"దిగవల్లి వేంకటశివరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (/* ఉప్పు సత్యాగ్రహం మరియు సహాయనిరాకరణోద్యమము మొదలగు స్వాతంత్ర్య పోరట ఉద్యమాలలో శివరావుగారి ప...)
==1930 ,1931 సంవత్సరములలో శివరావుగారి పై రాజద్రోహం కేసులు==
 
గాంధీజీ దండి యాత్రకు బయలు దేరిన తేదీ12/03/1930. ఆదే రోజున బెజవాడ బార్ యసోసియేషన్ వారు గాంధీజీ నిరాకరణోద్యమము (Civil Disobedience movement) కు మద్ధతుగా ఒక సంకల్పమును (రిజొల్యూషన్) పాస్ చేశి మినిట్సు రికార్డు చేశారు. అరోజునాటి తమ వ్యక్తిగత మనోభావన శివరావుగారు తన డైరీలో ఇట్లా వ్రాశారు “I was in great excitement”. వారు ప్రత్యక్షంగా ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఉప్పు తయారుచేయక పోయినప్పటికీ వారు కాంగ్రెస్ కార్యకర్తగానూ, కృష్ణాజిల్లా కాంగ్రెస్ పబ్లిసిటీ అధినేతగనూ వారు చేసిన అనేక రచనలవలన ప్రజలను కాంగ్రెస్సు కార్యకర్తలను బ్రిటిష్ ప్రభుత్వంచేసే దుష్టపరిపాలనకు వ్యతిరేకంగా ప్రోద్బలంచేస్తున్నందుప్రోద్బలం చేస్తున్నందు వల్లనూ శివరావుగారిని ఏక్షణమునైనా పోలీసువారు నిర్బంధనలోకి తీసుకుంటారని అందరకూ అప్పట్లో విశదమైన విషయం. శివరావుగారు కూడాఎరిగన విషయమే. అందుకని వారి కుటుంబం పిల్లల క్షేమం చూసే దిక్కు తన తల్లిగారైన మాణిక్యాంబగారి పేరట 06/04/1930 తారీఖు న ఒక ట్రస్టుడీడ్ వ్రాసి తన పేరుమీదనున్న స్దిరాస్తిని అవసరమైనప్పుడు అమ్మకం చేసుకోవచ్చని చెప్పి జైలు కెళ్లటానికి సంసిధ్ధులుగా వున్నసమయానికే 23/06/1930 తేదీన పోలీసు వారు సర్కిల్ ఇనస్పెక్టరు ఎన్ యల్ యన్ స్వామి ఆధ్వర్యంలో శివరావుగారి ఇల్లు సోదా చేసి వారు రచించిన పుస్తకములేవైతే ప్రభుత్వము నిషేధించారో వాటిని పట్టుకుని జప్తుచేశారు. ఆ పుస్తకాలతో పాటు బార్ యసోసియేషన్ వారి మినిట్సు పుస్తకం దేంట్లోనైతే బార్ యసోషియేషన్ వారి సంకల్పంచేసి న రిజొల్యూషన్ వున్నదో దాన్నికూడా జప్తు చేయటానికి ప్రయత్నించారు. పోలీసువారు శివరావుగారి మీద 25/08/1930 తారీఖున Sec108 CRPC సెక్షన్ 108 సి ఆర్ పి క్రింద కేసు MC 46/30 దాఖలు చేశారు మేజిస్ట్రేటు కోర్టుకు హాజరుకమ్మని సమన్ పంపిచారు. అప్పటి మేజిస్ట్రేటు హెజ్మడే అను ఐ సి యస్ అధికారి. శివరావు గారు జైలు కెళ్లటానికి సంసిధ్ధమౌతుండగా బెజవాడలో నున్న ప్లీడర్లు చాలమంది సిడాంబి రాజగోపాలచారి (పెద్ద ప్లీడరు) గారితో సహా కలసి వారింటికుచ్చి ఆకేసును కంటెస్టు చెయమని తను కనుక జైలు కెళ్లిపోతే మిగతా ప్లీడర్లమీద కూడా అలాంటి కెసులు వస్తాయని (బార్ యసోసియేషన్ వారు సత్యాగ్రహాన్ని సమర్ధిస్తూ రిజొల్యూషన్ చేసినందుకు) పట్టుబట్టగా