దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 132:
==మళ్లీ రెండో రాజద్రోహం కేసు==
 
1931 లో బెజవాడ పోలీసు వారు మద్రాసు లోనున్న అడ్వకేట్ జనరల్ ద్వారా కూడా వెళ్ల కుండా తిన్నగా గవర్నరు ఇన్ కౌన్సిల్ వద్దకే వెళ్లి శివరావుగారి మీద కేసు పెట్టుటకు అనుమతి తీసుకుని బెజవాడ సర్కిల్ ఇన్ స్పెక్టర్ 15/01/1931 తారీఖున రెండవసారి శివరావుగారి మీద సెక్షన్ 108 సి ఆర్ పి సి క్రింద జాయింట్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు MC 8/31 ను దాఖలు చేశారు. ఈ కేసు 09-01-1931 నాడు విచారణ మొదలైంది. కాని 30-01-1931 నాడు గాంధీ గారీతో సంధికుచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం [[సంధి]] పత్రం [[గాంధీ-ఇర్విన్ సంధి]] (Gandhi-Irwin Pact) మీద 05-03-1931 నాడు సంతకాలైనవి. ఆ సంధి వప్పందాల ప్రకారం రాజద్రోహం కేసులన్నీ విరమించుకోవాలి. అందు కని దేశం అంతటా అలాంటి రాజద్రోహం కేసులవిచారణలు వాయిదాలు పడ్డం మొదలై చివరకు ఉపసంహరింప బడ్డాయి. ఇక్కడ బెజవాడలో కూడా శివరావుగారి మీద కేసు విచారణ వాయిదాలు వేయటం మొదలైంది . శివరావుగారి పై కేసు MC 8/31ను ఉపసంహరించుకున్నట్లుగా ప్రభుత్వ జి ఒ (GO No.374 M.S) తారీకు 15/03/1931 న విడదలచేశారు తత్ఫలితముగా ఆకేసును 30-04-1931 తారీకునాడు కోర్టులో ఉపసంహరింపబడింది. అప్పటి జాయింట్ మేజిస్ట్రేటు టి శివశంకర్ అయ్యర్ శివరావుగారిని కేసునుండి అధికారరూపంగా ముక్తి (discharged from the case) చేశారు.
 
==మళ్ళీ రెండోసారి సోదా==