బి.నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
==జీవిత విశేషాలు==
ఈయన [[డిసెంబర్ 2]], [[1912]]న [[కడప జిల్లా]] [[‌పొట్టింపాడు]] గ్రామంలోని ఒక [[రైతు]] కుటుంబంలో జన్మించాడు. ఆ పల్లెటూరి వీధిబడిలో [[రామాయణం|రామాయణ]] [[మహాభారతం|మహాభారతాలు]], [[భాగవతము|భాగవతం]]లాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో [[ఉపాధ్యాయుడు]] పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పది, పన్నెండేళ్ళు వచ్చేనాటికే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోగలిగాడు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.
 
ఆ తర్వాత ఆయన [[మద్రాసు]] (ఈనాటి [[చెన్నై]]) నగరాన్ని చేరుకుని కొన్నేళ్ళపాటు పాఠశాల విద్య అభ్యసించాడు. పాఠశాల విద్య పూర్తి కాకుండానే ఆయన తన కుటుంబం నడుపుతున్న ఎగుమతి వ్యాపార బాధ్యతలు చేపట్టవలసివచ్చింది.
 
యువకుడుగా ఆయన స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. [[ఖాదీ]] ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ వ్యాపార నిమిత్తం [[బర్మా]] వెళ్ళవలసి వచ్చింది. అయితే రెండవ ప్రపంచయుద్ధసమయంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. ఆయన మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభించవలసివచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించాడు. క్రమంగా ప్రచురణారంగప్రవేశానికి అదే దోహదం చేసింది. ఆంధ్రజ్యోతి అనే సామాజిక-రాజకీయ పత్రికను ప్రారంభించాడు.
 
అప్పుడే [[చక్రపాణి]] సాహచర్యం లభించింది. ఇద్దరూ కలిసి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకురావాలనుకున్నారు. దేశం స్వాతంత్ర్యం పొందడానికి ఒక నెల ముందుగా [[చందమామ]] ఆవిర్భావం జరిగి దినదినప్రవర్ధమానం కాసాగింది. ఆ తర్వాత ఆయన సినిమా నిర్మాణరంగప్రవేశం చేశాడు.
"https://te.wikipedia.org/wiki/బి.నాగిరెడ్డి" నుండి వెలికితీశారు