తెలుగుగంగ ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
===అంతర్రాష్ట్ర వివాదాలు===
రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వానికి సహజంగానే వచ్చింది. మిగిలిన రాష్ట్రాలు దీనికి అభ్యంతరం తెలిపాయి. దీనికి ప్రధాన కారణం - [[బచావత్ ట్రిబ్యునల్]]లో శ్రీశైలం నుండి [[రాయలసీమ]]కు కృష్ణా జలాల కేటాయింపులు లేవు. [[శ్రీశైలం]] నుండి [[సాగునీరు]] వాడుకుంటే అది ట్రిబ్యునల్ కేటాయింపుల ఉల్లంఘనే అనేది ఎగువ రాష్ట్రాల వాదన. ఆంధ్ర ప్రదేశ్ వాదన ఇలా ఉంది. మూడు రాష్ట్రాల వాటా పోను [[కృష్ణా నదిలోనది]]లో ప్రవహించే అదనపు జలాలను వాడుకునే స్వేచ్ఛను ఆంధ్ర ప్రదేశ్ కు ట్రిబ్యునల్ ఇచ్చింది. కాబట్టి ఎగువ రాష్ట్రాలకు ఈ విషయంలో అభ్యంతరాలు ఉండనవసరం లేదు.
 
కర్ణాటక ప్రభుత్వం చేసిన మరో వాదన: "శ్రీశైలం నుండి సాగునీరు ఇవ్వదలచిన [[నెల్లూరు]], [[కడప]], [[చిత్తూరు]] జిల్లాలు పూర్తిగాను, కర్నూలు జిల్లాలో సగానికిపైగాను పెన్నా పరీవాహక ప్రాంతంలోనివి. కృష్ణా బేసిన్ పరిధిలోకి రావు. సాగునీటిని వేరే బేసిన్ కు తరలించడం సరైనది కాదు." కర్ణాటక తన ఈ అభ్యంతరాన్ని ట్రిబ్యునల్ కు నివేదించగా, అలా తరలించడంలో తప్పేమీ లేదని ట్రిబ్యునల్ తేల్చింది.
 
==కలివికోడి==