వేప: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
వేప త్వరత్వరగా పెరిగి, 15 నుంచి 20 మీటర్లు, కొన్ని సార్లు 35 నుంచి 40 మీటర్ల వరకు కూడా పెరగ గలిగే చెట్టు. ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే వేప తీవ్రమైన క్షామ పరిస్థితుల్లో మాత్రమే చాలవరకు ఆకులను రాల్చుతుంది. దీని కొమ్మలు బాగా విస్తరించి ఉంటాయి. దట్టంగా ఉండే దీని శీర్షం గుండ్రంగా లేదంటే కోడి గుడ్డు ఆకారంలో ఉండి బాగా స్వతంత్రంగా పెరిగిన చెట్లలో 15 నుంచి 20 మీటర్ల వ్యాసం వరకు ఉంటుంది.
 
మొత్తం మీద చూస్తే కాండము కురచగా నిటారుగ ఉండి, 1.2 మీటర్ల వ్యాసం వరకు పెరుగుతుంది. [[బెరడు]] గట్టిగా, పగుళ్ళతో లేక పొలుసులతో ఉండి, పాలిపోయిన బూడిదరంగు లేక ఎరుపుకలసిన ఊదా రంగులో ఉంటుంది. బెరడు వెనుకనుండే చెక్క (sapwood) బూడిదరంగు కలసిన తెలుపులోను ఉంటుంది. చెట్టుకు మధ్యన ఉన్న చెక్క (heartwood) గాలి తగలక ముందు ఎర్రగా ఉండి, క్రమేపి ఎరుపు కలసిన ఊదారంగులోకి మారుతుంది. వేరు వ్యవస్థలో బలమైన [[తల్లివేరు]], బాగా అభివృద్ధిచెందే మిగిలిన వేళ్ళూ ఉంటాయి.
 
20-40 సెం.మీ. పొడవైన రెమ్మలు, వాటికి అటు-ఇటు 20-31 ఒక మాదిరినుండి, ముదురు ఆకుపచ్చ రంగు గల 3-8 సెం.మీ. పొడవైన ఆకులు కలిగి ఉంటుంది. ఈ రెమ్మలలో చివరి ఆకు చాలా తక్కువగా ఉంటుంది. ఆకుల తొడిమెలు చిన్నవిగా ఉంటాయి. లేత ఆకులు ఎర్రాకుపచ్చ (ఎరుపు, ఊదారంగుల మధ్య) రంగులో ఉంటాయి. ముదురు ఆకుల అంచులు నొక్కులు, నొక్కులుగా ఉంటాయి. ఈ నొక్కులు ఆకు తొడిమె నుండి కొంత దూరం తరువాత మొదలవుతాయి. ఆకులు ఈనెకు అటు-ఇటు సమానంగా ఉండవు (asymmetric)
"https://te.wikipedia.org/wiki/వేప" నుండి వెలికితీశారు