ఆనంద శంకర్ జయంత్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==కేన్సర్ ను జయించి==
2008లో [[అమెరికా]] టూర్‌ ఫిక్సయింది. అంతకు ముందు రోజునుంచే రొమ్ములో ఏదో గడ్డలాగా అనిపించింది. ఎందుకైనా మంచిదని మెమోగ్రామ్‌ టెస్టు చేశారు. రిపోర్టు రాకముందే ఆవిడ అమెరికా వెళ్లారు. రెండు వారాల తర్వాత తిరుగు ప్రయాణం. రిసీవ్‌ చేసుకోవడానికి భర్త ముంబై ఎయిర్‌పోర్టుకి వచ్చారు. ఆయన వస్తారని ఆమె ఊహించలేదు. ఆమెను చూడగానే గట్టిగా హత్తుకొన్నారు. [[ఆరోగ్యం]] జాగ్రత్త అని మాత్రమే అన్నారు. క్యాన్సర్‌ అని చెప్పడానికి అతనికి ధైర్యం సరిపోలేదు. కానీ ఆనంద ఊహించగలిగారు. ఆమె ఆత్మస్థైర్యం ఏమాత్రం సడలలేదు. ఎందుకంటే ఆమె ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారు. కీమోథెరపీ, రేడియాలజీ కారణంగా శరీరం మెత్తబడి నడవడానికే కష్టమవుతుందని డాక్టర్లన్నారు. డ్యాన్స్‌ను కొంతకాలం పక్కనపెట్టక తప్పదని సూచించారు. కానీ ఆనంద వాళ్ల మాటలు పట్టించుకోలేదు. డ్యాన్స్‌ కోసం ఎందాకైనా వెళ్లాలనుకున్నారు. [[ప్రాణం]] ఆగినా ఫరవాలేదు కానీ పాదం ఆగొద్దనుకున్నారు. డ్యాన్స్‌ చేయకుండా నేను ఉండలేను అని కరాఖండిగా చెప్పేశారు ఆనంద. 2009, జులై 7న శస్త్రచికిత్స. ఆరోజు హాస్పిటల్‌కు వెళ్తున్నట్టు కాకుండా ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నట్లే భావించారు. పార్లర్‌కు వెళ్లి మానిక్యూర్‌, పెడిక్యూర్‌ చేయించుకున్నారు. ఆపరేషన్‌ థియేటర్‌ను ఆడిటోరియం ప్రాంగణంగా మనసులో అనుకున్నారు. సర్జరీ ముగిసింది. ఆపరేషన్‌ కాస్ట్యూమ్స్‌తో కాకుండా వెంట తెచ్చుకున్న డ్రెస్‌ వేసుకొని, నుదుటన బొట్టు, లిప్‌స్టిక్‌ పెట్టుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే 'పెర్ఫార్మెన్స్‌ ఎలా వుంది డాక్టర్‌' అని రివర్స్‌లో అడిగిన ఆమె ఆత్మస్థయిర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. సర్జరీ జరిగిన రెండురోజుల్లోనే కాలికి గజ్జె కట్టారు. ఈవెంట్లు ఆర్గనైజ్‌ చేయడం, పిల్లలకు నేర్పడం- పర్ఫార్మెన్స్‌కు సిద్ధమవడం ఇలా ఎప్పటిలాగే రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఆనంద దృష్టిలో క్యాన్సర్‌ అనేది జీవన్మరణ సమస్య కాదు. అదొక ఓ సాధారణ వ్యాధి. అదే విషయాన్ని ఆమె చెప్పాలనుకున్నారు. క్యాన్సర్‌ పై ఆనంద చేసిన టెడ్‌ (టెక్నాలజీ, ఎంటర్‌ టైన్‌ మెంట్‌, డిజైన్‌) టాక్‌ అత్యుత్తమ ప్రసంగంగా నిలవడం గమనార్హం. ఆ స్పీచ్‌ విన్న తర్వాత అందరూ ఆమెను క్యాన్సర్‌ బాధితురాలిగా కాకుండా ఓ మహమ్మారిని జయించిన వీరనారిగా గుర్తించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆనంద సాధారణ జీవితం గడుపుతున్నారు. రైల్వే అధికారిగా ఉద్యోగం చేస్తూనే ఇటు డాన్సర్‌గా సంగీత కళామతల్లికి నిత్య నృత్యాభిషేకం చేస్తున్నారు.<ref>[http://www.navatelangana.com/article/maanavi/316813 క్యాన్సర్‌ను జయించిన నాట్యశిఖరం]</ref>
 
==పురస్కారాలు==
నేటి సామాజిక సమస్యలకు పురాణాల్లోనే పరిష్కారం దొరుకుతుందని విశ్వసించే అనంద శంకర్ జయంత్ వరకట్నం, అత్యాచారాలు వంటి సామాజిక సమస్యలపై చైతన్యం తీసుకువచ్చేలా నృత్యరూపకాలను రూపొందించి దేశ విదేశాల్లో ప్రదర్శిస్తోంది. 2007లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. భరత నాట్యంలో సంగీత నాట్య అకాడమీ అవార్డుతో పాటు వివిధ రాష్ట్రాలు ఇచ్చే పురస్కారాలను సైతం ఆమె అందుకున్నారు. చెన్నైకి చెందిన ప్రముఖ కళా సంస్థ భారత్ కళాచార్ నుంచి 2016 సంవత్సరానికి గాను ప్రతిష్టాకరమైన ‘విశ్వకళా భారతి’ పురస్కారానికి ఎంపికయ్యారు. <ref name="sankar"/> లలితకళలను ప్రోత్సహించడంలో విశేష కృషి చేసిన వారికి చెన్నైకు చెందిన ప్రముఖ కళా సంస్థ భారత కళా సంస్థ భారత్ కళాచార్ ప్రతి ఏడాది అందించే 'విశ్వకళా భారతి' పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ నృత్యకారిణి ఆనంద శంకర్ జయంత్ ఎంపికయ్యారు.<ref>[http://vyoma.net/current-affairs/read/article/?article_id=325 ఆనంద శంకర్‍కు విశ్వకళా భారతి పురస్కారం]</ref>
"https://te.wikipedia.org/wiki/ఆనంద_శంకర్_జయంత్" నుండి వెలికితీశారు