లడ్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==తయారుచేయు విధానం==
*శనగ పిండి ఒక కళాయి గిన్నెలో గరిటె జారుగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలిసేటట్టుగా కలపాలి.
*శనగ పిండి
*చక్కెరలో ఒక లీటరు నీళ్ళుపోసి ఆ గిన్నెను పొయ్యిమీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ పాకాన్ని వేళ్ళతో పట్టుకొని చేస్తే కొంచెం తీగరావాలి. దీనిని లేతపాకం అంటారు.
*ఒక స్పూనులో పాలుపోసి, చిటికెడు మిఠాయిరంగు కలిపి, ఆ పాలు పాకంలో పోసి ఒక్కసారి తిప్పితే పాకానికి మిఠాయిరంగు వస్తుంది. తరువాత పాకం గిన్నెను దించి పక్కగా ఉంచుకోవాలి.
*నెయ్యి బూరెలమూకుడులో పోసి మరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ పండ్లు వేసి, వేయించి తీసి ఒక పక్కగా పెట్టుకోవాలి.
*శనగ పిండి ముద్దని ఒక కప్పుతోగాని, గరిటెతో గాని తీసుకొని సన్నని రంధ్రాలు గలిగి లోతుగా ఉన్న చట్రంలో పొయ్యాలి. దానినుండి చిన్న చిన్న బిందువులుగా పెనంలో పడతాయి. అలా పెనం నిండా పడిన తరవాత చట్రం ముద్దలో ఉంచాలి.
*బూందీ ఎరుపురంగుగా వేగకమునుపే, అనగా పసుపు పచ్చరంగులో ఉన్నప్పుడే మెరకగా ఉన్న రెండో చట్రంతో దేవి, పక్కనున్న పాకం గిన్నెలో వేయాలి; గరిటెతో కిందనుండి పైకి, పైనుండి కిందకి కలియబెట్టాలి.
*శనగపిండి ముద్ద ఎక్కువగా ఉంటే ఇదే పద్ధతిని మళ్ళీ మళ్ళీ చెయ్యాలి.
*బూందీ వెయ్యడం పూర్తయ్యాక వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ పండ్లు కూడా పాకంలో వెయ్యాలి.
*తరువాత ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం కలపాలి.
* చల్లారిన తర్వాత కావలసినంత పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. ఉండకడుతున్నప్పుడు విడిపోతున్నట్లు తోసిన, అరచేత్తో నొక్కినట్లయితే విడిపోవు. ఉండల్ని గాలి తగిలేటట్లుగా పదినిమిషాలు ఉంచాలి.
 
==చిట్కాలు==
 
[[వర్గం:వంటలు]]
"https://te.wikipedia.org/wiki/లడ్డు" నుండి వెలికితీశారు