దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 105:
==శివరావరు గారు బెజవాడ బార్ యసోసియేషన్ కి అధ్యక్షుడుగా==
 
1947 లో శివరావుగారు 31-01-1947 న [[బెజవాడ బార్ యసోసిఏషన్]]కు అధ్యక్షునిగా ఎన్నికైయ్యారు. న్యాయవాదిగనూ, ఆ సంస్ధ అధ్యక్షునిగనూ ఆకాలంలో వారు చేసినపని గణనీయము. వారి కృషితో కొన్నిచిరకాల సమశ్యలను పరిష్కారమైఏట్లుగా చేశారు. అప్పటివరకూ న్యాయవాదులకు బార్ రూమ్ లో ఎండాకాలంకూడా మంచినీళ్ళిచ్చే జీతగాణ్ణి పెట్టుకోటానికి ప్రభుత్వఅనుమతి లేకపోటంవల్ల చాల ఇక్కట్టైన పరిస్తి తి వుడేది. వీరి అధ్యక్షతన మద్రాసు హైకోర్టు అనుమతికై ప్రయత్నంచేయటం చిట్టచివరకు లభించటం జరిగింది. ఆ ప్రయత్నానికి జిల్లాకోర్టు జడ్జిగారు ఆట్టే అభిరుచిచూప్పిచలేదు. అప్పటిదాక జిల్లాకోర్టుకుకూడా ఆ వ్యవస్థ వుండేది కాదు. వీరి ప్రయత్నంతో జిల్లాకోర్టువారుకు కూడా లబ్ధి పొందారు. బెజవాడ సివిల్ కోర్టుకు దగ్గరలో నున్న మునిసిపల్ ఉన్నత పాఠశాల బహిరంగ మైదానంలో ఒక మూల మునిసిపల్ పాహిఖానా బహిరంగంగా కుదువబెట్టేవారు (storing of night soil). ఆది ఆ స్కూలు వారికే కాక ఆవేపునుంచి కోర్టుకు వచ్చే ప్రతి వారికి చాల అసహ్యకరమైన భరించరాని దుర్వాసన కలిగేది. కానీ అప్పటిదాకా ఎవ్వరూ ఏమీ చేయగలిగినట్లులేదు. శివరావు గారి అధ్యక్షతన బార్ యసోసియేషన్ వారు ఈ విపరీత పధ్ధతిని అరికట్టడానికి పట్టణ హెల్తాఫీసర్ కి వ్రాయగా వారు అలాంటిదేమీ మునిసిపాలిటీ వారు చేయటంలేదని దబాయింపు జవాబు చెప్పగా శివరావు గారు వదిలే మనిషికానందున వారు మద్రాసులోనున్న డైరెక్టరు ఆప్ పబ్లిక్ హెల్త్ కు వ్రాసి తగుచర్యకై కృషిచేయగా చివరకు ఆ సమస్య తీరింది. [[మునిసిపాలిటీ]] వారు ఆప్రదేశము చుట్టూ గోడ కట్టి తగు లోతుగా గొయ్యలు చేసి మూసి పెట్టివుచటం మొదలగు చర్యలు తీసుకునట వల్ల. బార్ యసోసేఏషన్ లో ఏ విషయానైనా పరిష్కారం కేవలం గవర్నింగ్ కమిటీయే చయాల్సివచ్చేది., దీనికి చాల కాలం వృధాగా వేచియుండాల్సి వచ్చేది. శివరావుగారి అధ్యక్షతన ఒక ఫోరాన్ని ఘటన చేయటం తత్కకాల పరిష్కార నిర్ణయాలను తీసుకుని వాటిని గవర్నింగ్ కమిటీ తదుపరి ఆమోదించేటట్టుగా చేయటం జరిగింది. ఆ కాలంలోనే టంగుటూరి ప్రకాశంగారు విజయడ వచ్చి సుభాష చంద్రబోసు విగ్రహావిష్కరణచేశారు, ఆమీటింగులో కొన్ని వర్గములవారి ఆందోళన వల్ల పోలీసులు జోక్యంచేసుకోటం జరిగింది. ఆసందర్భములో పోలీసులవారు లాఠీ చార్జీ చేశారని ఫిర్యాదుమీద ప్రభుత్వమువారు జిల్లాకలెక్టరుచే విచారణజరిపించారు. ఇరుపక్షములవారి కోరికపైన జిల్లకలెక్టరు శివరావుగారినీ, వారి సహచరుడైన వెంకటప్పయ్యగారినీ విడివిడిగా పిలచి జరిగిన విషయం చెప్పమని కోరారుట. శివరావుగారి సమధర్మనిస్పక్షపాత న్యాయ దృష్టి ఆవిధంగా అందరికీ అవగతిలో నుండేది. ఇంక జడ్జీల ప్రవర్తన వల్ల ఇటు న్యాయవాదులకు, అటు కక్షిదారులకూ గూడా కష్టతరంగా నున్న పరిస్థితులో ధైర్యంగా శివరావుగారు వారితో యదురుబడి సరైన దోవపట్టమని కోరిటం పై అధికారులకు వ్రాయటం మొదలగు