ఒంటిమిట్ట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
[[File:View of Kodanda Ramaswamy Temple in Vontimitta.jpg|800px|thumb|center|ఒంటిమిట్ట కోదండరామాలయ సముదాయము]]
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, [[విశ్వామిత్రుడు]] వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు [[మృకండు మహర్షి]], శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.<ref name="eenadu" />
===మృకుందాశ్రమం===
ఏకశిలానగరానికి పడమరవైప్పున, ఒక కి.మీ.దూరంలో ఉన్న ఈ ఆశ్రమం, పూర్వం మృకుందమహర్షి చే నిర్మితమైనదని పురాణాల ఉవాచ. ఆయన ఈ ఆశ్రమంలో కొలువైన ముక్కంటిని నిత్యం ఆరాధించేవారని పూర్వీకుల కథనం. అందువలన ఈ గ్రామానికి ఆ పేరు వచ్చినది. ఈ ఆలయానికి సమీపములోని ఉన్న ఒక '''వంక '', దక్షిణం నుండి ఉత్తరంవైపు ప్రవహించుచూ ఉండటంతో, ఇందులోని జలధారను భక్తులు పవిత్రమైనదిగా భావించుచున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో ఫలాలు, ఔషధ మొక్కలూ అధికంగా అందుబాటులో ఉండేవి. యఙయాగాదులు, తపస్సుల నిర్వహణకు అనుకూలంగా ఉండటంతో, మునులు, మహర్షులు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు.
 
మృకుందాశ్రమానికీ, ఈ ముకుందాపురానికీ జైనమతంతో సంబంధం ఉన్నట్లు ఆనవాళ్ళు ఉన్నాయని చరిత్ర పరిశోధకులు శ్రీ కట్టా నరసింహులు తెలియజేసినారు. స్కంద పురాణంలో ఈ ఆశ్రమ ప్రస్తావన ఉన్నట్లు గూడా ఆయన వివరించినారు. ఇక్కడ పరమేశ్వరుని లింగం, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, భ్రమరాంబ, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, కాలభైరవుల విగ్రహాలు కొలువై ఉన్నవి. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. []
 
==మండలంలోని పంచాయితీలు==
"https://te.wikipedia.org/wiki/ఒంటిమిట్ట" నుండి వెలికితీశారు