వేప: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
==వేపతో ఉపయోగములు అనేకం==
 
వేప (లాటిన్ Azadirachta indica, syn. Melia azadirachta L., Antelaea azadirachta (L.) Adelb.) చెట్టు మహోగని కుటుంబానికి చెందినది. అజాడిరక్తకు చెందిన రెండు సంతతులలో ఒకటైన వేపకు పుట్టిళ్ళు సమ శీతోష్ణ దేశాలయిన బంగ్లాదేశ్, భారతదేశం, మ్యాన్ మార్, మరియు పాకిస్తాన్. ఇతరదేశాల్లోని పేర్ల విషయానికొస్తే వేపను అజాద్ డిరఖ్త (పర్షియ), డొగొన్ యార్లొ ([[నైజీరియా]]), మార్గోస, నీబ్ (అరబిక్), నిమ్ వృక్షము, నింబ (సంస్కృతము), వేపు, వెంపు, బేవు (కన్నడ), వెప్పం (తమిళము), ఆర్య వెప్పు (మలయాళము), భారత లైలాక్ అని పిలుస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో దీనినే మ్వారోబైని (కిస్వాహిలి) అంటారు. దీని అర్థం 'నలభై చెట్టు'. వేప నలభై వివిధ వ్యాధులను నయం చేస్తుందని చెప్తారు. స్వరూపము వేప త్వరత్వరగా పెరిగి, 15 నుంచి 20 మీటర్లు, కొన్ని సార్లు 35 నుంచి 40 మీటర్ల వరకు కూడా పెరగ గలిగే చెట్టు. ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే వేప తీవ్రమైన క్షామ పరిస్థితుల్లో మాత్రమే చాలవరకు ఆకులను రాల్చుతుంది. దీని కొమ్మలు బాగా విస్తరించి ఉంటాయి. దట్టంగా ఉండే దీని శీర్షం గుండ్రంగా లేదంటే కోడి గుడ్డు ఆకారంలో ఉండి బాగా స్వతంత్రంగా పెరిగిన చెట్లలో 15 నుంచి 20 మీటర్ల వ్యాసం వరకు ఉంటుంది. మొత్తం మీద చూస్తే కాండము కురచగా నిటారుగ ఉండి, 1.2 మీటర్ల వ్యాసం వరకు పెరుగుతుంది. బెరడు గట్టిగా, పగుళ్ళతో లేక పొలుసులతో ఉండి, పాలిపోయిన బూడిదరంగు లేక ఎరుపుకలసిన ఊదా రంగులో ఉంటుంది. బెరడు వెనుకనుండే చెక్క (sapwood) బూడిదరంగు కలసిన తెలుపులోను ఉంటుంది. చెట్టుకు మధ్యన ఉన్న చెక్క (heartwood) గాలి తగలక ముందు ఎర్రగా ఉండి, క్రమేపి ఎరుపు కలసిన ఊదారంగులోకి మారుతుంది. వేరు వ్యవస్థలో బలమైన తల్లివేరు, బాగా అభివృద్ధిచెందే మిగిలిన వేళ్ళూ ఉంటాయి. ఉపయోగాలు దాదాపు 200 ఏళ్లపాటు జీవించే చెట్టు వేప. వేప చెట్టులోని అన్ని భాగాలు వైద్యపరంగా ఎంతో ఉపయోగపడతాయి.
 
==సర్వరోగనివారిణి==
"https://te.wikipedia.org/wiki/వేప" నుండి వెలికితీశారు