చర్యలు: ఒక సారి 1947 లో జేసుదాసన్ అనే ఒక జాయింట్ మేజస్ట్రేట్ గారు కక్షిదారులతోనూ అనభవజ్ఞులైన న్యాయవాదులతో కూడా దురుసుగా వ్యవహరించేవారు. ఆపరిస్థితులో శివరావు గారు జిల్లాజడ్జిగారితో మాట్లాడినపిదర జేసుదాసన్ గారిని బదలీ చేయటం జరిగింది. ఇంకో సారి ఆర్ సి జోషి ఆనే సబ్ కలెక్టరు ఐ సి యస్ గారు తమ కోర్టును వారికనుకూలమైన సమయాలలోను, ఇంటిదగ్గరా సాయంత్రం పోద్దుపోయినా కూడా కోర్టును నిర్వహించటం వల్ల కక్షిదారులుకు న్యాయవాదులకు చాల ఇబ్బంది గలుగతూవుండేది. ఆపరిస్థితుల్లో శివరావుగారు జోషీ గారితో పరిస్థితి చెప్పి వారిని సరిగా నిర్నీత సమయాల్లో కోర్టును నిర్వహించమనికోరగా ఆ జోషీ గారు “నాతో ఇట్లాగ ఎవ్వరూ మాట్లాడలేదు” అన్నారుట అంతట శివరావుగారు “ప్రతిరోజు మీ దగ్గర వారి కి పని వుంటుంది అందుకని మీతోఇలా ఎవ్వరూ మాట్లాడరు, మీదగ్గర నాకే మీ పనిలేదు” అన్నారట . అంతట జోషీగారు తమఇబ్బందులును గూర్చి, బయట రాజకీయనాయకులు వీరి పనిలో జోక్యంచేసుంటు వత్తిడి తేవడంవంటి సాకులు చెప్పగా శవరావు గారు “మీరు చేసేది ఐ సి యస్ సర్వీసు, రాజకీయనాయకులతో ఎట్లా వ్యవహరించేదీ మీకు ఇప్పటికే తెలిసి వుండాలి” అని చెప్పారట. దాంతో జోషీగారు తమ దినచర్యలో మంచి మార్పుతో వ్యవహరించారట. కానీ, జోషీ గారి కష్టాలు వత్తిడిలు దృష్టిలోవుంచుకుని శివరావుగారు 20-07-1948 లో హిందూ పేపరులో లేఖ వ్రాయగా కాంగ్రెస్సు నాయకులు తప్పుపట్టి కొండావెంకటప్పయ్యగారిని పంపించి మాట్లాడించగా శివరావు గారు వారికి జోషీగారు పడే ఇబ్బందుల గురించి చెప్పారుట. ఇంకోసారి గోనేళ్ల కృష్ణ అనే ఫస్ట క్లాస్ మేజస్ట్రేట్ గారు కూడా చాల పొద్దుపోయినాకూడా కోర్టు నడిపిస్తుంటే పలువురు న్యాయవాదులు ఇబ్బంది గురించి శివరావుగారికి చెప్పుకోగా వారు కృష్ణాగారికి వ్రాయగా మేజస్ట్రేటుగారు వారి కోర్టును నిర్ణీత సమయాల్లో నడపటం జరిగింది. మద్రాసు హైకోర్టువారు బెజవాడ బార్ యసోసియేషన్ వారిని కోర్టుకేసుల త్వరిత గతిన విచారించటానికి మార్గాలనుకోరగా బెజవాడలో అప్పట్లో అతి అనుభవజ్ఞుడై రిటైరైపోయు న పెద్ది భొట్ల వీరయ్యగారి అమూల్య సలహలను పంపించటం జరిగింది. . న్యాయవాదిగనే కాక శివరావుగారు బార్ యసోసియేషన్ కు సాహిత్యమైన రూపుగూడా ఇచ్చారు. తిరుపతి దేవస్తానమువారికి వ్రాసి గొప్ప ఆధ్యాత్మకమైన తామ్రశాసనములు, సంస్కృతాంధ్ర గ్రంథాలు తెప్పించి బార్ యసోసియేషన్లో నుంచారు. శివరావు గారి హయములోనే భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర్య దినేత్సవం అతి వైభవంగా గడుపుకోటం జరిగింది. ఆఉత్సవ విందు వైభవాలలో వివధ వుద్యోగస్తులు పెద్దా చిన్నా అని విచక్షణ లేకుండా, అలాగే అన్నివర్గాలవారు, హిందూ, ముస్లిం ఇసాయిల నాయకులు అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు పాలుపంచుకోటం విశేషణీయమైనది. కాని ఆరోజున జరిగిన వేడుకలో బెజవాడ న్యాయస్దాన సబ్ జడ్జిగానున్న అలీ రజా బైగ్ గారు మాత్రం పాలుపంచుకోకుండా వారి ఛేంబరులోంచి బైయటక్కూడా రాకుండా