శివరావుగారు కోర్టులో హాజరై తనమీద అట్లాంటి రాజద్రోహం కేసులో గవర్మరు ఇన్ కౌన్సిల్ వారి ఆమోదం కావలసియుండును. అటువంటి ఆమోదం లేకుండా ఈ కేసు దాఖలు చేయటం చట్ట విరుధ్ధ మని కంటెస్టు చేస్తూ పెటిషన్ పెట్టారు. ఆమరుసటి రోజునే ( 26-08-1930) తేదీన శివరావు గారి తృతీయ కుమార్తె జననం అవటం అందుకామెకు జయలక్ష్మి అని పేరు పెట్టంటం జరిగింది. పోలీసు వారు శివరావుగారి న్యాయవాది పట్టా రద్దు చేయటానికి హైకొర్టుకి వ్రాసినట్లుగా పోలీసు వారు మాజిస్ట్రేటుతో జిరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు కోర్టులో దాఖలు చేసినదానిని బట్టి తెలిసింది.<ref>స్వకీయవిలేఖరి ఆంధ్రపత్రిక సెప్టెంబరు 1930</ref> శివరావుగారి పెటిషన్ విచారణలో సర్కిల్ ఇన్ స్పెక్టరు స్వామి కోర్టులో శివరావుగారి రచనలు ప్రభుత్వద్వేషముకలుగజేసి సహాయనిరకణ పెంపోందిచేలాంటివి అనిన్నూ, శివరావుగారు తన న్యాయసలహాలతో అప్పటిదాక అరెస్తు చేయబడ్డ చాలమంది స్వతంత్ర సమరయోధుల తరఫును అమికస్ క్యూరిగా కోర్టువారి అనుమతితోనే పనిచేస్తున్నారన్నీనూ పోలీసు వారు ఎప్పుడు కాంగ్రెస్సు కార్యాలయానికి వెళ్లునా శివరావు గారు అక్కడ పుండటం జరుగుతున్నదన్నీనూ సర్కిల్ ఇన్ స్పెక్టరు గారు కోర్టులో తన వాగ్మూలంలో పేర్కొన్నాడు. ఆకేసులో సాక్ష్యంకోసం [[వెల్లూరు]] జైలులో నున్న నల్లూరి పాపయ్యచౌదరీ, వేలూరి యజ్ఞన్నారాయణశాస్త్రి గార్లను వెల్లూరు సెంట్రల్ జైలునుండి పోలీసు యస్కార్టుతో బోళెడుడబ్బు ఖర్చుచేసి 16-10-1930 తారీఖు వాయిదాకు తీసుకుచ్చారు. ఆ కేసు విచారణలో సర్కిల్ ఇన్ స్పెక్టరు సమక్షంలో ఆంధ్ర గ్రంథాలయ ముద్రణాలయానికి చెందిన కర్లపాలెం కోదండరామయ్య గారి వాగ్మూలం, మరి యు అనేక మంది స్వతంత్రసమరయోధలును సాక్షులుగా తీసుకువచ్చారు. వారిలో ఉప్పలూరి లక్ష్మీనరసిహారావు, సి వి కృష్ణయ్య నాయడు విజయరాఘవులు నాయడు భైరవ స్వామి స్పెషల్ డ్యూటి సబ్ ఇన్ స్పెక్టరు సూర్యదేవర రామచంద్రరావు, మంచాల వెంకట సుబ్బారావు మొదలగు వార్లను సాక్షులుగా పేర్కొన్మారు ఆ వాయిదా తేదీ నాడు శివరావుగారి పెట్టిన పెటిన్ ను ఆమోదించతూ మేజిస్ట్రేటు హెజ్మాడె గారు పోలీసువారి కేసు కొట్టివేయటం (quashed) జరిగింది. పోలీసు వారికి పరాభవం ఉక్కురోషం కలిగి వెల్లూరు నుండి తీసుకుచ్చిన సాక్షులను మరల తిరుగు ప్రయణంలో వెనక్కు తీసుకుని వెళ్లారు. పోలీసు వారు వెంటనే [[గవర్నరు]] ఇన్ కౌంసిల్ ఆమోదం కోసం సన్నాహాలు ప్రారంభించి రెండో సారి మళ్లీ ఇంకో కేసు దాఖలు చేశారు.
 
==మళ్లీ రెండో రాజద్రోహం కేసు==
2,16,436

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2042829" నుండి వెలికితీశారు