చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''చల్లా సత్యవాణి''' [[తెలుగు]] రచయిత్రి. ఆమె [[కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల]] అధ్యాపకురాలిగా, ఎన్.సి.సి మేడంగా సేవలిందించి, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా చేసి, డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఆధ్యాత్మికంగా తాను అనుభూతి పొందుతూ, పదిమందికీ ఆ అనుభూతిని అందించడానికి, పుస్తక రూపంకల్పించి, ఆధ్యాత్మికసంపద వితరణచేస్తున్నారు.
==పరిచయం==
[[కౌండిన్యులు|కౌండిన్యస]] గోత్రికులు శ్రీమతి చల్లా అచ్యుత రామలక్ష్మి, శ్రీ వీరావధానులు పుణ్యదంపతులకు [[1942]] ఏప్రియల్4న అంటే చిత్రభాను సంవత్సర చైత్ర బహుళ తదియ శనివారం రాజోలు తాలూకా మలికిపురం మండలం మోరి గ్రామంలో డాక్టర్ చల్లా సత్యవాణి జన్మించారు.1942మే నెలనుంచి ఈమె [[దానవాయిపేట]] ఇంటినెంబర్ 46-18-11లోనే నివసిస్తున్నారు.ఈ ఇంటిపేరే ప్రణవకుటి.డాక్టర్ (మేజర్) సత్యవాణి ఎం.ఏ (హిందీ) సాహిత్యరత్న, ఎం.ఏ (రాజనీతి శాస్త్రం, ఎం.ఏ (ఫిలాసఫీ, ఎం.ఇడి, ఎం.ఫిల్, పిహెచ్.డి.పూర్తిచేశారు.శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో లెక్షరర్ గా పనిచేసిన ఈమె ఎన్.సి.సి ఆఫీసరుగా, ఎన్ఎ.స్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా సేవలందించారు.ఎంతోమంది విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చారు.పదవీ విరమణచేసాక, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టి, కళాశాల అభివృద్ధికి బాటలువేశారు.ప్రస్తుతం డైరక్టర్ గా కొనసాగుతున్నారు.
==ఆధ్యాత్మిక సంపదను పంచుతూ==
ఓ పుస్తకం వేయడమే చాలా కష్టం. అలాంటిది అంత్యంత నాణ్యతతో, అరుదైన ఫోటోలు సేకరించి మరీ, పుస్తకాలమీద పుస్తకాలు వేయడం ఆషామాషీ కాదు. పైగా ఎవరి సాయం లేకుండా తన సొంత ధనం వెచ్చించి, ఆధ్యాత్మిక సంపదగా మలచి, పదుగురికే పంచడం ఆమెకే చెల్లింది. ఈవిధంగా తాను పొందుతున్న పుణ్యాన్ని పదిమందికీ పంచుతున్నారని ప్రశంసించని వారు లేరు.గడిచిన 16 ఏళ్లుగా ఈ యజ్ఞం కొనసాగిస్తున్నారు.దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడ ఆలయాలను దర్శించి, వాటి విశిష్టత అవగతం చేసుకుంటారు. ఇక అక్కడకు ఎలావెళ్ళాలి వంటి విషయాలంటిని పొందుపరుస్తూ, వ్యాసాలను పత్రికలకు అందించడమేకాదు, మళ్ళీ వాటన్నింటినీ క్రోడీకరించి, పుస్తక రూపంతెచ్చి, ఉచితంగా పంచిపెట్టడం ఈమె సహజ లక్షణం. ఈవిధంగా ఇప్పటివరకూ ఈమె 25పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు.
"https://te.wikipedia.org/wiki/చల్లా_సత్యవాణి" నుండి వెలికితీశారు