వుండటం ఒక సంఘటన అని శివరావు గారు వారి జ్ఞాపకాలలో వ్రాసుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్యానంతరము కూడా న్యాయ స్థానములోలను ఇతర ప్రభుత్వ కార్యస్తళాలలోనూ ఇంకా ఆంగ్ల రాజుల చిత్రపఠాలు యధా తదంగా వుంచటం చూసి శివరావుగారు హిందూ పత్రికకు 07/08/1947 లేఖ వ్రాయటం జరిగింది. బెజవాడ బార్ యసోసియేషన్ లో న్యాయవాదు ల పేర్ల రిజస్టరును పెట్టి అందులో బెజవాడలో న్యాయవాదులందరినీ మొదటినుండీ జతచేశారు. శివరావు గారు అధ్యక్షుడుగానున్నకాలంలో జిల్లాజడ్జి పర్యవెక్షణ కై వచ్చినప్పుడు పార్టీలు చేశేవారు కాదు. అది ఆకాలంలో నున్న ఒక జిల్లాజడ్జి కె.వి.యల్ నరసింహంగారు. ఒకసారి బెజవాడ సబ్ జడ్జీలు వెంకటెశ్ అయ్యర్ బి.సి హెచ్ నారాయణ మూర్తిలు జిల్లా జడ్జికి టీ పార్టీ ఇస్తు శివరావుగారిని కూడా ఆహ్వానించారు. ఆపార్టీలో జిల్లాజడ్జి నరసింహంగారు శివరావుగారితో చాలవిషయాలు మాట్లాడారు. డిసెంబరు1947 లో బారయసోసియోషన్ డే జరుపారు. 1951 లో డా కె యల్ రావుగారి సూచన ప్రకారం విజయవాడకు వచ్చిన కృష్ణా రివర్ కమీషన్ ఖోసలా కమిటీకి బెజవాడ బార్ యసోసియోషన్ వారు శివరావుగారి ఆధ్యక్షతన నందికొండ ప్రజక్టు మొదలు పెట్టడానికి సమర్ధనగా ఒక మెమొరాండం సమర్పించారు. శివరావుగారు ప్లీడర్ వృత్తిలో కూడా నీతి నిబంధనలతో పనిచేశేవారు. ఎటువంటి గొప్ప వారి వత్తిడికీ లొంగకుండా తన కక్షిదారుని పట్ల బాధ్యతో చేశేవారు దానికి నిదర్శనాలు చాల ఉన్నాయి. 1960 లో డా టి వి యస్ చలపతి రావు గారు ఆంధ్ర పత్రికపై వేసిన కేసులో ఆంధ్ర పత్రిక తరఫున శివరావుగారు పనిచేస్తున్న సమయంలో, యసెంబ్లీ ఎలక్షన్ల ల సమయం రాగా కాంగ్రెస్ పార్టీవారు కెయల్ రావుగారిని గొట్టిపాడి భ్రహ్మయ్య గారినీ శివరావుగారి దగ్గరకు పంపించి ఆకేసు రాజీకై ప్రయత్నంచేసి చివరకు కోర్టులో చలపతిరావుగారి తరఫునుంచి ఒక రాజీ పెటిషన్ పెట్టి శివరావుగారిని ప్రతివాది తరఫన సంతంకం చేయమనగా వారు తన కక్షిదారు అనుమతిలేదని అభ్యంతరంతెలిపి అలాచేయలేదు. ఆంధ్రపత్రిక అధిపతైన [[శివలంక శంభూ ప్రసాద్]] గారు వప్పుకుంటేగానీ ఎంత వత్తిడి వచ్చినా ఆకేసు రాజీ చేయలేదు.
 
1933 లో శివరావుగారిని ఆంధ్ర కోఆపరెటివ్ ఇన్సుటుట్యూటికి డైరక్టరుగానియమించబడ్డారు. తరువాత 1935 లో కృష్ణా జిల్లా కోఆపరెటివ్ స్టోర్సుకు కార్యదర్శిగాను చెరుకుపల్లి వెంకటప్పయ్య అధ్యక్షుని గాను పనిచేశారు. న్యాయవాదిగా శివరావుగారు కోఆపరెటివ్ సొసైటీ అధ్యక్షుడుగానున్న సింగరాజు సుబ్బారావుగారి తరఫున [[అయ్యంకి వెంకటరమణయ్య]] గారికి ప్రతికూలంగా కూడా పనిచేశారు. శివరావుగారు స్వాతంత్ర్య సమరయోధులైన [[ఘంటసాల సీతారామ శర్మ]], [[ఆచార్య ఎన్ జి రంగా]] గారి తరఫున న్యాయవాదిగా వారి తరఫున కేసులు చేశారు. డా శర్మగారిని ఎన్నికలు కమీషన్ వారు అభ్యంతరాల కేసులో వారి తరఫున వాదన చేశారు. ఎన్ జి రంగాగారు జైలునుండి తన రీసెటల్మెంటు కేసులో 108 సి ఆర్ పి సి క్రింద వచ్చిన కేసులో తన తరఫున పనిచేయమని శివరావుగారిని కోరారు