తిక్కన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
తిక్కన శిష్యుడు [[మారన]]. ఇతడు రాసిన [[మార్కండేయ పురాణం]] ప్రతాపరుద్ర దేవుని మంత్రులలో ఒకడైన నాగయగన్న మంత్రికంకితం చేసెను. [[మార్కండేయ పురాణం]]నందు మారన ''శ్రీమధుభయ కవిమిత్ర తిక్కన సోమయాజి ప్రసాద లబ్ద సరస్వతీ పాత్ర తిక్కనామాత్యుపుత్ర.'' అని రాసుకొనుటచే మారన తిక్కన శిస్యుడని తెలుస్తుంది. మారన తండ్రి తిక్కన కాకుండా వేరొక తిక్కన అయియున్నాడు. మన్మురాజును తిక్కనసోమయాజును కాకతీయ ప్రభువైన [[గణపతి]] దేవుని కాలమున ఉన్నట్లు నిశ్చయము. తిక్కన గణపతిదేవుని దగ్గరికి పోయేటప్పటికి తిక్కనసోమయాజి [[యజ్ఞము]] చేయలేదు. భారతముని కూడా రచించలేదు.
 
తిక్కన సోమయాజి పెదతండ్రి కుమారుడు అయిన సహొదరుడు ఖడ్గతిక్కన. తిక్కన కుమారుడు కొమ్మన. తిక్కన మనుమరాలి భర్త యల్లాడమంత్రి. ఈ యల్లాడమంత్రి మనుమడు కవి సింగన్న. ఈ సింగన్న తండ్రి అయ్యలమంత్రి. తిక్కనసొమయాజి తాత మంత్రి భాస్కరుడు. తిక్కన కవి గౌతమిగోత్రుడు. తంద్రి
కొమ్మన. తల్లి అన్నమ్మ. [[కేతన]], మల్లన, [[పెద్దన]] ఇతని పెదతండ్రులు.
 
ఈ తిక్కన నియోగిబ్రాహ్మణుడు. ఈయన పూర్వుల నివాసిస్థలము మొట్టమొదట కృష్ణామండలంలోని [[వెల్లటూరు]] గ్రామము. ఉద్యొగరీత్య ఇతని తాతకాలమున [[గుంటూరు]]నకు వచ్చారు. తరువాత నెల్లూరి రాజగు మనుమసిద్ది ఇతని కుటుంబమును ఆదరించి నెల్లూరికి తీసుకొనివచ్చి పూర్వము హరిహర దేవాలయము ఉండిన ఇప్పటి రంగనాయకస్వామి ఆలయ సమీపమున గృహము కట్టించి ఇచ్చి తిక్కనసోమయాజులను అందుంచాడు. కేతన రాసిన దశకుమార చరిత్రనుబట్టి చూడగా తిక్కన ఇంటి పేరు కొత్తరువుయరయినట్టు తెలియవచ్చునది. తిక్కనకి అంకితము చేయబడిన దశకుమారచరిత్రము అను గ్రంథమునందు తిక్కన వంశావళి సమగ్రముగా వర్ణించబడింది.
 
తిక్కన తను రచించిన [[నిర్వచనోత్తర రామాయణము]] నందు
పంక్తి 23:
</poem>
 
అని తన కావ్యము స్వగుణముచేత కాకపోయిననూ తన [[తాత]] అయిన మంత్రిభాస్కరుని సారకవిత్వమహిమచేత అయిననూ లోకాదరనమునకు పాత్రయగునని చెప్పియున్నాడు. సూర్యవంశపు రాజైన మనుమసిద్ది ఆస్థానకవిగా తిక్కన ఉండడమే కాదు అతనితో సమానుడిగా గౌరవముపొందేవాడు[[గౌరవము]] పొందేవాడు. రాజునకు, కవికి మామవరుస ఉంది. తిక్కన [[నిర్వచనోత్తర రామాయణము]]ని మనుమసిద్దికి [[అంకితం]] చేసెను. దీనితో మనుమసిద్ది
<poem>
<big>ఏనిన్ను మామ యనియెడ</big>
పంక్తి 33:
నిన్ను మామా అని పిలుచునందుకైనా భారతముని నాకు అంకితం ఇమ్మని అడిగినట్లు చెప్పబడియున్నది.
 
తిక్కన నన్నాయని ఆదికవిగా చెప్పలేదు. భారతమున మొదట ముడుపర్వాలుని రాసేనని చెప్పాడు.
 
తిక్కన కావ్యములు రెండు.1. [[నిర్వచనోత్తర రామాయణం]]. దీనినంతటిని పద్యములుగానే రచించెను. ఇది బాల్యమునందు రచించబడింది. ఇందలికథ సంస్కృతంలో ఉన్నంటలేక మిక్కిలి సంగ్రహపరచబడింది. పలుచోట్ల శైలి నారికేళపాకం అని చెప్పవచ్చును. అందుచేత ఈ గ్రంథం భారతమువలె సర్వత్ర వ్యాపిమ్పకున్నది. యితడు 10 ఆశ్వాసములు ఈ గ్రంథమున రచించినను పుస్తకమును మాత్రము ముగుమ్పలేదు. రామనిర్యాణకథను చెప్పుటకు భీతిల్లి దానిని వదిలిపెట్టినయెడల తిక్కన భారతమునందు స్త్రీపర్వకథయు క్రుష్ణనిర్యాణ మును చెప్పుటకేల భయపడలేదని ఒకరు ప్రశ్న వేయుచున్నారు. ప్రతీమరణకథకును భయపడి దానిని విడుచుచూ వచ్చినచో భారతమును రచింపకయే యుండవలెను. తిక్కన భారతముని మనుమసిద్దికి ఇచ్చినచో నరాంకితం అవుతుందని మనుమసిద్దికి ఇవ్వక శ్రీభద్రాదిరామునికి అంకితం చేసెను.
 
తిక్కన శైలి ఈ క్రింది రెండు పద్యములయందు పొందుపరచబడింది.
"https://te.wikipedia.org/wiki/తిక్కన" నుండి వెలికితీశారు