న్యాపతి సుబ్బారావు పంతులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గంకు → గానికి , పని చేస్తూ → పనిచేస్తూ (2), స్వాతంత్ర → స using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
ఆంధ్రభీష్మగా పేరొందిన '''న్యాపతి సుబ్బారావు పంతులు''' ([[జనవరి 14]], [[1856]] - [[జనవరి 15]], [[1941]]) స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, [[పాత్రికేయుడు]] మరియు రాజకీయ నాయకునిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశీలి.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
సుబ్బారావు [[1856]]వ సంవత్సరం [[జనవరి 14]] వ తేదీ [[మకర సంక్రాంతి]] రోజున [[నెల్లూరు]]లో రాఘవరావు, రంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆ తరువాత కుటుంబం [[రాజమండ్రి]]కి మారింది.<ref name=hindu1>[http://beta.thehindu.com/arts/history-and-culture/article79713.ece Subba Rao Pantulu remembered] - The Hindu January 12, 2010</ref> బాల్యం నుండే సుబ్బరావు విషయ పరిజ్ఞాన సముపార్జన పట్ల అమిత జిజ్ఞాస కలిగి ఉండి [[పేదరికం]] కారణంగా వీధిలాంతర్ల మసక వెలుతులో చదువు కొనసాగించాడు. మెట్రిక్యులేషన్‌ పాస్‌ అయ్యి అనంతరం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరి స్కాలర్‌షిప్‌ సహాయంతో చదువుకుని 1876లో బిఎ డిగ్రీ పొందాడు. అనంతరం అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. బోధనా వృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి 1879లో లా పట్టాను పొందాడు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ న్యాయవాద పట్టాను పొందటం అప్పట్లో అరుదైన విషయం. ఈ ఖ్యాతిని సాధించిన దక్షిణ భారతదేశంలోని అతి కొద్దిమందిలో ఒకరిగా [[కోస్తా]] జిల్లాల్లో తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.
 
న్యాయవిద్యార్థిగా ఉండగానే 22 ఏళ్ళ ప్రాయంలో ఆయన ట్రిప్లికేన్‌ సిక్స్‌గా పిలువబడే నాటి సాహిత్య సంఘం సభ్యులు మరో ఐదుగురు సభ్యుల మిత్ర బృందంతో కలసి, జాతీయోద్యమానికి సహకరించే ఉదాత్త లక్ష్యంతో, [[ది హిందూ]] జాతీయ ఆంగ్ల దినపత్రికను స్థాపించాడు. అప్పట్లో భారతదేశంలో ప్రచుతరిమయ్యే ఆంగ్ల పత్రికలన్నీ బ్రిటీష్‌ ప్రభుత్వం కనుసన్నలలోనే ఉండేవి.
 
==రాజమండ్రిలో==
[[File:Nyapathi subbarao panthulu.jpg|thumb|రాజమండ్రిలోని[[రాజమండ్రి]]లోని స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో న్యాపతి సుబ్బారావు పంతులు విగ్రహం]]
ఉమ్మడి మద్రాసు రాష్టంలో సుబ్బారావు గౌరవ న్యాయమూర్తిగాను, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశాడు. 1880లో న్యాపతి సుబ్బారావు [[మద్రాసు]] నుంచి రాజమండ్రి తిరిగివచ్చి అక్కడే స్థిరపడ్డాడు. మరో 9 మంది న్యాయవాదులతో కలిసి రాజమండ్రి బార్ అసోషియేషన్ స్థాపించాడు. రాజమండ్రిలో సంఘసంస్కర్త [[కందుకూరి వీరేశలింగం]]తో సన్నిహితంగా మెలగేవాడు. వితంతు పునర్వివాహాలు జరిపించడంలో వీరేశలింగానికి సుబ్బారావు పంతులు ఎంతగానో సహకరించాడు. 1881లో స్థాపితమైన [[హితకారిణి సమాజం]] యొక్క మొదటి కార్యదర్శిగా నియమించబడి నిర్వహణలో, కార్యకలాపాల విస్తరణలో విలువైన సేవలందించాడు.
 
1885లో రాజమండ్రి పురపాలకసంఘానికి తొలి అనధికార ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. 1888 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలోనే రాజమండ్రి ప్రజలకు తొలిసారి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశారు. 1893లో ఆయన మద్రాసు ఇంపీరియల్‌ లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌కు సభ్యునిగా ఎన్నికై సర్కారు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ పదవిలో ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికై 1899 వరకు కొనసాగాడు. 1896లో ఆయన రాజమండ్రిలోని టౌన్‌ హాల్‌ ట్రస్టుబోర్డు కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కలకత్తాలోని టౌన్‌ హాలు తర్వాత దేశంలో అంతటి ప్రాముఖ్యత రాజమండ్రి టౌన్‌ హాల్‌కు ఉంది. దీనిని కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించటం వెనుక న్యాపతి వారి సహకారం ఎంతో ఉంది.