సప్తగిరి (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

పేరు మార్చుకుంది న్యూమరాలజీ ప్రకారం కాదు అతని ఇంటర్వ్యూ ప్రకారం
పంక్తి 23:
 
== కెరీర్ ==
=== తొలినాళ్ళు ==
ఇంటర్ అయిపోయిన తర్వాత హైదరాబాదుకు వెళ్ళి అవకాశాల కోసం ప్రయత్నించాలనుకున్నాడు. అక్కడ మల్టీమీడియా కోర్సు చేస్తానని ఇంట్లో చెప్పి హైదరాబాదుకు వచ్చాడు. తనకు అన్నయ్య వరసైన సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఉండేవాడు. మొదట్లో దర్శకత్వం వైపే ఆసక్తి ఉండేది కానీ నటనలో ఏమాత్రం ఆసక్తి లేదు. ఇంగ్లీషులో పరిజ్ఞానం పెంచుకుందామని ఎస్. ఆర్. నగర్ లోని ఓ శిక్షణా కేంద్రంలో చేరాడు. కానీ రెండు నెలలు గడిచాక అందులో పురోభివృద్ధి లేకపోవడంతో దానిని వదిలేశాడు. సహాయ దర్శకుడిగా అవకాశం కోసం స్టూడియోల చుట్టూ తిరిగే వాడు.
 
=== సహాయ దర్శకుడిగా ===
అన్నయ్య ఇంటికి దగ్గర్లోనే రమేష్ వర్మ అనే పబ్లిసిటీ డిజైనర్ ఉండేవాడు. అక్కడికి క్రమం తప్పకుండా వెళుతూ సినీ పరిశ్రమ వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నాడు. దర్శకుడు [[విరించి వర్మ]], సప్తగిరి కలిసి అవకాశాల కోసం ప్రయత్నించేవాళ్ళు. ముందుగా రమేష్ వర్మ తరుణ్ తో ఒక వూరిలో అనే సినిమా చేయాలనుకున్నాడు. ఆ సినిమా కోసం సప్తగిరి ని చెన్నైకి పంపించాడు. కానీ రెండేళ్ళు గడుస్తున్నా ఆ సినిమా ఆలస్యం అవుతుండటంతో అతనికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో రమేష్ వర్మ ఇతన్ని [[శేఖర్ సూరి]] దగ్గర చేరమన్నాడు. శేఖర్ సూరి దర్శకత్వం వహిస్తున్న [[ఎ ఫిల్మ్ బై అరవింద్]] కోసం సహాయ దర్శకుడిగా చేరమన్నాడు. ఈ సినిమాలో పనిచేయడం ద్వారా సప్తగిరి సినిమా యొక్క అన్ని విభాగాల గురించి తెలుసుకుంటూ సినీ ప్రముఖులతో మరిన్ని పరిచయాలు పెంచుకున్నాడు. అలాగే సినిమా పూర్తయ్యే సరికి ముగ్గురు సహాయ దర్శకులు మాత్రమే మిగలడంతో పని ఎక్కువ కావడంతో పాటు పరిజ్ఞానం కూడా లభించింది.
 
=== నటుడిగా ===
తరువాత భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన్వచ్చిన బొమ్మరిల్లు సినిమాకు సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఆ సినిమా నిర్మాత దిల్ రాజుకు సహాయ దర్శకుల చేత చిన్న చిన్న వేషాలు వేయించడం ఆనవాయితీ. దాంతో బొమ్మరిల్లు సినిమాలో చిన్న పాత్రలో మొదటి సారిగా తెరపై కనిపించాడు. తర్వాత భాస్కర్ దగ్గరే పరుగు సినిమాకు అసోసిసియేట్ డైరెక్టరుగా చేరాడు. బొమ్మరిల్లు సినిమాలో తన హావభావాల్ని పరిశీలించిన భాస్కర్ ఈ సినిమాలో కూడా ఓ పాత్ర రూపకల్పన చేశాడు. మొదట్లో నటించడం ఇష్టం లేకపోయినా అవకాశం పోగొట్టుకోకుండా ఉండటం కోసం నటన, దర్శకత్వం రెండు పనులూ చేశాడు. తర్వాత స్నేహితుడు ఆనంద్ రంగా తీసిన ఓయ్ సినిమాలో నటించాడు. నటనలో అవకాశాలు ఎక్కువగా రాసాగాయి. కందిరీగ, దరువు, నిప్పు, మంత్ర, గబ్బర్‌ సింగ్‌ లాంటి సినిమాల్లో నటించాడు. అదే సమయంలో దర్శకుడూ మారుతి తీసిన [[ఈ రోజుల్లో]] సినిమా అతి తక్కువ బడ్జెట్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమా సమయంలో సప్తగిరి, మారుతి కలిసి చాలా రోజులు పనిచేశారు. ఆ పరిచయంతో మారుతి తర్వాత తీస్తున్న ప్రేమ కథా చిత్రం లో అవకాశం కల్పించాడు. అందులో పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. దీని తర్వాత దృశ్యం, మనం, పవర్, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనా, మజ్ను తదితర చిత్రాల్లో నటించాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సప్తగిరి_(నటుడు)" నుండి వెలికితీశారు