద్రాసునుండి ఆతరువాత బెజవాడనుండి ఇంకాతరువాత హైదరాబాదునుండీ క్రమ క్రమంగా వచ్చిన అనేకం రోజూవారి, వీక్లీ, పక్ష మాస పత్రికలు శివరావుగారి వ్యాసాలు ప్రచురించని పత్రికంటూ లేదనటం అతిశయేక్తి గదేమో. వారి వ్యాసాల సూచీ చివరలో పత్రికవారి, సంవత్సరం వారిగా సాధ్యమైనంతవరకూ తయారుచేసి చివరలో జతపరచడమైనది.
===శివరావుగారి వద్ద కల అరుదైన పత్రికల ప్రచురణ ప్రతులు, పుస్తకాలు===