ఆపిల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
==ఔషదోపయోగాలు==
 
విరేచనాలు, అతిసారం: యాపిల్ గుజ్జులో ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ పదార్థం ద్రవ రూప మలాన్ని గట్టిపడేలా చేస్తుంది. అందుకే దీనిని [[అతిసారం]] వంటి సమస్యల్లో వాడవచ్చు. పచ్చి యాపిల్‌పైన తోలు తొలగించి కండ భాగాన్ని తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.
 
*కొలెస్టరాల్ ఆధిక్యత: ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలను, కొలెస్టరాల్ వంటివి ఇతర కొవ్వు సంబంధిత పదార్థాలను శరీరం గ్రహిస్తుంటుంది. అయితే, యాపిల్స్‌ని తీసుకుంటే, దానిలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ పదార్థం కొవ్వు పదార్థాల గ్రహింపును అడ్డుకుంటుంది. పెక్టిన్ ఒక జెల్ మాదిరి పదార్థంగా తయారై అమాశయం గోడల మీద, చిన్న పేగు గోడలమీద పేరుకుపోయి కొవ్వు విలీనాన్ని అడ్డుకుంటుంది.
*క్యాన్సర్లు: రోజువారీగా యాపిల్స్‌ని వాడే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ల ఉనికి తక్కువగా ఉంటుంది. యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ జీవక్రియకు[[జీవక్రియ]]కు లోనైనప్పుడు బ్యుటైరేట్ అనే జీవి రసాయనం విడుదలవుతుంది. ఇది మలాశయం గోడల మీద రక్షణగా పనిచేసి క్యాన్సర్‌నుంచి మన శరీరాలను కాపాడుతుంది. యాపిల్‌ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని కార్నెల్‌ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చిలో తేలింది. 'ట్రిటర్‌పెనాయిడ్స్‌'గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్‌ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర. తొక్కులోనే కాదు... పండులోనూ అనేక రకాల క్యాన్సర్‌ నిరోధక ఫ్లేవనాయిడ్‌లూ ఫినోలిక్‌ ఆమ్లాలూ ఉంటాయి కాబట్టి తరచుగా యాపిల్‌ తినమని సూచిస్తున్నారు వారు.
*రక్తహీనత: యాపిల్స్‌లో ఇనుము, ఆర్శినిక్, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్తహీనతలో బాగా పనిచేస్తుంది. తాజాగా జ్యూస్ తీసి వాడితే ఫలితాలు బాగుంటాయి. రోజుకు కిలో చొప్పున తీసుకోగలిగితే మంచిది.
*మలబద్ధకం, విరేచనాలు: యాపిల్స్ మలబద్ధకంలోను, విరేచనాలు రెంటిలోను ఉపయోగపడతాయి. దోరగా ఉన్న యాపిల్స్ మలబద్ధకంలో ఉపయోగపడతాయి. రోజుకు కనీసం రెండు యాపిల్స్‌ను తీసుకుంటేగాని మలబద్ధకంలో ఫలితం కనిపించదు. విరేచనాలవుతున్నప్పుడు ఉడికించిన యాపిల్స్ గాని బేక్ చేసిన యాపిల్స్ గాని ఉపయోగపడతాయి. ఉడికించే ప్రక్రియవల్ల యాపిల్స్‌లో ఉండే సెల్యూరోజ్ మెత్తబడి మలం హెచ్చుమొత్తాల్లో తయారవుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఆపిల్" నుండి వెలికితీశారు