సప్తగిరి (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

లింకులు
పంక్తి 30:
 
=== నటుడిగా ===
తరువాత భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన [[బొమ్మరిల్లు (2006 సినిమా)|బొమ్మరిల్లు]] సినిమాకు సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఆ సినిమా నిర్మాత [[దిల్ రాజుకురాజు]]<nowiki/>కు సహాయ దర్శకుల చేత చిన్న చిన్న వేషాలు వేయించడం ఆనవాయితీ. దాంతో బొమ్మరిల్లు సినిమాలో చిన్న పాత్రలో మొదటి సారిగా తెరపై కనిపించాడు. తర్వాత భాస్కర్ దగ్గరే [[పరుగు (సినిమా)|పరుగు]] సినిమాకు అసోసిసియేట్ డైరెక్టరుగా చేరాడు. బొమ్మరిల్లు సినిమాలో తన హావభావాల్ని పరిశీలించిన భాస్కర్ ఈ సినిమాలో కూడా ఓ పాత్ర రూపకల్పన చేశాడు. మొదట్లో నటించడం ఇష్టం లేకపోయినా అవకాశం పోగొట్టుకోకుండా ఉండటం కోసం నటన, దర్శకత్వం రెండు పనులూ చేశాడు. తర్వాత స్నేహితుడు [[ఆనంద్ రంగా]] తీసిన [[ఓయ్!|ఓయ్]] సినిమాలో నటించాడు. నటనలో అవకాశాలు ఎక్కువగా రాసాగాయి. [[కందిరీగ (సినిమా)|కందిరీగ]], [[దరువు (సినిమా)|దరువు]], [[నిప్పు]], [[మంత్ర]], [[గబ్బర్ సింగ్|గబ్బర్‌ సింగ్‌]] లాంటి సినిమాల్లో నటించాడు. అదే సమయంలో దర్శకుడూదర్శకుడు [[దాసరి మారుతి|మారుతి]] తీసిన [[ఈ రోజుల్లో]] సినిమా అతి తక్కువ బడ్జెట్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమా సమయంలో సప్తగిరి, మారుతి కలిసి చాలా రోజులు పనిచేశారు. ఆ పరిచయంతో మారుతి తర్వాత తీస్తున్న ప్రేమ[[ప్రేమకథా కథా చిత్రంచిత్రమ్]] లో అవకాశం కల్పించాడు. అందులో పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. దీని తర్వాత [[దృశ్యం (సినిమా)|దృశ్యం]], [[మనం]], [[పవర్ (సినిమా)|పవర్]], [[ఎక్స్‌ప్రెస్ రాజా|ఎక్స్ ప్రెస్ రాజా]], [[సోగ్గాడే చిన్నినాయనా|సోగ్గాడే చిన్ని నాయనా]], [[మజ్ను]] తదితర చిత్రాల్లో నటించాడు.
 
ఒక రోజు విమానంలో వస్తుండగా ఓ తమిళ సినిమా చూసి దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసుకుని అందులో కథానాయకుడిగా నటిస్తే బాగుంటుందని అనుకుని స్నేహితులను సంప్రదించాడు. అలాగే తను వైద్యం కోసం వెళుతున్న హోమియో వైద్యుడు డాక్టర్ రవి కిరణ్ ఆ సినిమాను నిర్మాతగా ఉండటానికి ముందుకు వచ్చాడు. [[సప్తగిరి ఎక్స్ ప్రెస్ (సినిమా)|సప్తగిరి ఎక్స్ ప్రెస్]] అనే పేరుతో డిసెంబరు 2016 లో ఈ సినిమా విడుదలైంది. ఇది సప్తగిరికి కథానాయకుడిగా మొదటి సినిమా.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సప్తగిరి_(నటుడు)" నుండి వెలికితీశారు