నందిని సిధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి చిత్రపటం
పంక్తి 41:
==జీవిత విశేషాలు==
 
[[మెదక్]] జిల్లా [[బందారం]] గ్రామంలో1955లో జన్మించాడు. నందిని సిధారెడ్డి తండ్రి బాలసిద్ధారెడ్డి రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు<ref>http://www.prabhanews.com/medak/article-268306</ref>. బందారం,వెల్కటూర్, సిద్ధిపేటలలో చదువు ముగించుకుని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేసి, 'ఆధునిక తెలుగుకవిత్వంలో [[సూర్యుడు]]' అనే అంశంపై ఎం.ఫిల్‌(1981) పట్టా ఆ తర్వాత 'ఆధునిక కవిత్వం, వాస్తవికత - అధివాస్తవికత' పై పరిశోధన చేసి పి.హెచ్.డి(1986) పట్టా పుచ్చుకున్నాడు. మెదక్‌లో కొంతకాలం పనిచేసి తరువాత సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీకళాశాలలో [[తెలుగు]] లెక్చరర్‌గా పనిచేసి 2012లో పదవీవిరమణ చేశాడు. విద్యార్థి దశనుండే కధలు,కవిత్వం వ్రాశాడు. నవసాహితి, మెదక్ స్టడీ సర్కిల్ అనే సంస్థలను నడిపాడు. గులాబి అనే చిన్నపత్రికను ప్రకటించాడు. మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి పలు సాహితీ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు 'మంజీర' బులెటిన్‌కు సంపాదకత్వం వహించి ఏడు కవితాసంకలనాలను వెలువరించాడు. సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణా రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
 
1997 ఆగస్టులో కేవలం ఒకేఒక గంట వ్యవధిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం-ఆవశ్యకతపై సిద్ధారెడ్డి రచించిన కవితే "నాగేటి చాల్లల్ల" కవితగా ప్రసిద్ధి చెందింది. ఈ కవితలో సిధారెడ్డి [[తెలంగాణ]] [[సంస్కృతి]] మొత్తాన్ని వివరించాడు. ఇదే కవితను "[[పోరు తెలంగాణ]]" సినిమాలో పాటగా తీసుకున్నారు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మలో[[బతుకమ్మ]]లో కందుకూరి రమేష్‌బాబు రచించిన వ్యాసం, తేది 16-03-2014</ref> [[అందెశ్రీ]] రచించిన [[జయజయహే తెలంగాణ]], [[గోరటి వెంకన్న]] రచించిన "గానమా తెలంగాణమా" కవితల కంటే ముందే సిధారెడ్డి తెలంగాణపై కవిత రచించాడు. ఈ కవితలో మొత్తం 10 చరణాలున్నాయి. ఈ కవిత బతుకమ్మ పాటగా తెలంగాణలో ఇంటింటా మారుమ్రోగిపోతోంది.<ref>http://telugu.oneindia.in/topic/%E0%B0%A4%E0%B1%86%E0%B0%82%E0%B0%B2%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%97%E0%B1%87%E0%B0%AF%E0%B0%82</ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/నందిని_సిధారెడ్డి" నుండి వెలికితీశారు