బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
తర్వాత శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్. రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు.ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా 'వందేమాతరం' షూటింగు కోసం [[హంపి]] వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే ఉన్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, [[బుచ్చిబాబు]] వ్రాసిన ఒక కథ(ఎల్లోరాలో ఏకాంత సేవ) కలిపి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారి చేత మాటలు, పాటలు వ్రాయించారు. అదే "[[మల్లీశ్వరి]]"(1951). కృష్ణశాస్త్రికి అదే తొలి సినిమా.
 
ఇక్కడో విషయం చెప్పుకోవాలి: [[శంకరాభరణం]] తీస్తున్నప్పుడు అది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన సినిమా కాబట్టి అందులోని [[పాటలు]] ప్రముఖ సంగీత విద్వాంసుడైన [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ|బాలమురళికృష్ణ]] చేత పాడించాలనుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే అంతటి మహా విద్వాంసుడి చేత తమకు కావలసిన రీతిలో పాడించుకునే చనువు, స్వేచ్ఛ, [[ధైర్యం]] ఎంతవరకు ప్రదర్శించగలమోననే సందేహంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. అయితే సాహితీరంగంలో ఉద్ధండులైన కృష్ణశాస్త్రి, [[పాలగుమ్మి పద్మరాజు]](పా.ప.) లను చిత్రసీమలోనికి తీసుకువచ్చింది బి.ఎన్.రెడ్డే. కృష్ణశాస్త్రి తొలి సినిమా మల్లీశ్వరి కాగా పా.ప. తొలి సినిమా [[బంగారుపాప]]. అలా సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్ఠులైనవాళ్ళను సినీరంగంలో ప్రవేశపెట్టి తెలుగు సినిమా గౌరవప్రతిష్ఠలను పెంచడమే గాక అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా బావుటాను సగర్వంగా రెపరెపలాడించిన స్రష్ట బి.ఎన్.
 
తెలుగు చలనచిత్ర చరిత్రలో సాటిలేని మేటి కళాఖండంగానూ, అపురూప దృశ్యకావ్యంగానూ మల్లీశ్వరి ఖ్యాతిగాంచింది. ఆ సినిమా ఎన్నిదేశాలు తిరిగిందో లెక్క లేదు. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన [[చైనా]]లోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్. నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి "మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాతృలం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం." అన్నాడు.