దోమా వేంకటస్వామిగుప్త: కూర్పుల మధ్య తేడాలు

48 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''దోమా వేంకటస్వామిగుప్త''' దోమా కోటాంబ, దోమా గోవిందప్ప శ్రేష్ఠి దంపతులకు [[కర్నూలు]] పట్టణంలో జన్మించాడు. సంస్కృత ఆంధ్ర భాషలలో పట్టు సంపాదించాడు. స్కూలు ఫైనల్ [[ఇంగ్లీషు]] మీడియంలో చదివాడు. [[అష్టావధానాలు]], [[శతావధానాలు]] చాలా చేశాడు. ఆశుకవిత్వం చెప్పాడు. అనేక చోట్ల ఇతడు సన్మానాలు పొందాడు. ఇతడు హరికథారచయిత, [[కవి]], నాటక కర్త, విమర్శకుడు, శతకకర్త మరియు నవలారచయిత. '''చంద్రిక''' అనే పత్రికకు సంపాదకుడు.
 
==కవితా వ్యాసంగం==
పంక్తి 64:
 
==రచనలు==
# '''శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణము''': ఈ గ్రంథాన్ని 1929లో వ్రాయడం మొదలుపెట్టి 18 సంవత్సరాలు ఎంతో శ్రమకోర్చి సంస్కృతం నుండి తెలుగులోనికి [[అనువాదం]] చేశాడు. 1947లో ప్రచురింపబడింది. దీనిలో గణేశ ఖండము, ప్రకృతి ఖండము, శ్రీకృష్ణ జన్మఖండము మొదలైన ప్రకరణలతో 14వేల పద్యాలు ఉన్నాయి.
# '''శ్రీ పరకాల విలాసము''' : వెయ్యి పద్యాలతో కూడిన గ్రంథము. తిరుమంగై అళ్వారు [[చరిత్ర]].
# '''ప్రేమాభిరామము''' : 600 పద్యాలు కలిగిన శృంగార ప్రబంధం.
# '''శ్రీ కన్యకాపురాణము''': 18 సంవత్సరాలకు పైగా శ్రమించి అనేక గ్రంథాలను పరిశోధించి వ్రాసిన పద్యకావ్యము. 15వందల పద్యాలున్నాయి.
# '''అవధాన కవితామంజరి''' : అవధానాలలో చెప్పిన పద్యాలు.
# '''శ్రీ గోమాతృ గౌరవము''': గోమాత గురించి వ్రాసిన 400 పద్యాలతో కూడిన [[కావ్యము]].
# '''శ్రీ చంద్రకళా సుదర్శనము''' : దేవీభాగవతములోని ఒక కథ ఆధారంగా వ్రాసిన [[నాటకము]]
# '''దూతాంగదము''' : నాటకము. సంస్కృత నాటకానికి అనువాదము.
# '''శ్రీకృష్ణదేవరాయల చరిత్రము''' (విమర్శ)
# '''ఝంఝామారుతము''' (విమర్శ)
# '''విమలానందము''' ([[నవల]])
# '''చంద్రిక''' (నవల)
# '''సీతాకళ్యాణము ''' ([[హరికథ]])
# '''శ్రీ కన్యకాపురాణము''' (హరికథ)
# '''శ్రీ సాయిబాబా చరిత్ర''' (హరికథ)
పంక్తి 112:
2-5-1949 వ సంవత్సరంలో విజయవాడలో ఎందరో పెద్దల సమక్షంలో జరిగిన గజారోహణం, సన్మానపత్రం, కనక స్నానం, గండ పెండేరం, సువర్ణ పాత్ర, వెయ్యిన్నూటపదహార్ల నగదులతో జరిగిన అత్భుత సత్కార కార్యక్రమం ఇతని జీవితంలో మరపు రాని మధురమైన సువర్ణ ఘట్టం.
==మరణం ==
దోమా వేంకటస్వామిగుప్త [[1962]]వ సంవత్సరంలో [[ఫిబ్రవరి 13]]వ తేదిన [[గుంటూరు]] పట్టణంలో మరణించాడు.
 
==మూలాలు==
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2044155" నుండి వెలికితీశారు