సప్తగిరి (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
=== నటుడిగా ===
తరువాత భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాకు సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఆ సినిమా నిర్మాత దిల్ రాజుకు సహాయ దర్శకుల చేత చిన్న చిన్న వేషాలు వేయించడం ఆనవాయితీ. దాంతో బొమ్మరిల్లు సినిమాలో చిన్న పాత్రలో మొదటి సారిగా తెరపై కనిపించాడు. తర్వాత భాస్కర్ దగ్గరే పరుగు సినిమాకు అసోసిసియేట్ డైరెక్టరుగా చేరాడు. బొమ్మరిల్లు సినిమాలో తన హావభావాల్ని పరిశీలించిన భాస్కర్ ఈ సినిమాలో కూడా ఓ పాత్ర రూపకల్పన చేశాడు. మొదట్లో నటించడం ఇష్టం లేకపోయినా అవకాశం పోగొట్టుకోకుండా ఉండటం కోసం నటన, దర్శకత్వం రెండు పనులూ చేశాడు. తర్వాత స్నేహితుడు ఆనంద్ రంగా తీసిన ఓయ్ సినిమాలో నటించాడు. నటనలో అవకాశాలు ఎక్కువగా రాసాగాయి. కందిరీగ, దరువు, నిప్పు, మంత్ర, గబ్బర్‌ సింగ్‌ లాంటి సినిమాల్లో నటించాడు. అదే సమయంలో దర్శకుడూ మారుతి తీసిన [[ఈ రోజుల్లో]] సినిమా అతి తక్కువ బడ్జెట్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమా సమయంలో సప్తగిరి, మారుతి కలిసి చాలా రోజులు పనిచేశారు. ఆ పరిచయంతో మారుతి తర్వాత తీస్తున్న ప్రేమ కథా చిత్రం లో అవకాశం కల్పించాడు. అందులో పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. దీని తర్వాత దృశ్యం, మనం, పవర్, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనా, మజ్ను తదితర చిత్రాల్లో నటించాడు.
 
ఒక రోజు విమానంలో వస్తుండగా ఓ తమిళ సినిమా చూసి దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసుకుని అందులో కథానాయకుడిగా నటిస్తే బాగుంటుందని అనుకుని స్నేహితులను సంప్రదించాడు. అలాగే తను వైద్యం కోసం వెళుతున్న హోమియో వైద్యుడు డాక్టర్ రవి కిరణ్ ఆ సినిమాను నిర్మాతగా ఉండటానికి ముందుకు వచ్చాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ అనే పేరుతో డిసెంబరు 2016 లో ఈ సినిమా విడుదలైంది. ఇది సప్తగిరికి కథానాయకుడిగా మొదటి సినిమా.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సప్తగిరి_(నటుడు)" నుండి వెలికితీశారు